Bigg Boss Season 7 Telugu: నీకు ప్రశాంత్ అంటే ఇష్టం లేదు, అందుకే అలా చేస్తున్నావ్ - యావర్‌పై శివాజీ మండిపాటు
ప్రిన్స్ యావర్, శివాజీ ఎప్పుడూ అన్యూయంగా ఉంటారు. కానీ కెప్టెన్సీ టాస్క్ అనేది వారి మధ్య చిచ్చు పెట్టింది.
బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ మొదలయ్యింది. ఇప్పటికే ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ అంతా జంటలుగా విడిపోయి ఆటను మొదలుపెట్టారు. అలా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లోని కంటెస్టెంట్స్ అంతా అయిదు టీమ్స్‌గా విడిపోయారు. ప్రియాంక - శోభ, ప్రిన్స్ యావర్ - టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్ - శివాజీ, శుభశ్రీ - గౌతమ్, సందీప్ - అమర్‌దీప్.. టీమ్స్‌గా ఫార్మ్ అయ్యారు. నిన్న (అక్టోబర్ 3న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీకి సంబంధించిన మొదటి టాస్క్ గురించి వివరించారు బిగ్ బాస్. ఈ టాస్కులో శోభా శెట్టి, యావర్ కంటెస్టెంట్స్‌గా గేమ్‌లో ఉండడంతో పాటు సంచాలకులుగా ఇతరుల గేమ్స్‌ను కూడా గమనించాలి. దీంతో ఇతర కంటెస్టెంట్స్‌కు, సంచాలకుల మధ్య వాగ్వాదాలు జరిగాయి.
అందరూ తప్పులే చేశారు..
ముందుగా శివాజీ, పల్లవి ప్రశాంత్.. టాస్క్‌ను పూర్తిచేసి బిగ్ బాస్ చెప్పినట్టుగా గంట కొట్టారు. ఆ తర్వాత టాస్క్ పూర్తి అవ్వకపోయినా.. సందీప్, అమర్‌దీప్ గంట కొట్టారు. మూడోస్థానంలో ప్రియాంక, శోభా శెట్టి గంట కొట్టారు. కానీ శోభా, యావర్ మాత్రం ముందుగా గంట కొట్టినవారిని విన్నర్ అని చెప్పకుండా, అందరూ టాస్క్‌లో కొన్ని తప్పులు చేశారు అంటూ తప్పులను లెక్కించడం మొదలుపెట్టారు. ముందుగా గంట కొట్టిన ప్రశాంత్, శివాజీ టీమ్.. పళ్లను సరిగ్గా అమర్చలేదని, ఉల్టాగా పెట్టారని ఆరోపించారు. ఆ తర్వాత గంట కొట్టిన అమర్‌దీప్, సందీప్ టాస్క్‌ను పూర్తి చేయకుండానే గంట కొట్టారని అన్నారు. రూల్ బుక్ ప్రకారం సందీప్, అమర్‌దీప్ చేసింది తప్పే అయినా.. వారు మాత్రం దానికి ఒప్పుకోకుండా కంటెస్టెంట్స్ అందరితో వాదించడం మొదలుపెట్టారు. శోభా శెట్టి కూడా గేమ్ రూల్స్‌ను పక్కన పెట్టి.. చీటింగ్ చేసింది కాబట్టి వారు కూడా తప్పులు చేసినట్టుగా ఒప్పుకున్నాడు.
ప్రశాంత్ అంటే నచ్చదు..
ముందుగా టాస్క్ పూర్తి చేసి గంట కొట్టిన మూడు జంటలు తప్పులు చేశాయి కాబట్టి అసలు గంట కొట్టని శుభశ్రీ, గౌతమ్‌లను విన్నర్స్‌గా ప్రకటించారు శోభా శెట్టి, యావర్. అసలు వారు గంట కొట్టలేదు అన్న విషయాన్ని కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా చూశారు. కానీ ఆ అంశాన్ని మాత్రం శోభా, యావర్ సంచాలకులుగా పక్కన పెట్టేశారు. మిగతా కంటెస్టెంట్స్ అంతా వారు గంట కొట్టలేదు అని చెప్తున్నప్పుడు కన్ఫర్మేషన్ కోసం శుభశ్రీని అడిగాడు యావర్. ఇది శివాజీ విన్నాడు. ‘‘సంచాలకుడిగా నువ్వు చూసి చెప్పాలి కానీ తనను అడగడమేంటి’’ అంటూ సీరియస్ అయ్యాడు. ‘‘ప్రశాంత్ అంటే నీకు నచ్చదు కాబట్టే ఇలా చేశావు’’ అంటూ యావర్‌పై నిందలు వేశాడు.
తిట్టాడు.. ఓదార్చాడు..
శివాజీ ఆరోపణలను యావర్ ఒప్పుకోలేదు. అలా అని కోప్పడలేదు కూడా. యావర్ పక్షపాతంగా వ్యవహరించాడు అంటూ చెప్పిన మాటనే పదేపదే చెప్పాడు. దానికి యావర్ చాలా ఫీల్ అయ్యాడు. శుభశ్రీ.. యావర్‌ను సపోర్ట్ చేసింది. గెలిచినందుకే ఇలా మాట్లాడుతున్నావంటూ శుభశ్రీని సైతం సైలెంట్ చేశాడు శివాజీ. ఆ తర్వాత శివాజీ అన్న మాటలకు యావర్ బాధపడుతుండడంతో.. మళ్లీ శివాజీనే వచ్చి తనను ఓదార్చాడు. సంచాలకులుగా శోభా శెట్టి, యావర్ తప్పులు చేశారని చెప్తూనే వారిని ఓదార్చాడు శివాజీ. చివరిగా బిగ్ బాస్ ఇచ్చిన మొదటి కెప్టెన్సీ టాస్క్‌లో గౌతమ్, శుభశ్రీ మొదటి స్థానంలో ఉండి మూడు స్టార్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న గౌతమ్, అమర్‌దీప్‌కు రెండు స్టార్లు, పల్లవి ప్రశాంత్, శివాజీకి కేవలం ఒక స్టార్ దక్కింది.
Also Read: కొత్త ఐడియాతో ‘టైగర్ నాగేశ్వర రావు’ - ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా విడుదల కాని భాషలో!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial