Bigg Boss 8 Day -12 Promo 2 : ఎమోషనల్ సర్ప్రైజ్, ఒక్కొక్కరి స్టోరీతో ప్రోమో ద్వారానే ఏడిపించిన బిగ్ బాస్... ఆ ఐదుగురికే ఫ్యామిలీని కలిసే ఛాన్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 12కు సంబంధించిన 2వ ప్రోమో తాజాగా రిలీజ్ కాగా, ఆడియన్స్ ను కంటతడి పెట్టించేలా ఉంది. మరి ఆ ప్రోమో విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 12 కు సంబంధించిన రెండవ ప్రోమోను బిగ్ బాస్ నిర్వాహకులు తాజాగా రిలీజ్ చేశారు. మొదటి ప్రోమో మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగగా, రెండో ప్రోమో మాత్రం ఎమోషనల్ సర్ప్రైజ్ తో నిండిపోయింది. ఒక్కొక్కరిది ఒక్క స్టోరీ చూపించి ప్రోమోతోనే ప్రేక్షకులను కండతడి పెట్టేలా చేశారు బిగ్ బాస్. అయితే అందరికీ తమ ఫ్యామిలీని కలిసే అవకాశాన్ని ఇవ్వకుండా కేవలం ఐదు మందికి మాత్రమే ఆ ఛాన్స్ దక్కుతుంది అంటూ ట్విస్ట్ ఇచ్చారు. మరి ఫ్యామిలీని కలవబోతున్న ఐదుగురు ఎవరు? ఈ ప్రోమో విశేషాలు ఏంటి? అని విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
ఎమోషనల్ సర్ప్రైజ్...
ప్రోమో మొదట్లోనే ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మీకు ఇష్టమైన వారిని మీరు మిస్ అవుతున్నారని బిగ్ బాస్ కి తెలుసు. ఐదుగురు ఇంటి సభ్యులకు వారి ఇంటి నుంచి గిఫ్ట్స్ పొందే అవకాశం ఉంది. కానీ ఆ ఐదుగురు ఎవరు అన్నది మీతో ఉన్న ఇంటి సభ్యులపై ఆధారపడి ఉంటుంది అంటూ ట్విస్ట్ ఇచ్చారు. నిజానికి ఇంటి నుంచి గిఫ్ట్స్ అనేసరికి హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కానీ ఎవరు ఆ గిఫ్ట్ లు తీసుకోవాలి అనేది తోటి హౌజ్ మేట్స్ పై ఆధారపడి ఉంటుంది అని చెప్పడంతో ఒక్కొక్కరూ తమ స్టోరీని చెప్తూ అవతలి వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినట్టుగా ప్రోమోలో చూపించారు.
నిఖిల్ తన తండ్రి షర్ట్ చూసి "సాధారణంగా అబ్బాయిలు తండ్రులను హగ్ చేసుకోలేరు. అందుకే నేను మా నాన్న షర్ట్ ని దొంగతనం చేశాను" అంటూ ఏడ్చాడు. అభయ్ "నేను సినిమాల్లోకి అడుగు పెట్టాక సంపాదించిన ఫస్ట్ శాలరీతో డాడీకి కొనిచ్చిన ఫస్ట్ వాచ్. ఆయన ఉన్నన్ని రోజులు చేతికి దాన్నే పెట్టుకున్నాడు" అని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత సీత తన లవ్ స్టోరీ గురించి వివరించింది. "ఐదేళ్లు రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత అతను వదిలేసి వెళ్లిపోయినప్పుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు. కుమార్ ఐ మిస్ యు" అంటూ ఎమోషనల్ అయ్యింది సీత. ఆ తర్వాత నైనిక "అబ్యూజివ్ రిలేషన్షిప్ తర్వాత నేను హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఒక పర్సన్ వల్ల హీల్ అయ్యాను అంటే అది తనే. థాంక్యూ ఫర్ లవింగ్ మీ" అంటూ అక్కడ పెట్టిన ఏనుగు బొమ్మను చూస్తూ ఏడ్చేసింది నైనిక. అయితే ప్రోమోలో అభయ్ తన ఛాన్స్ ని సీతకు ఇచ్చేసినట్టుగా కనిపించింది. "తనేం ఫీలవుతుందో ఐ కెన్ ఫీల్ ఇట్" అంటూ నిఖిల్ కూడా తన ఛాన్స్ ని వదిలేసినట్టు చూపించారు ప్రోమోలో. అయితే ఇరువురిలో ఎవరి దగ్గర తక్కువ లాలీపాప్స్ ఉంటే వాళ్ళు ఈ అవకాశాన్ని కోల్పోతారని బిగ్ బాస్ ప్రకటించగా, హౌస్ మేట్స్ అందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. ప్రోమో అయితే ఆడియన్స్ ను కూడా కన్నీళ్ళు పెట్టించేలా ఉంది.
Read Also: అమ్మో బేబక్క వాచ్ ధర అన్నీ కోట్లా!? ఏ ప్లానెట్ నుంచి తెచ్చిన మెటలో తెలిస్తే ఫ్యూజులు ఔట్