‘బిగ్ బాస్’ హౌస్ అంతా డొల్ల - ఫర్నీచరే లేకుండా షాకిచ్చిన పెద్దాయన, కంటెస్టెంట్లకు దబిడి దబిడే
‘బిగ్ బాస్’ సీజన్ 7.. నాగ్ చెప్పినట్లే ఉల్టా-ఫల్టాగా మొదలైంది. పవర్ అస్త్ర.. సూట్ కేస్.. ఇలా చాలానే ఉన్నాయ్. అన్నట్లు ఇంట్లో అస్సలు ఫర్నీచరే లేదండోయ్.
‘బిగ్ బాస్’ సీజన్ -7 ప్రారంభమైపోయింది. అయితే, ఈ సారి రూల్స్‌ను పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు బిగ్ బాస్‌లోకి వచ్చే కంటెస్టెంట్లు ఎవరూ కన్ఫార్మ్ కాదని.. ‘పవర్ అస్త్ర’ సాధించనవారు మాత్రమే ఇంట్లో ఉంటారు. మిగతావారు బయటకు వెళ్లిపోతారని కొత్త లాజిక్ చెప్పారు నాగ్. అలాగే.. ఈ సారి ఎప్పటిలా ఆయన బిగ్ బాస్ హౌస్‌లో అడుగు కూడా పెట్టలేదు. రొటీన్‌కు భిన్నంగా.. త్వరగానే ఫస్ట్ కంటెస్ట్‌ను పరిచయం చేశారు. ‘జానకి కలగనలేదు’లో జానకి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక జైన్ మొదటి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. దీంతో ఆమెనే ప్రేక్షకులకు హౌస్ చూపించమని నాగ్ చెప్పారు. దీంతో ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఊహించని షాక్.. ఫర్నీచర్ ఏది బిగ్ బాస్?
హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంకకు ఊహించని షాక్ ఎదురైంది. లోపల డైనింగ్ టేబుల్ గానీ, బెడ్స్ మీద పరుపులు గానీ లేకపోవడంతో ఆశ్చర్యపోయింది. మూడు బెడ్ రూమ్స్‌లోకి కనీసం ఎంట్రీ కూడా లేదు. దీంతో ఇదేంటి బిగ్ బాస్ అని ప్రియాంక షాకైంది. దీంతో నాగార్జున స్పందిస్తూ.. ‘‘ఫర్నీచర్ ఇప్పుడు ఉండదు. మీరే సంపాదించుకోవాలి’’ అని సమాధానం చెబుతారు. ఆ తర్వాత ఫర్నీచర్ ఉన్నప్పుడు ‘బిగ్ బాస్’ హౌస్ ఎలా ఉంటుందో చూడండని.. మరో వీడియోను చూపించారు. మొత్తానికి నాగార్జున ఆ ఇంట్లోకి అడుగుపెట్టకుండానే.. ఈసారి ‘బిగ్ బాస్’ ప్రారంభమైపోవడం గమనార్హం. చూస్తుంటే.. ఇలాంటి ట్విస్టులు ముందు ముందు ఇంకా చాలానే ఉంటాయనిపిస్తోంది. ఇక ప్రజలు గానీ.. రివ్యూలు రాసేవారి గానీ గెస్ చేయకుండా ‘బిగ్ బాస్’ను నిర్వహించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అప్పుడే సూట్ కేసు ఇచ్చేశారు
సాధారణంగా సీజన్ ఎండింగ్‌లో టాప్-5 సభ్యులు ఉన్నప్పుడు సూట్ కేసు వస్తుంది. అయితే, ఈ సీజన్‌లో ముందుగానే సూట్ కేస్ ఇచ్చేశారు. అయితే, ఈ సూట్ కేసును దాచి పెట్టేయాలని ప్రియాంకకు చెప్పారు నాగ్. ఒక వేళ ఆ సూట్ కేసు ఎవరికైనా దొరికితే.. పవర్స్ వారికి వెళ్లిపోతాయని చెప్పింది. దాన్ని తీసుకువెళ్లొచ్చా లేదా అనే నిర్ణయం కూడా మీరే తీసుకోవాలని చెప్పడంతో.. ప్రియాంక సూట్‌కేసు తీసుకెళ్లడానికే మొగ్గు చూపింది. అయితే, అది డబ్బు సూట్ కేసు కదాని తెలుస్తోంది. అందులో పవర్స్ ఉన్నాయనిపిస్తోంది. ఆమె దాన్ని జైలులోని బాత్రూమ్‌లో ఆ సూట్‌కేసును దాచిపెట్టింది.
హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో శివాజి
హీరో శివాజీ ‘బిగ్ బాస్’ సీజన్ 7 తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. చాలా ఏళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న ఆయన షోలోకి రావడంతో ‘బిగ్ బాస్’సై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘‘నాకు సంబంధం లేదు మీడియా అనేది. బతకడానికి వచ్చాను. సినిమాల్లో చేయాలని అనుకోలేదు. అనుకోకుండా వచ్చాను. ఫస్ట్ సినిమా ఇక్కడే చేశా. ఫస్ట్ చెక్ మీరే ఇచ్చారు. నాలుగు రోజులు ఎక్స్‌ట్రా చేశానని చెప్పి పాతిక వేలు ఎక్కువ ఇచ్చారు. ఆ డబ్బుతో నేను ల్యాండ్ కొన్నాను. అది ఇప్పుడు చాలా అయ్యింది. శివాజీ.. మీ సినిమాలు చూస్తున్నప్పుడు తిట్లు పడుతున్నాయి. మీరు ఇంకా యంగ్‌గా ఉన్నారు. మేం పొట్ల పెంచుతున్నాం అని తిడుతున్నారు.’’ అనగానే.. నాగ్ కూడా ఆయన.. శివాజీ భార్యతో ఫన్నీగా మాట్లడారు. ‘‘నేను ఇలా ఉన్నా.. శివాజీ అలా ఉన్నాడు’’ అని ఆయన అన్నారు.
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీళ్లే
1. ప్రియాంక జైన్ (‘జానకి కలగనలేదు’ సీరియల్ నటి)
2. శివాజీ (హీరో)
3. దామిని (సింగర్)
4. ప్రిన్స్ యవార్ (‘నా పేరు మీనాక్షి’ నటుడు)