Bigg Boss Season 7 Updates: ‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఫస్ట్ ఎలిమినేషన్ - హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్!
అనూహ్యంగా మొదటి ఎలిమినేషన్ జరిగింది. అందరికంటే ప్రేక్షకులను తక్కువగా మెప్పించిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వెళ్లిపోయారు.
‘బిగ్ బాస్’ సీజన్ 7 తెలుగులో మొదటి ఎలిమినేషన్ పూర్తయ్యింది. ముందు సీజన్స్‌లాగా కాకుండా ఈ సీజన్‌లో కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంటర్ అయ్యారు. అయితే ఇంత తక్కువ మంది కంటెస్టెంట్స్‌తో ‘బిగ్ బాస్’ సీజన్ 7 ప్రారంభం అయ్యింది కాబట్టి ఈసారి ఎలిమినేషన్ ఉండదేమో అన్న అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో ఉన్నాయి. కానీ అనూహ్యంగా మొదటి ఎలిమినేషన్ జరిగింది. అందరికంటే ప్రేక్షకులను తక్కువగా మెప్పించిన కంటెస్టెంట్ ‘బిగ్ బాస్’ హౌజ్ నుంచి బయటికి వెళ్లిపోయారు. కంటెస్టెంట్స్ అంతా వారికి గుడ్‌బై చెప్పారు.
మొదటి ఎలిమినేషన్ పూర్తి..
ఒకప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా సినిమాలు చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కిరణ్ రాథోడ్. సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన తను.. రియల్ లైఫ్‌లో మాత్రం మెప్పించలేకపోయింది. అందుకే ‘బిగ్ బాస్’ సీజన్ 7 నుంచి ఎలిమినేట్ అవుతున్న మొదటి కంటెస్టెంట్‌గా నిలిచింది. ఒకప్పుడు నటిగా గ్లామర్ షోతో వెలిగిపోయినా కూడా ఆ తర్వాత కొంతకాలం పాటు తను వెండితెరపై కనిపించలేదు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం ‘బిగ్ బాస్’ అనేది చాలా ఉపయోగపడుతుందని కిరణ్ రాథోడ్ భావించింది. ముఖ్యంగా తెలుగులో తన కెరీర్‌ను మళ్లీ ప్రారంభించాలంటే ‘బిగ్ బాస్’ సీజన్ 7 అనేది తనకు అద్భుతమైన అవకాశం అనుకుంది కిరణ్. కానీ తను అనుకున్నది జరగకుండానే హౌజ్‌ను వదిలి వెళ్లిపోయింది.
తెలుగు గురించే మర్చిపోయింది..
‘బిగ్ బాస్’ సీజన్ 7లో 12వ కంటెస్టెంట్‌గా హౌజ్‌లో అడుగుపెట్టింది కిరణ్ రాథోడ్. పలు తెలుగు చిత్రాల్లో నటించినా కూడా తనకు ఇప్పటివరకు అసలు తెలుగు రాదు. అయితే తెలుగు రాకుండా తెలుగు ‘బిగ్ బాస్’లో ఉండడం కష్టమని, వెంటనే భాష నేర్చుకోవాలని నాగార్జున తెలిపారు. అంతే కాకుండా ‘బిగ్ బాస్’ హౌజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక కంటెస్టెంట్‌ను సెలక్ట్ చేసుకొని వారి ద్వారా తెలుగు నేర్చుకోవాలని చెప్పారు. దానికి సరే అన్న కిరణ్ రాథోడ్.. హౌజ్‌లోకి వెళ్లిన తర్వాత నాగార్జున ఇచ్చిన టాస్క్‌ను పూర్తిగా మర్చిపోయింది. తెలుగు నేర్చుకోవడంలోనే కాదు.. టాస్కులు ఆడే విషయంలో, ప్రేక్షకులకు ఇంప్రెస్ చేసే విషయంలో కూడా కిరణ్ రాథోడ్ వెనకబడింది.
కెమెరాలకు కనిపించలేదు..
ప్రేక్షకులను మెప్పించాలంటే ఎక్కువసేపు కెమెరాకు కనిపించే విధంగా ఏదైనా చేయాలి, కానీ కిరణ్ రాథోడ్ అలా ఏమీ చేయాలేకపోయింది. ఇతర కంటెస్టెంట్స్‌కు తెలుగు కూడా రావడంతో వారు చెప్పే మాటలకు ప్రేక్షకులకు అర్థమయ్యేవి. కానీ కిరణ్ రాథోడ్ మాత్రం హిందీలోనే ఎక్కువగా మాట్లాడేది. దీంతో ప్రేక్షకులు తనకు కేవలం 50 మార్కులు మాత్రమే వేశారు. తనకు తెలుగు రావడం లేదు అని కారణంతోనే ఎక్కువమంది కంటెస్టెంట్స్ తనను నామినేట్ కూడా చేశారు. ఎలిమినేషన్ సమయం వచ్చేసరికి ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్.. డేంజర్ జోన్‌లో ఉండగా.. చివరికి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతున్నట్టు నాగార్జున ప్రకటించారు. అలా అని పూర్తిగా కిరణ్‌ను ఇష్టపడే ప్రేక్షకులే లేరని కాదు.. తను మాట్లాడే విధానానికి ఇప్పటికే పలువురు ‘బిగ్ బాస్’ ప్రేక్షకులు తనకు ఫ్యాన్స్ అయ్యారు. కానీ ఒక్కవారంలోనే మిగతా కంటెస్టెంట్స్ సంపాదించుకున్నంత ఫ్యాన్ బేస్ కిరణ్ రాథోడ్ సంపాదించుకోలేకపోయింది. అందుకే వెనకబడి ఎలిమినేట్ అయ్యింది.
Also Read: ‘జవాన్’కు సీక్వెల్ ప్లాన్? కథ కూడా అదేనట - షారుఖ్ ఆసక్తికర ట్వీట్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial