అన్వేషించండి

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లో రెండోవారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఉన్నది వారే!

రెండో వారంలో శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రశాంత్, షకీలా, శోభా శెట్టి, అమర్‌దీప్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, రతిక నామినేషన్స్‌లో ఉన్నారు.

బిగ్ బాస్ (Bigg Boss Telugu Season 7) రియాలిటీ షో అనేది ఇప్పటికీ తెలుగులో 6 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యింది. ఇక ఈ సీజన్‌లాగా ఇప్పటివరకు ఏ సీజన్ కూడా మొదటివారంలోనే ఇంత రసవత్తరంగా సాగలేదని కొందరు ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఉల్టా పుల్టా సీజన్ అంటూ అసలు బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కాకముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు మేకర్స్. మామూలుగానే టాస్కులతో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే బిగ్ బాస్.. ఈసారి డోస్ పెంచనున్నాడని అంచనాలు పెంచేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ తర్వాత చాలామంది కంటెస్టెంట్స్.. ప్రేక్షకులకు తెలియకపోయినా వారి టాలెంట్‌తో ప్రేక్షకుల దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక రెండోవారంలో ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించలేక బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి వెళ్లే ఛాన్సులు ఈ ఇద్దరు కంటెస్టెంట్స్‌కే ఎక్కువగా ఉన్నాయని ఓటింగ్ రిజల్ట్స్ చెప్తున్నాయి.

రసవత్తరంగా నామినేషన్స్..
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి ఇప్పటికీ ఒక వారం ముగిసిపోయి రెండోవారంలోకి అడుగుపెట్టారు. ఒక మొదటి వారంలో ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించలేక సీనియర్ నటి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. రెండో వారంలో శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రశాంత్, షకీలా, శోభా శెట్టి, అమర్‌దీప్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, రతిక నామినేషన్స్‌లో ఉన్నారు. నామినేషన్స్ విషయంలో శివాజీకే కంటెస్టెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ ఓట్లు పడ్డాయి. మొదటి వారంతో పోలిస్తే రెండో వారం నామినేషన్స్ అనేవి ప్రేక్షకులను ఆకర్షించేలా సాగాయి. పైగా ఈ నామినేషన్స్ మాత్రమే రెండురోజులు ప్రసారం చేశారు బిగ్ బాస్. ముఖ్యంగా శివాజీ, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్.. బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ మజాను అందించాయి.

వారికే తక్కువ ఓట్లు..
బిగ్ బాస్ సీజన్ 7లో నామినేషన్స్‌లో ఉన్న 9 మందిలో పల్లవి ప్రశాంత్‌కే బయట నుంచి ఎక్కువ సపోర్ట్ దక్కుతుందని ఓటింగ్ రిజల్ట్స్ చెప్తున్నాయి. ఎక్కువగా ఓట్లు దక్కించుకున్న వారి లిస్ట్‌లో పల్లవి ప్రశాంత్ తర్వాత స్థానంలో శివాజీ ఉన్నాడు. శివాజీ తర్వాత స్థానంలో అమర్‌దీప్ ఉన్నాడు. తర్వాత స్థానాల్లో రతిక, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. శోభా శెట్టి, షకీలా, టేస్టీ తేజ డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అందులోనూ ముఖ్యంగా షకీలా, టేస్టీ తేజ.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ విధంగా చూసినా షకీలా.. ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. టేస్టీ తేజ.. బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చే ముందు నుండే యూట్యూబర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ షకీలా మాత్రం చాలాకాలంగా ప్రేక్షకులకు టచ్‌లో లేదు. దీంతో తేజకు ఉన్నంత ఫాలోయింగ్ కూడా షకీలాకు ఉండే ఛాన్స్ లేదు. 

రెండో పవర్ అస్త్రా కోసం పాట్లు..
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో మాయాస్త్రం కోసం కంటెస్టెంట్స్ పోటీపడడం మొదలుపెట్టారు. ప్రస్తుతం మాయాస్త్రం గెలుచుకొని రెండో పవర్ అస్త్రా కోసం పోటీపడుతున్నవారి లిస్ట్‌లో అమర్‌దీప్, శివాజీ, షకీలా, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక ఉన్నారు. ఈ ఆరుగురిలో రెండో పవర్ అస్త్రా ఎవరికి దక్కుతుంది అనే విషయం నేడు (సెప్టెంబర్ 14న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో తెలియనుంది. 

Also Read: ‘బేబీ’ మూవీపై పోలీస్ కమీషనర్ ఫైర్ - నోటీసులు జారీ చేస్తామని వెల్లడి

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu in Assembly: విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే ప్రపంచబ్యాంక్ జీతగాడినన్నారు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రసంగం
నన్ను ప్రపంచబ్యాంక్ జీతగాడినన్నారు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రసంగం
Telangana: స్టాలిన్‌ సమావేశానికి వెళ్తామని కేటీఆర్ ప్రకటన - మరి రేవంత్ హాజరైతే ?
స్టాలిన్‌ సమావేశానికి వెళ్తామని కేటీఆర్ ప్రకటన - మరి రేవంత్ హాజరైతే ?
Microsoft AP Govt:  రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
Telangana New Ration Cards: తెలంగాణ రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్- పాతకార్డులకు కాలం చెల్లినట్టేనా!
తెలంగాణ రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్- పాతకార్డులకు కాలం చెల్లినట్టేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kerala teen dies due to water fasting | వాటర్ డైట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కేరళ యువతీ | ABP DesamYS Jagan YSRCP Formation Day | మెడలో పార్టీ కండువాతో కనిపించిన జగన్..రీజన్ ఏంటంటే | ABP DesamPithapuram Public Talk on Pawan Kalyan | కళ్యాణ్ గారి తాలుకా అని పిఠాపురంలో చెప్పుకోగలుగుతున్నారా.?Gun fire in Chittoor Locals Rescue Operation | పోలీసుల వచ్చేలోపే గన్నులతో ఉన్న దొంగలను పట్టుకున్న స్థానికులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu in Assembly: విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే ప్రపంచబ్యాంక్ జీతగాడినన్నారు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రసంగం
నన్ను ప్రపంచబ్యాంక్ జీతగాడినన్నారు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రసంగం
Telangana: స్టాలిన్‌ సమావేశానికి వెళ్తామని కేటీఆర్ ప్రకటన - మరి రేవంత్ హాజరైతే ?
స్టాలిన్‌ సమావేశానికి వెళ్తామని కేటీఆర్ ప్రకటన - మరి రేవంత్ హాజరైతే ?
Microsoft AP Govt:  రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
Telangana New Ration Cards: తెలంగాణ రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్- పాతకార్డులకు కాలం చెల్లినట్టేనా!
తెలంగాణ రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్- పాతకార్డులకు కాలం చెల్లినట్టేనా!
Aamir Khan: 'ఏడాది కాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్నా' - తన గర్ల్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఆమిర్ ఖాన్, ఎవరో తెలుసా.?
'ఏడాది కాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్నా' - తన గర్ల్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన ఆమిర్ ఖాన్, ఎవరో తెలుసా.?
Fact Check:   ఏంటీ.. అది ఘటోత్కచుడి కత్తా…? నిజంగానే దొరికిందా..?
Fact Check:   ఏంటీ.. అది ఘటోత్కచుడి కత్తా…? నిజంగానే దొరికిందా..?
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్  యుద్ధానికి తాత్కాలిక విరామం - నెల రోజుల పాటు సీజ్ ఫైర్
రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తాత్కాలిక విరామం - నెల రోజుల పాటు సీజ్ ఫైర్
Telangana Assembly: స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు - అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు - అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్
Embed widget