News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss Tamil 7: పృథ్విరాజ్ to అబ్బాస్ - ‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ వీళ్లేనట!

తమిళ బిగ్ బాస్ షో ప్రేక్షకులను అలరించబోతోంది. అక్టోబర్ 1 నుంచి 7వ సీజన్ టెలీకాస్ట్ కానుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీరేనంటూ ఓ లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 
Share:

ప్పటికే తెలుగు ప్రేక్షకులను బిగ్ బాస్ రియాలిటీ షో అలరిస్తుండగా, అటు తమిళంలోనూ బిగ్ బాస్ షో టెలీకాస్ట్ కు రెడీ అవుతోంది. అక్టోబర్ 1 నుంచి బిగ్ బాస్ తమిళ్ 7వ సీజన్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నది. ఈ షో మరో వారం రోజుల్లో మొదలుకానున్న నేపథ్యంలో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈసారి బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీరేనంటూ కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. బబ్లూ పృథ్విరాజ్

ప్రముఖ నటుడు బబ్లూ పృథ్విరాజ్ ఈసారి తమిళ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అడుగు పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన, ఆ తర్వాత ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘దేవుళ్లు’ సహా పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తమిళ్ తో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్ లో నటించారు. ఆయన కీలక పాత్ర పోషించిన ‘ఇంటింటి గృహలక్ష్మి’, ‘అర్ధాంగి’ లాంటి సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.   

2. డాన్స్ మాస్టర్ శ్రీధర్

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు శ్రీధర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

3. జోవికా విజయ్‌ కుమార్

జోవికా విజయ్‌ కుమార్ ప్రముఖ తమిళ నటి. నటి వనిత విజయ్‌ కుమార్ కుమార్తె. 2019లో వనిత తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొన్నది. సీజన్ 3 షో నుండి ఎలిమినేట్ అయిన రెండవ కంటెస్టెంట్ గా నిలిచింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అయినా, టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. ఈసారి వనిత కూతురు జోవికా విజయ్‌ కుమార్‌ బీబీ హౌస్‌లోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది.

4. కుమారన్ తంగరాజన్

నటుడు కుమారన్ తంగరాజన్ కూడా బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతడు పలు సినిమాలతో పాటు షోలలోనూ కనిపించి అలరించాడు. ఆయన కూడా రియాల్టీ షోలోకి ఎంట్రీ ఇస్తాడని నెటిజన్లు భావిస్తున్నారు.

5. రాజలక్ష్మి సెంథిల్

సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ప్రముఖ గాయని రాజలక్ష్మి సెంథిల్ కూడా ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె జానపద గాయనిగా తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ సింగర్ 6లో కూడా పాల్గొంది. మ్యూజిక్ రియాలిటీ షోలో పాల్గొన్న ఆమె, ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది.   

6. బైల్వాన్ రంగనాథన్

నటుడు, జర్నలిస్ట్ బైల్వాన్ రంగనాథన్ ఈసారి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం ఉంది.

7. ఇంద్రజ శంకర్

నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్‌ కూడా ఈసారి బిగ్ బాస్ 7 తమిళ్‌ లో కంటెస్టెంట్‌గా పాల్గొంటుందని ప్రచారం జరుగుతుంది. ఆమె ఇప్పటికే పలు చిత్రాల్లో నటించింది. 

8. శ్రీదేవి విజయ్‌కుమార్‌

ఈసారి శ్రీదేవి విజయ్‌కుమార్ కూడా బిగ్ బాస్ షోలో పాల్గొంటుందనే టాక్ నడుస్తోంది. యాంకర్, మోడల్, వీడియో జాకీ, డ్యాన్సర్ అయిన శ్రీదేవి, 1992 తమిళ చిత్రం ‘రిక్షా మామా’లో చైల్డ్ ఆర్టిస్ట్‌ గా కనిపించింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో కనిపించింది. శ్రీదేవి ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్ కుమార్తె. ఈ ఏడాది శ్రీదేవి బీబీ హౌస్‌లోకి అడుగుపెడుతుందని అంతా అనుకుంటున్నారు.

9. న్యూస్ రీడర్ రంజిత్

ప్రముఖ తమిళ టీవీ న్యూస్ ప్రెజెంటర్ రంజిత్ కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొంటారని తెలుస్తోంది. ప్రముఖ ఛానెల్‌లో న్యూస్ రిపోర్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, డబ్బింగ్ ఆర్టిస్ట్, న్యూస్ రీడర్, రేడియో జాకీగా కొనసాగుతున్నారు. గతేడాది కూడా ప్రముఖ టీవీ న్యూస్ ప్రెజెంటర్ జననీ బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. ఈసారి రంజిత్ పాల్గొంటాడని తెలుస్తోంది. 

10. అబ్బాస్

ప్రముఖ నటుడు, మోడల్, డాన్సర్ అయిన అబ్బాస్ కూడా ఈసారి బిగ్ బాస్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. 

Read Also: వీడియోలు చూపిస్తే పరిస్థితి ఏమిటీ? నీ కాళ్లు పట్టుకోనా రతిక: శివాజీ - ఏం జరిగింది?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 25 Sep 2023 01:48 PM (IST) Tags: Sridevi Vijaykumar Abbas Babloo Prithiveeraj ​Bigg Boss Tamil 7 Bigg Boss Tamil 7 Contestants​ Dance Master Sridhar Jovika Vijaykumar Kumaran Thangarajan ​​Rajalakshmi Senthil​ ​​Bailwan Ranganathan​ Indraja Shankar Newsreader Ranjith

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

Bigg Boss 7 Telugu: మోనితా బాధితులకు గుడ్ న్యూస్, ‘బిగ్ బాస్’ నుంచి శోభా శెట్టి ఔట్? క్షోభ పోతుందంటున్న హేటర్స్!

Bigg Boss 7 Telugu: మోనితా బాధితులకు గుడ్ న్యూస్, ‘బిగ్ బాస్’ నుంచి శోభా శెట్టి ఔట్? క్షోభ పోతుందంటున్న హేటర్స్!

Vasanthi Krishnan: హార్ట్ బ్రేకింగ్ న్యూస్ - ‘బిగ్ బాస్’ బ్యూటీ వసంతి ఎంగేజ్మెంట్, ఫొటోలు చూశారా!

Vasanthi Krishnan: హార్ట్ బ్రేకింగ్ న్యూస్ - ‘బిగ్ బాస్’ బ్యూటీ వసంతి ఎంగేజ్మెంట్, ఫొటోలు చూశారా!

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్