Bigg Boss Telugu Day 59 Promo : బిగ్‌బాస్‌లో దెయ్యాల టాస్క్... తనూజని పట్టుకొని ఏడ్చేసిన తనూజ, రీతూ ఓవర్ కాన్ఫిడెన్స్
Bigg Boss Telugu Today Promo : బిగ్‌బాస్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లను భయపెట్టేందుకు ప్లాన్ చేసింది స్టార్ మా. దీనిలో భాగంగా దెయ్యాల టాస్క్ ఇచ్చింది.

Bigg Boss 9 Captaincy Task Promo : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 తొమ్మిదవ వారానికి గానూ కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. దీనిలో భాగంగా నిన్నటి నుంచి టాస్క్‌లు ఆడుతున్నారు. వివిధ టాస్క్‌లు పెట్టి.. మరికొందరికి సీక్రెట్ టాస్క్‌లు ఇచ్చి.. గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా బుధవారం కూడా టాస్క్‌లకు సంబంధించిన ప్రోమో విడుదల చేసింది స్టార్ మా. అయితే ఈసారి టాస్క్‌ల్లో భాగంగా దెయ్యాలను తీసుకొచ్చాడు బిగ్‌బాస్.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్ ఇవే..
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో చాలా ఫన్నీగా సాగింది. అయితే తనూజ మాత్రం ఏడ్చేసింది. ప్రోమో ఎలా సాగిందో.. రీతూ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఏమి చేసిందో చూసేద్దాం. ఈ టాస్క్‌లో భాగంగా టీమ్‌కి ఇస్తోన్న టాస్క్ Touch it Smell it Guess it అంటూ బిగ్‌బాస్ రూల్ చదివాడు సాయి. కానీ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రక్రియ సమయంలో యాక్టివిటీ ఏరియా చీకటిగా ఉంటుందని చెప్తాడు. ముందుగా ఆరెంజ్ టీమ్ నుంచి తనూజ లోపలికి వెళ్తుంది. సంజనా సంచాలక్‌గా చేస్తుంది.
ఏడ్చేసిన తనూజ
లోపలికి వెళ్లిన తనూజ ఫుడ్ దగ్గరికి వెళ్లే ప్రాసెస్‌లో దెయ్యాల అరుపులతో, వెలుగులతో బిగ్‌బాస్ బయపెడుతూ ఉంటాడు. తనూజ లోపల అరుస్తుండే సరికి.. బయట ఉన్న సంజన కంగారు పడిపోయింది. లోపల టాస్క్ కంప్లీట్ చేసిందో లేదో తెలియదు కానీ.. బయటకు వచ్చి మాత్రం తనూజ సంజనని పట్టుకుని ఏడ్చేసింది. సంజన ఓదార్చింది.
రీతూ ఓవర్ కాన్ఫిడెన్స్..
తనూజని చూసి.. సంజన రీతూకి జాగ్రత్త అని చెప్తుంది. ఆడపులి ఇక్కడ అంటూ రీతూ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెప్తుంది. అలాగే ఫన్నీగా చేసుకుంటూ లోపలికి వెళ్తుంది. అయితే తనూజకి మించిన డోస్ రీతూకి లోపల బిగ్‌బాస్ ఇచ్చాడు. దెయ్యాల రూపంలో ఉన్న మనుషులు రీతూని పట్టుకుని భయపెట్టారు. మొదట్లో కాస్త భయపడింది రీతూ. బయట ఉన్న సంజన బాగా నవ్వుకుంది. అయితే ఈ టాస్క్‌లో ఫుడ్ వరకు వెళ్లి పట్టుకుని రీతూ తిన్నట్లు చూపించారు. అలేగా చివర్లో రీతూ నవ్వు హైలెట్‌గా నిలిచింది ప్రోమోలో. ఇది చూసిన ఆడియన్స్ రీతూ కామెడీ టైమింగ్ బాగుందని.. రీతూని చూసి దెయ్యాలే భయపడతాయి అన్నట్లు చెప్పారు.






















