Bigg Boss Telugu Day 80 Promo : ప్రేరణతో గేమ్ ఆడాలనుకున్న తనూజ.. ఫౌల్ గేమ్ ఆడినా ఓడిపోయిందా!?
Bigg Boss 9 Telugu Captiancy Task : బిగ్‌బాస్ ఇంట్లో కెప్టెన్సీ కంటెండర్స్ కోసం టాస్క్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రేరణ, తనూజకి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. హైలెట్స్ ఇవే..

Bigg Boss 9 Telugu Today Task Promo : బిగ్‌బాస్ హోజ్లో టాస్క్‌లు పెడితే.. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా ఆడి గెలిచిన వాళ్లల్లో ప్రేరణ ఒకరు. అలాంటి ఈ భామను ఈ సీజన్ 9 తెలుగులో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ కోసం తీసుకువచ్చారు. ఈ వారం కెప్టెన్సీ కోసం జరుగుతున్న రేస్‌లో వచ్చేందుకు అందరూ ఆసక్తి చూపించారు. కానీ ప్రేరణ తనూజను ఎంచుకుంది. కానీ చివరికి ఏమైంది? ఎవరు గెలిచారు? ప్రోమో హైలెట్స్ ఏంటి వంటి విషయాలు చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..
బిగ్‌బాస్‌లో లేటెస్ట్ ప్రోమోలో ప్రేరణ ఇంట్లోకి రావడాన్ని చూపించారు. ప్రేరణ అందరికీ హాయి చెప్పింది. రీతూని హాగ్ చేసుకుంది. తర్వాత మాట్లాడుతూ.. నేను చాలా బాధపడ్డాను. రెండు ఇళ్లు ఏంటి? వాళ్లకోసం ఇంకో ఇళ్లు కడుతున్నారా? ఛా మిస్ అయ్యాము అనుకున్నాను. కానీ కట్ చేస్తే అని చెప్పేసరికి.. ఇమ్మూ వీళ్లకి ఇదే కరెక్ట్ అనుకున్నావా అంటే.. హా అవును అంటూ నవ్వేసింది ప్రేరణ. ఈ రణరంగంలో చివరి కెప్టెన్సీ కోసం జరుగుతున్న యుద్ధంలో భాగంగా.. మీరు ఇంటి సభ్యుల్లో ఒకరితో గేమ్ ఆడి గెలవాల్సి ఉందని చెప్తాడు బిగ్‌బాస్.
ప్రేరణ vs తనూజ
యుద్ధంలో గెలవడానికి, తద్వారా చివరి కెప్టెన్సీని చేరువ అవ్వడానికి.. మీకు ఇస్తోన్న ఛాలెంజ్.. క్రాస్ ఇట్.. క్లైంబ్ ఇట్.. రోల్ ఇట్ అని చెప్పాడు. మరి టాస్క్ ఆడడానికి ఎవరిని ఎంచుకోవాలని ప్రేరణ అడగ్గా.. నువ్వు టఫ్ ప్లేయర్.. నాకు నీతో ఆడాలని ఉందంటూ తనూజ చెప్పింది. ప్రేరణకు ఆ ఆన్సర్ నచ్చినట్టుంది. అందుకే ఆమెను ఎంచుకుంది.
ఫౌల్ గేమ్ ఆడిన తనూజ!?
ముందుగా క్లైంబ్ చేసి పై నున్న బాల్స్ తీసుకోవాలి. తనూజ, ప్రేరణ కూడా బాగా ఆడారు. తనూజ కాస్త ముందుగానే వెళ్లింది. అయితే పైనుంచి బాల్ని కిందకి వేసి దూరంగా వెళ్లింది. దానిని సంచాలకురాలిగా ఉన్న దివ్య ఖండించింది. మళ్లీ వెళ్లి వేయమని చెప్పగా.. నేను నార్మల్‌గానే వేశాను అది ముందుకు వెళ్లిందని చెప్పి.. టాస్క్ కంటిన్యూ చేసింది. మరి తనూజ బాల్ కావాలని చేసిందో.. లేక అది అలాగే పడిందో ఎపిసోడ్ చూశాక తెలుస్తుంది.
ఎవరు గెలిచారు..
ప్రోమో ప్రకారం తనూజ ముందు స్థానంలో ఉంది కానీ.. చివరికి ఓడిపోయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికే ప్రేరణ 5 బాల్ దాని ప్లేస్‌లో సెట్ అవ్వబోతుంది. తనూజ ఇంకా వెనుక స్థానంలోనే ఉంది. అయితే లైవ్ ప్రకారం కూడా తనూజ టాస్క్ ఓడిపోయి.. కంటెండర్ రేస్ నుంచి తప్పించుకుంది. ఇప్పటికే భరణి కూడా ఓడిపోయాడు. కళ్యాణ్ ఒక్కడే కెప్టన్సీ కంటెండర్ అయ్యాడు.






















