(Source: ECI | ABP NEWS)
Bigg Boss Telugu Latest Promo : బిగ్‌బాస్ హోజ్లో బంగాళదుంప కూర తెచ్చిన తంట.. వరుసపెట్టి ఏడ్చేసిన కంటెస్టెంట్లు
Bigg Boss Telugu 9 Day 30 Promo : ఉదయం టాస్క్‌లకు సంబంధించిన ప్రోమో ఇచ్చిన బిగ్‌బాస్ సెకండ్ ప్రోమోగా ఏడ్పులు, నవ్వులపై ప్రోమోను విడుదల చేశారు.

Bigg Boss Telugu 9 Day 30 Latest Promo : బిగ్‌బాస్ హోజ్‌లోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీలు వస్తారంటూ స్ట్రాంగ్ టాస్కులు పెట్టిన బిగ్‌బాస్ ఉదయం దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే బిగ్‌బాస్ అంటే కేవలం టాస్క్‌లు మాత్రమే కాదుగా. ఎమోషన్స్, నవ్వులు, ఏడ్పులు ఇలా అన్ని మిళితమైన ఓ అద్భుతమైన గేమ్. అయితే ఉదయం గేమ్స్‌కి చెందిన ప్రోమోను విడుదల చేస్తే.. ఇప్పుడు ఏమోషన్స్‌తో గేమ్స్ ఆడుతూ.. ఏడిపించేశాడు బిగ్‌బాస్. ఇంతకీ సెకండ్ ప్రోమోలో దేని గురించి ఇచ్చారు? ప్రోమో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్
బిగ్‌బాస్ సెకండ్ ప్రోమో పూర్తిగా ఎమోషనల్‌గా సాగింది. ముందు ఇమ్మూ తన కామెడీతో నవ్వించినా.. తర్వాత కంటెస్టెంట్లు ఒకరి తర్వాత ఒకరు ఏడ్చేశారు. బిజినెస్ క్లాస్‌తో తిరిగే దానిని నేను.. నాతో ఇలా గిన్నెలు తోమిస్తున్నారంటూ బిగ్‌బాస్ కెమెరా వద్ద సంజన ఏడుస్తున్నట్లు కామెడీ చేసింది. పక్కనే ఉన్న ఇమ్మూ ఏమి గుడ్లు తింటున్నప్పుడు తెలియలేదా అంటే.. పక్కనే ఉన్న రీతూ.. ఆమ్ ఆమ్ అంటూ తినేశారుగా అంటూ వెక్కిరిస్తుంది. తర్వాత అందరూ బయట కూర్చోని.. మాట్లాడుకుంటారు.
బయటకు వెళ్లాక మీరు చూడాలనుకుంటుంది ఎవరు అంటూ దివ్య అడుగుతుంది. దానికి తనూజ రిప్లై ఇస్తూ.. నేను మా నాన్నని కలుస్తాను. విత్ స్పెషల్ పర్సన్ అంటుంది. దానికి ఇమ్మూ.. నాన్న, అల్లుడు, కూతురు కలుస్తారు అంటావు. అంటే అల్లుడు నేనే కదా అంటూ కామెడీ చేస్తారు. దానిని స్పోర్టివ్‌గా తీసుకున్న తనూజ.. నన్ను ఇంట్లో అంటారు అమ్ము.. నాకు ఇష్టం ఇమ్ము అంటూ రెస్పాండ్ అవుతుంది. నాకు అమ్మకావాలి అంటే.. ఇప్పుడు నాన్న ఎవరిని పెళ్లి చేసుకోవాలని భరణిని ఉద్దేశించి కామెడీ చేయగా అందరూ నవ్వేస్తారు. దానికి భరణి వాడు సెల్ఫ్ గోల్లో లేడు పదిరోజుల నుంచి ఒకటే గోల్లో ఉన్నాడు అంటారు.
ఎమోషనల్ అయిపోయిన కంటెస్టెంట్లు..
ప్రోమో సరదాగా సాగుతున్న నేపథ్యంలో కంటెస్టెంట్లు మధ్యలో ఎమోషనల్ అయిపోయారు. తనూజ తన అమ్మని గుర్తు చేసుకుంటూ ఏడ్చేసింది. మమ్మీ ఫేస్ గుర్తు చేసుకుంటేనే ఏడ్పు వచ్చేస్తుంది అంటూ తనూజ ఎమోషనల్ అవుతుంది. మరోపక్క సుమన్ శెట్టి కూడా తన ఫ్యామిలీ గుర్తు చేసుకుని బాధపడతాడు. భరణి అతనిని ఓదారుస్తాడు. సంజన కూడా తన పిల్లలను తలచుకుని ఏడుస్తుంది. శ్రీజ కూడా ఎమోషనల్ అవుతుంది. ఇంక అందరినీ చూసి ఇమ్మూ.. ఇంకెప్పుడు మీరు బంగాళదుంప చేయకండి అందరూ ఏడుస్తున్నారు అనేసరికి నవ్వేస్తారు. దీంతో ప్రోమో ఎండ్ అయిపోయింది.






















