Gautham Krishna vs Shivaji: నన్ను డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసేయండి - బిగ్ బాస్‌ను కోరిన గౌతమ్, శివాజీ తీరుపై ఆగ్రహం
Bigg Boss Telugu 7: శివాజీతో నువ్వా నేనా అన్నట్లుగా ఉంటున్న గౌతమ్.. చివరికి తనను హౌస్ నుంచి ఎలిమినేట్ చేయాలని నేరుగా బిగ్ బాస్‌నే అడిగేశాడు. ఇందుకు కారణాలివే.
Bigg Boss Telugu 7: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఈ వారం గౌతమ్ vs శివాజీ అన్నట్లుగా వార్ సాగింది. పలు సందర్భంగాల్లో శివాజీ.. గౌతమ్ కెప్టెన్సీపై విమర్శలు కూడా చేశాడు. అలాగే బాల్స్ టాస్కులో కూడా అతడితో వాదనకు దిగాడు. ఆటలో గౌతమ్ చెప్పే ప్రతి పాయింట్‌ను అడ్డుకుంటూ శివాజీ తన మాట గెలిచేందుకు ప్రయత్నించాడు. అయితే, గౌతమ్ పాయింట్స్ లేవదీయడంతో ‘‘నీతో నేను వాదించలేను’’ అని తప్పించుకున్నాడు. శుక్రవారం లైవ్ టెలికాస్ట్ చూసినవారికి శివాజీ గేమ్ తప్పకుండా అర్థమయ్యే ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గౌతమ్.. తనను డైరెక్టుగా ఎలిమినేట్ చేయాలని ‘బిగ్ బాస్’ను కోరాడు.
అసలు ఏమైంది?
శివాజీ ఆట తీరును అశ్వినీ కూడా గమనించింది. ఈ సందర్భంగా ఆమె భోలేతో మాట్లాడుతూ.. ‘‘శివాజీ అంటే నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్‌లోకి వచ్చే ముందు మా ఇంట్లో వారు కూడా ఇదే చెప్పారు. శివాజీతో మంచిగా ఉండు అన్నారు’’ అని తెలిపింది. కానీ, ఆయన కొంతమందిని మాత్రమే ప్రోత్సహిస్తున్నారు. అందరితో ఒకలా ఉండటం లేదని అంది. ఆ తర్వాత ఆమె గౌతమ్‌తో మాట్లాడుతూ.. ‘‘గ్రూపులో ఉన్నప్పుడు కూడా శివాజీ, వాళ్లంతా గౌతమ్‌ను తీసేయాలి. అల్రెడీ కెప్టెన్‌గా ఉన్నాడు అంటున్నారు. అంటే అల్రెడీ కెప్టెన్‌గా ఉన్న అర్జున్ ఆడొచ్చా? యావర్ ఆడొచ్చా’’ అని అంది. ‘‘అందుకే నేను ఆడకూడదని అనుకున్నా’’ అని అన్నాడు. ‘‘ఆయనకు (శివాజీకి) లాస్ట్ మినిట్‌లో ఎలా మాట్లాడాలో తెలుసు. ఆడియెన్స్ బ్యాడ్‌గా అనుకుంటారని, నీ తరపున ఆడతా అని అన్నారని అశ్వినీ తెలిపింది. (గౌతమ్‌కు బదులుగా శివాజీ ఆడతానని ముందుకు వెళ్లడాన్ని లైవ్‌లో చూపించారు. అంతకు ముందు ఆయన గౌతమ్ ఆడకూడదని గ్రూపులో చర్చించారు. ఇదే విషయంపై అశ్వినీ, గౌతమ్ మాట్లాడుకోవడాన్ని ఈ రోజు ఎపిసోడ్ చివర్లో చూపించారు).
నేను నామినేషన్స్‌లో లేను.. నేరుగా ఎలిమినేట్ చెయ్యండి: గౌతమ్
గౌతమ్ ఫస్ట్ నుంచి ఎలిమినేషన్స్‌కు బయటపడుతున్నట్లు కనిపించడం లేదు. అలాగే, మొత్తం హౌస్‌మేట్స్‌లో శివాజీని నామినేట్ చేసే ధైర్యం కూడా కేవలం గౌతమ్‌కు మాత్రమే ఉంది. మిగతావారు ఆయనతో పెట్టుకోకపోవడమే బెటర్ అని వెనుకంజ వేస్తున్నారు. అందుకే, శివాజీ కూడా ఛాన్స్ దొరికినప్పుడు గౌతమ్ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. అలాగే, అమర్‌ను శివాజీ టార్గెట్ చేసుకున్నారు. బాల్స్ టాస్క్ జరుగుతున్నప్పుడు కూడా శివాజీ.. ‘‘నువ్వు డాక్టర్‌వి, ఎథిక్స్ ఉండాలి’’ అని అన్నాడు. అయితే, బిగ్ బాస్‌లో ఆడే ఆటకు వృత్తికి లింక్ పెట్టడం ఏంటని ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు.
శివాజీ తనని టార్గెట్ చేసుకుంటున్నారని భావించిన గౌతమ్.. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌కు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తనని కన్ఫెషన్ రూమ్‌కు పిలవాలని కోరాడు. ఈ సందర్భంగా కెమేరా ముందు శివాజీ గురించి మాట్లాడాడు. ‘‘కొన్ని విషయాలు చాలా చాలా తప్పుగా ఉన్నాయి. వాటిని నేను అంగీకరించను. అదే జరిగితే నేను షో నుంచి బయటకు వెళ్లడానికి కూడా సిద్ధం. నన్ను ఎలిమినేట్ చేసేయండి. గేమ్‌కు ముందు శివాజీ అందరినీ పిలిచి గౌతమ్ అల్రెడీ కెప్టెన్ అయ్యాడు. మళ్లీ అవ్వకూడదు అన్నాడు. అదే లాజిక్ అర్జున్, యావర్‌లకు కూడా వర్తిస్తుంది కదా. ఫిజికల్ గేమ్‌కు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి.. నీతి, నిజాయతీ, ధర్మం అని చెబుతాడు. ఆయనలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అవన్నీ మా కంటికి కనిపిస్తున్నాయి. స్లైడ్ చేస్తూ బటర్ రాస్తూ తప్పించుకుంటున్నాడు. ఆయన ఈ షో విన్ కావచ్చు.. కప్ కొట్టవచ్చు. ప్రైజ్ విన్ కావచ్చేమో. అది మేటర్ కాదు. అట్లాంటిది ఏమైనా ఉంటే ఎలిమినట్ చేసేయండి. నేను నామినేషన్స్‌లో కూడా లేను ఎలిమినేట్ చేసేయండి. నాగ్ సార్‌ను కూడా ఈ విషయాన్ని అడుతాను. హౌస్‌లో ఎవరెవరు ఎలాంటివారో లిస్ట్ రాసి చెప్పగలను. నాతో ఎవరూ బ్లఫ్ చేయలేరు. నాకు జస్టిస్ కావాలి. ఆన్సర్ కావాలి’’ అని గౌతమ్ చెప్పాడు.
Also Read: భోలేను కడుపులో గుద్దిన అమర్‌దీప్ - శివాజీని వదలని బ్యాడ్ బాయ్, అశ్వినీ ఏడుపు