Prince Yawar: వారేవ్వా, యావర్ - జీరోగా వచ్చి.. హీరో అయ్యాడు, ఆ ఇద్దరి వల్లే ట్రోఫీ దూరం?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఎంటర్ అయినప్పుడు యావర్ అంటే ఎవరికీ తెలియదు.. అంటే ఒక జీరోలాగా ఎంటర్ అయ్యి.. ఇప్పుడు హీరో అయిపోయాడు. కానీ గ్రూప్ గేమ్ ప్రారంభించి ఆటలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్ అందరిలో ప్రేక్షకులకు తక్కువ పరిచయం ఉన్న కంటెస్టెంట్ యావర్. తను సీరియల్స్‌లో నటుడిగా కనిపించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో పల్లవి ప్రశాంత్‌తో పాటు యావర్ కూడా ఎక్కువమంది ప్రేక్షకులకు తెలియని లిస్ట్‌లో యాడ్ అయిపోయాడు. కానీ బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన తర్వాత తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. జీరోగా వచ్చి హీరో అయ్యాడు. ప్రస్తుతం యావర్‌కు మాత్రమే ప్రత్యేకంగా ఓట్లు వేసే ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్నాడు. కానీ తను ఫ్రెండ్స్ అనుకున్నవారి వల్లే బిగ్ బాస్ సీజన్ 7 ట్రోఫీకి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కండబలంలో నెంబర్ వన్
యావర్‌కు కండబలం చాలా ఉంది. అందుకే బిగ్ బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్కుల్లో ఇతర కంటెస్టెంట్స్ తనతో పోటీకి దిగినా.. చాలావరకు ఓడిపోయేవారు. టీమ్స్‌గా ఆడిన చాలావరకు ఆటల్లో ముందుండి తన టీమ్‌ను గెలిపించుకున్నాడు యావర్. యావర్‌కు కోపం ఎక్కువ. దాంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే. అందుకే తన కష్టాలన్నీ చెప్పుకోవడంతో దగ్గరైన శివాజీని తన గురువులాగా భావించాడు. శివాజీ.. తనకు దగ్గరవ్వడంతో పల్లవి ప్రశాంత్ కూడా దగ్గరయ్యాడు. కోపంలో ఏమైనా మాట్లాడినా కూడా మళ్లీ వెంటనే వెళ్లి వారితో కలిసిపోయేవాడు యావర్.
తన కుటుంబం ఆర్థికంగా చాలా వెనకబడి ఉందని, తన కుటుంబం కోసం ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో బిగ్ బాస్‌లోకి వచ్చానని తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకొని ప్రేక్షకుల దగ్గర సింపథీ కొట్టేశాడు. బిగ్ బాస్ సీజన్ 7లో ఎక్కువగా తను వ్యక్తిగతంగా ఆడేవాడు. కానీ శివాజీ, ప్రశాంత్‌లతో స్నేహంతో ‘స్పై’ బ్యాచ్ సభ్యుడిగా మారిపోయాడు. వ్యక్తిగతంగా ఆడినప్పుడు తనకు ప్లస్ అయిన ఎన్నో విషయాలు.. గ్రూప్‌లోకి చేరిన తర్వాత మైనస్‌లుగా మారాయి. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన కొత్తలో ఎవరు తన గురించి ఏం మాట్లాడినా.. ఎప్పుడూ కాన్ఫిడెన్స్ కోల్పోని యావర్.. గతకొంతకాలంగా చాలా వీక్ అయిపోయాడు.
‘స్పై’ బ్యాచ్ వల్ల ఒకటి ప్లస్, ఒకటి మైనస్
బిగ్ బాస్ సీజన్ 7లో అందరికంటే ముందుగా పెద్ద గొడవను క్రియేట్ చేసిన మొదటి కంటెస్టెంట్ యావర్. గౌతమ్‌తో ఒక సందర్భంలో జరిగిన వాగ్వాదం వల్ల యావర్‌కు ఎంత కోపం ఉంది అనే విషయం ప్రేక్షకులకు తెలిసింది. అయితే కోపం ఉన్నా కూడా అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తాడని కొందరు ప్రేక్షకులు ఫీలయ్యారు. కానీ చాలామంది మాత్రం.. కోపం వచ్చినప్పుడు యావర్ ప్రవర్తన పూర్తిగా మారిపోతుందని, పిచ్చోడిలాగా ప్రవర్తిస్తాడని, విచక్షణ ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వ్యక్తిగతంగా, ఎవరి మాట వినకుండా ఆడినప్పుడు యావర్‌కు ప్రేక్షకుల దగ్గర నుంచి పెద్దగా సపోర్ట్ దొరకలేదు. కానీ ప్రశాంత్, శివాజీలతో కలిసి ‘స్పై’ గ్రూప్‌లో చేరిన తర్వాత తన ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. కానీ గేమ్ మాత్రం తగ్గిపోయింది. ఒకప్పుడు టాస్క్ అనగానే ముందు, వెనుక ఆలోచించకుండా రంగంలోకి దూకే యావర్.. మెల్లగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తనపై తాను నమ్మకం పోగొట్టుకొని వీక్ అయిపోయాడు.
ఫ్యామిలీ వీక్ సమయంలో తన అన్న వచ్చి ధైర్యం చెప్పిన తర్వాత యావర్.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు అనిపించినా కూడా తన ఆటపై మాత్రం ఫోకస్ తగ్గిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. గంట ఎపిసోడ్‌లో యావర్ కనీసం అయిదు నిమిషాలు కూడా కనిపించడం లేదని, ఒకవేళ కనిపించినా.. శివాజీతో కబుర్లు చెప్తూ మాత్రమే కనిపిస్తున్నాడని అనుకుంటున్నారు. ‘స్పై’ బ్యాచ్ వల్లే యావర్.. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవ్వకుండా మిగిలిపోతున్నాడని సోషల్ మీడియాలో పోల్స్ చెప్తున్నాయి. స్పై బ్యాచ్‌లో ఎక్కువ ఓట్లు.. పల్లవి ప్రశాంత్, శివాజీకే పడుతున్నాయి. దీంతో యావర్ వెనక్కి వెళ్లి.. మూడో స్థానానికి ఎగబాకాడు అమర్. ప్రశాంత్‌కు ఓటింగ్ పెరిగితే.. అమర్ దీప్ రెండో స్థానంలోకి చేరుకుని ప్రశాంత్‌కు పోటీ అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: అశ్వినీని పెళ్లి చేసుకుంటా - మనసులో మాట బయటపెట్టేసిన యావర్, శ్రీముఖి షాక్!