Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth : కలగన్నాడు, సాధించాడు - ‘బిగ్ బాస్’ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్, రైతుబిడ్డ గురించి ఈ విషయాలు తెలుసా?
Pallavi Prashanth: ‘బిగ్ బాస్’ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ దీప్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ప్రశాంత్ గురువు శివాజీ మూడో స్థానంలో నిలిచాడు.
Bigg Boss Telugu Season 7 Winner Pallavi Prashanth : ఒక సామాన్యుడు.. అసామాన్యుడు కావడమంటే మాటలు కాదు. కానీ, రైతు బిడ్డగా ఎలాంటి ఫాలోయింగ్ లేకుండా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. చివరికి ‘బిగ్ బాస్’ విన్నర్‌గా బయటకు వచ్చాడు. ఎప్పటికైనా ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లడమే తన లక్ష్యమని ఎన్నోసార్లు పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా వేదికలపై చెప్పాడు. చాలామంది అతడిని హేళన కూడా చేశారు. కానీ, ప్రశాంత్ అవేవీ పట్టించుకోలేదు. చివరికి ‘బిగ్ బాస్’ హౌస్‌లో అడుగుపెట్టాడు. తన కలను నెరవేర్చుకున్నాడు.
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అడుగుపెట్టడం అంటే మాటలు కాదు. ఇందుకు నిర్వాహకులు ఎన్నో ఆలోచిస్తారు. ఆ కంటెస్టెంట్ షోకు ప్లస్ అవుతాడు అనుకుంటేనే అవకాశం ఇస్తారు. మొత్తానికి పల్లవి ప్రశాంత్ వాళ్లను మెప్పించి హౌస్‌లోకి వచ్చాడు. అయితే, హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. నిలదొక్కుకోవడం కోవడం పెద్ద టాస్కే. ఆ విషయంలో పల్లవి ప్రశాంత్ ఏం చేస్తాడా అని అంతా అనుకున్నారు. మొదట్లో రతికాతో లవ్ ట్రాక్ వల్ల విమర్శలు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత ఆమెకు దూరంగా ఉంటూ తన ఆట తీరు మెరుగుపరుచుకున్నాడు. ప్రతి టాస్కును ప్రాణం పెట్టి ఆడేవాడు. బలమైన గాయాలైనా ఏ రోజు వెనక్కి తగ్గలేదు. మరో వైపు శివాజీ రూపంలో ప్రశాంత్‌కు ఒక గురువు దొరికాడు. ఆయన కనుసన్నల్లో తన ఆటతీరును మెరుగుపరుచుకున్నాడు. హౌస్‌లో అందరి మనసు గెలుచుకున్నాడు. అమర్‌తో విభేదాలు వచ్చినా.. అవి కేవలం నామినేషన్స్ వరకే. అతడితో కూడా ఎంతో స్నేహంగా మెలుగుతూ మెప్పించాడు. రైతుబిడ్డగానే కాకుండా కంటెస్టెంట్‌గా కూడా తానేంటో అనేది నిరూపించుకున్నాడు.
గురువు శివాజీ ఓట్లనే కొల్లగొట్టిన రైతు బిడ్డ
మొదట్లో శివాజీయే విన్నర్ అని అనుకున్నారంతా. కానీ, ఆ లెక్కలన్నీ మార్చేశాడు పల్లవి ప్రశాంత్. శివాజీ చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ఆయన అభిమానులు పల్లవి ప్రశాంత్‌ను లైక్ చేయడం మొదలుపెట్టారు. బయట కూడా ప్రశాంత్‌కు ఓటు వేయాలనే ప్రచారం జోరుగా సాగింది. ఫలితంగా ప్రశాంత్‌కు బోలెడన్నీ ఓట్లు వచ్చాయి. అయితే, సీరియల్ ప్రియులు.. అమర్ దీప్‌కు కూడా గట్టిగానే ఓట్లేశారు. దీంతో నువ్వా నేనా అన్నట్లుగా ఓటింగ్ సాగినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య పోటీ ఫలితంగా శివాజీకి ఓటింగ్ తగ్గిపోయినట్లు తెలుస్తోంది. అయితే, పల్లవి ప్రశాంత్ విజేత అయితే శివాజీకీ సంతోషమే. అందుకే అభిమానులు కూడా ఈ విషయంలో పెద్దగా ఆలోచించలేదు. ప్రశాంత్‌కే ఛాన్స్ ఇచ్చారు. అలాగే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో కూడా ఒక సామాన్యుడు విన్నర్ కావడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ నేపథ్యంలో బీబీ హిస్టరీలో ప్రశాంత్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
పల్లవి ప్రశాంత్ ప్లస్ పాయింట్స్ ఇవే:
⦿ శివాజీ.. పల్లవి ప్రశాంత్‌ను ఎంకరేజ్ చేసినా తన ఆట తీరులో ఏ రోజు నిర్లక్ష్యం చేయలేదు. టాస్కుల విషయంలో అందరికీ గట్టి పోటీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్.
⦿ పట్టుదలతో ఆడాలన్నా, గేమ్‌పై ఫోకస్ పెట్టాలన్న ప్రశాంత్ తర్వాతే ఎవరైనా.
⦿ కంటెస్టెంట్స్ సైతం ప్రశాంత్‌కు గేమ్‌పై ఫోకస్ ఎక్కువ అని ప్రశంసించారు. అదే ఫోకస్‌తో ‘బిగ్ బాస్ సీజన్ 7’లో కెప్టెన్ అయ్యాడు, పవర్ అస్త్రా సాధించుకున్నాడు.
⦿ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం జరిగిన పోటీలో కూడా తానే విన్ అయ్యాడు.
⦿ పల్లవి ప్రశాంత్‌కు గేమ్ ఎలా ఆడాలో తెలుసు, ఎటూ డైవర్ట్ అవ్వకుండా ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలో తెలుసు అని ప్రేక్షకులు అనుకునేలా చేశాడు.
⦿ టాస్కుల్లో బలమైన గాయాలైనా సరే తగ్గేదేలే అంటూ ముందుకు సాగాడు ప్రశాంత్. మైండ్ గేమ్స్‌కు దూరంగా ఉంటూ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.
Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కథేంటి? బిగ్ బాస్ వరకు ఎలా వచ్చాడు?