అన్వేషించండి
Bigg Boss Telugu OTT Participants: వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ - గెలిచేదెవరు?
బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ ని రెండు గ్రూపులుగా విడగొట్టారు నాగార్జున. ఈసారి గేమ్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుందని చెప్పారు.
![Bigg Boss Telugu OTT Participants: వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ - గెలిచేదెవరు? Bigg Boss Telugu OTT Checkout the Final List of Bigg Boss OTT Contestants Bigg Boss Telugu OTT Participants: వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ - గెలిచేదెవరు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/26/9b72ebbc44e3dbb1c5b7307d32c629ae_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ - గెలిచేదెవరు?
Bigg Boss Non-Stop Telugu Contestants: ఈరోజు నుంచి బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మొదలైంది. ఈ షో నాన్ స్టాప్ గా హాట్ స్టార్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించారు. వీరిలో కొత్త కంటెస్టెంట్స్, పాత కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు. వీరిని రెండు గ్రూపులుగా విడగొట్టారు నాగార్జున. ఈసారి గేమ్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుందని చెప్పారు. వారియర్స్ అంటే పాత కంటెస్టెంట్స్ అని.. కొత్తవాళ్లను ఛాలెంజర్స్ అని చెప్పారు నాగ్. ఆ ప్రకారం వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం!
వారియర్స్:
1.అషురెడ్డి (సీజన్ 3)
2.మహేష్ విట్టా (సీజన్ 3)
3.ముమైత్ ఖాన్ (సీజన్ 1)
4.అరియనా (సీజన్ 4)
5.నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
6.తేజస్వి మదివాడ (సీజన్ 2)
7.సరయు (సీజన్ 5)
8.హమీద (సీజన్ 5)
9.అఖిల్ సార్థక్ (సీజన్ 4)
ఛాలెంజర్స్:
1.ఆర్జే చైతు
2.అజయ్ కతుర్వర్
3.స్రవంతి చొక్కారపు
4. శ్రీరాపాక
5.అనిల్ రాథోడ్
6.మిత్రా శర్మ
7.యాంకర్ శివ
8.బిందు మాధవి
మరి వీరిలో కప్పు గెలిచేదెవరో..? ఇక ఈ షోని 24 గంటలు చూడలేని వాళ్ల కోసం హాట్ స్టార్ లో ప్రతిరోజు ఓ గంట ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేస్తారు. నిజానికి ఈ గంటలోనే మొత్తమన్నీ కవర్ అయిపోతాయన్నమాట. ప్రతివారం ఎలిమినేషన్స్, నామినేషన్స్ అన్నీ కామనే. 24 గంటల ఈ షోని 84 రోజులు కంటిన్యూస్ గా ప్రసారం చేయనున్నారు. ఈసారి కంటెస్టెంట్స్ అందరూ కాస్త పేరున్న వాళ్లు కావడంతో 84 రోజుల కంటే ఎక్కువ ఉన్నా.. ఆశ్చర్యపోనక్కర్లేదు.
షో మొత్తం సంగతేమో కానీ.. నాగార్జున హోస్ట్ చేసే రోజుల్లో మాత్రం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ముందురోజు షూటింగ్ చేయడం, దాన్ని ఎడిట్ చేసి స్ట్రీమింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. కంటెస్టెంట్స్ లో చాలా మంది ఇదివరకు హౌస్ కి వెళ్లొచ్చిన వాళ్లే. వారికి అనుభవం ఉంది కాబట్టి ఈసారి మరింత దృష్టి పెట్టి గేమ్ ఆడే అవకాశం ఉంటుంది. అయితే ప్రేక్షకుల ఫోకస్ మాత్రం కొత్త వాళ్లపై పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. పాత కంటెస్టెంట్స్ గేమ్ తీరు ఆల్రెడీ చూశారు కాబట్టి కొత్తవాళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.
Let the games begin! No comma. No full stop.
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 26, 2022
Warriors vs. Challengers!!
Vote for your favourite! #BiggBoss #BiggBossNonStop #disneyplushotstar @DisneyPlusHS @iamnagarjuna @EndemolShineIND
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
పాలిటిక్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion