Bigg Boss 8 Season: ఈసారి సరికొత్తగా బిగ్‌బాస్ 8 సీజన్ - రెండుగా హౌజ్ డివైడ్, కొత్త రూల్స్‌తో రసవంతరంగా ప్రేక్షకుల ముందుకు!
Bigg Boss Telugu 8 Release Date and New Rules: అతిత్వరలోనే బుల్లితెరపైకి బిగ్‌బాస్ 8 సీజన్ సందడి చేయబోతోంది. ఇటీవల విడుదలైన ప్రోమోతో బిగ్‌బాస్ 8 మరింత జోరందుకుంది. ఈ సారి కొత్త రూల్స్‌తో సరికొత్తగా
Bigg Boss Telugu 8 Release Date and New Rules of House: అతిత్వరలోనే బుల్లితెరపైకి బిగ్‌బాస్ 8 సీజన్ సందడి చేయబోతోంది. ఇటీవల విడుదలైన ప్రోమోతో బిగ్‌బాస్ 8 జోరందుకుంది. గత సీజన్ ఫైనల్ తర్వాత బిగ్‌బాస్‌ను వివాదాలు చూట్టుముట్టిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ అంటే బ్రోతల్ హౌజ్ అంటూ పొలిటిషియన్ అల్లం నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బిగ్‌బాస్ 7 ఫైనల్ రైతుబిడ్డ ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ పోలీసు కేసు వరకు వెళ్లింది. దీంతో ఇక బిగ్‌బాస్ షోనే రద్దు అవుతుందనే పరిస్థితులు వచ్చాయి.
పైగా ఈ షోకు హోస్టింగ్ చేయనని నాగార్జున నిర్వాహకులు చెప్పినట్టు రూమర్స్ వినిపంచాయి. దీంతో ఇక తెలుగులో బిగ్‌బాస్ షో ఉండే చాన్స్ లేదని అనుకున్నారు. కానీ సరికొత్త లోగోతో బిగ్‌బాస్ 8 సీజన్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల విడుదలైన బిగ్‌బాస్ లోగో టీజర్ విడుదల చేసి ఆడియన్స్‌ని సర్‌పైజ్ చేసింది స్టార్ మా. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇక గత సీజన్‌ను ఉల్లాపుల్టా అంటూ సరికొత్త థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సీజన్ కూడా హిట్ అయ్యింది.
We are bringing entertainment back with a BANG !!!!💥
— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 21, 2024
Presenting the logo for the epic Season 8 of Bigg Boss!
Are you ready for an Infinity of fun and entertainment?! #BiggBossTelugu8 @StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/9Du8wdsa0Q
హౌజ్ రెండుగా డివైడ్!
ఇక ఇప్పుడు సీజన్ 8ను సరికొత్త ప్లాన్ చేశారట. ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌ను రెండుగా డివైడ్ చేశారట. మొదటి నుంచి కంటెస్టెంట్స్ మధ్య గట్టిపోటీ ఉండబోతుందట. వారిని గ్రూప్స్‌గా డివైడ్ చేసి వేర్వేరు హౌజ్‌లో ఉంచుతారట. ఈసారి బిగ్‌బాస్ రూల్స్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నాయని టాక్. మొదటి వారంలో కంటెస్టెంట్ ఎలిమినేషన్ షాకిస్తుందని, ఈ ఎలిమినేషన్‌తో షో ఇక రసవత్తరంగా సాగుతుందని సినీవర్గాల నుంచి సమచారం. ఇందుకు కోసం ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌ను భారీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు టాస్క్‌లు కూడా విభిన్నంగా ఉండబోతున్నాయట. ఈసారి బిగ్‌బాస్ 8 సీజన్ డిఫరెంట్‌గా ప్లాన్ చేసి ఆడియన్స్‌కి అన్‌లిమిటెడ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు హోస్ట్ గార్జున రెడీ అవుతున్నారంటూ ఓ వార్త నెట్టింట చక్కుర్లు కొడుతుంది. ఇప్పటికే లోగో ఆవిష్కరణతో బిగ్‌బాస్ 8 సీజన్‌పై భారీ బజ్ నెలకొంది. ఇక ఈ వార్తతో ఈ షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అప్పుడే బిగ్‌బాస్ స్టార్ట్
ప్రస్తుతం వినిపిస్తున్న బజ్ ప్రకారం.. బిగ్‌బాస్ 8 సీజన్ ఆగస్ట్ రెండో వారంలో గ్రాండ్ లాంచ్ చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అయితే ముందు నుంచి ఉన్న సమాచారం ప్రకారం ఈ సీజన్ సెప్టెంబర్ మొదలవుతుందని అన్నారు. కానీ ఓటీటీ ప్లే సమాచారం ప్రకారం ఆగస్ట్‌లోనే ఈ సీజన్‌ను ప్లాన్ చేశారట. అప్పుడు కాకపోతే ఆగస్ట్ చివరి వారం లేదు సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో మొదలయ్యే అవకాశం ఉందని టాక్.
నాగార్జున భారీ పారితోషికం
ఉల్లా పుల్టా గత సీజన్‌ను నాగార్జున చాలా ఆసక్తిగా నడిపించారు. రూల్స్ అన్ని మార్చేసి కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. అవన్ని కూడా వర్క్ అవుట్ అయ్యి గత సీజన్ మంచి విజయం సాధించింది. అంతేకాదు బుల్లితెపై అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. చెప్పాలంటే ఈ షో హిట్‌లో నాగార్జున హోస్టింగ్ కీలకం అని చెప్పాలి. ఎలాంటి సిట్య్యూవేషన్ అయినా తనదైన స్టైల్లో హ్యాండిల్ చేస్తారు. తప్పు చేసిన కంటెస్టెంట్స్ స్వీట్ వార్న్ చేస్తారు. బాగా ఆడిన వారిని ప్రశంసిస్తారు. వెనకబడిన వారిని వారిస్తూ ప్రోత్సాహిస్తారు. అలా హోస్ట్‌గా గత సీజన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకువెళ్లిన నాగార్జున పారితోషికం కూడా భారీగానే తీసుకున్నారట. ఈ సారి కూడా సీజన్ 8 కోసం భారీ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌కు రెమ్మునరేషన్ పెంచినట్టు టాక్.
Also Read: దర్శకుడితో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ - జైలుకు వెళ్లిన దర్శన్ కలిపిన జంట!