Bigg Boss Telugu Nominations Promo : బిగ్‌బాస్ 9వ వారం నామినేషన్స్ ప్రోమో హైలెట్స్.. రీతూ vs సంజన, పాపం ఇమ్మాన్యూయేల్
Bigg Boss Telugu Today Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు 9వ వారానికి నామినేషన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన మొదటి ప్రోమో వచ్చేసింది. దాని హైలెట్స్ ఏంటో చూసేద్దాం.

Bigg Boss 9 Nominations of Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు 8వ వారానికి గానూ దివ్వెల మాధురి హోజ్ నుంచి వెళ్లిపోయింది. అయితే 9వ వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం నామినేషన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ వారం ఏ టాస్క్‌తో నామినేషన్స్ పెట్టాడు. దానిలో ట్విస్ట్ ఏంటి? ఎవరి మధ్య గొడవలు జరుగుతున్నాయి? ఇమ్మూ ఈ వారమైనా నామినేషన్స్‌లోకి వచ్చాడా లేదా? ప్రోమో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రోమో హైలెట్స్..
బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు 9వ వారం నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. టెడ్డీలతో టాస్క్ ఇచ్చి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించాడు బిగ్‌బాస్. మీ ముందు కొన్ని బొమ్మలు ఉన్నాయి. వాటి మీద ఇంటి సభ్యుల ఫోటోలు ఉన్నాయి. బజర్ మోగిన వెంటనే బొమ్మల్లోని వేరే వాళ్ల ఫోటోలు ఉన్న బొమ్మలు తీసుకుని లైన్ క్రాస్ చేయాలని చెప్పాడు బిగ్‌బాస్. అలా సేఫ్ జోన్లోకి ఎవరైతే బొమ్మను తీసుకెళ్లలేకపోతారో.. బొమ్మ మీద ఫోటో ఉన్నవారు.. అలాగే బొమ్మ పట్టుకున్నవారు ఇద్దరూ నామినేషన్స్ జోన్లోకి వస్తారని చెప్పాడు.
రీతూ vs సంజన
బిగ్‌బాస్ టాస్క్ మొదలు పెట్టిన తర్వాత సంజన ఆలస్యంగా వెళ్లింది. అందరూ సేఫ్ జోన్లోకి వెళ్లాక.. టెడ్డీ తీసుకుంది. అయితే ఆ బొమ్మ రీతూదే అని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. దీంతో రీతూ నామినేషన్స్ జోన్లోకి వచ్చింది. నేను ముందు నుంచి ఎవరి సపోర్ట్ లేకుండానే గేమ్ ఆడుతున్నాను. కానీ రీతూ విషయంలో డెమాన్ పవన్ ఇన్ఫ్లూయెన్స్, సపోర్ట్ ఉన్నాయంటూ నామినేషన్స్ పాయింట్ చెప్పింది సంజన. అయితే రీతూ మీరు ఇంట్లో ఒక్కరితోనే మాట్లాడారు కాబట్టి మీకు బాండ్స్ లేవా? ఈ హోజ్లో నాకు ఒకరితో బాండ్ ఉంది. అది మీకు రాంగ్గా కనిపిస్తే నేను ఏమి చేయలేనంటూ సీరియస్‌గా చెప్పింది రీతూ.
అలాగే తనూజ దగ్గర సుమన్ శెట్టి బొమ్మ ఉంది ప్రోమోలో. వారిమధ్య కూడా డిస్కషన్ జరిగింది. అయితే చివరికి సుమన్ శెట్టి నేను సెల్ఫ్ నామినేట్ అవుతాను అంటూ ఏడ్చేశాడు. నేనే ఆలస్యంగా వచ్చాను అంటూ ఏడుస్తున్నాడు. అయితే తనూజ నేను ఇక్కడ సేఫ్‌గా లేను, మాస్క్‌తో లేను అంటూ తనని తాను డిఫెండ్ చేసుకున్నట్లు చూపించారు ప్రోమోలో. సంజన భరణిని నామినేట్ చేసే పాయింట్స్ లేవా అని అడిగినట్లు.. లేవని తనూజ చెప్పినట్లు ప్రోమోలో చూపించారు. మరి వీరిలో ఎవరు నామినేట్ అయ్యారో.. ఎపిసోడ్లో ఎలాంటి గొడవలు జరిగాయో వేచి చూడాల్సిందే. అయితే లైవ్ ప్రకారం ఇమ్మూ ఈ వారం కూడా నామినేషన్స్‌లో లేనట్లే తెలుస్తుంది.






















