అన్వేషించండి

Bigg Boss 7 Telugu: శోభా మేకప్ కష్టాలు, తేజకు 5 నిమిషాలు నిద్రపోయే అవకాశం ఇచ్చిన బిగ్ బాస్

Bigg Boss Season 7: ప్రస్తుతం బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌ లగేజ్‌లకు హెడ్స్‌ను పెట్టి శోభా శెట్టి మేకప్ కిట్‌ను తీసేసుకున్నారు బిగ్ బాస్. దీంతో మేకప్ వేసుకోవడానికి శోభా కష్టాలు పడుతోంది.

Bigg Boss 7 Telugu Latest Episode: బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత ఆట మరింత రసవత్తరంగా మారింది. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్‌కు కొన్ని సూపర్ పవర్ ఇవ్వడంతో పాత కంటెస్టెంట్స్ అంతా వారి మాట వినలేక, వినకుండా ఉండలేక కష్టపడుతున్నారు. ఇక కొత్తగా వచ్చినవారు కూడా పాత కంటెస్టెంట్స్‌ను ఏమీ అనలేకపోతున్నారు. కానీ ఈ కన్ఫ్యూజన్ మధ్య బిగ్ బాస్ మాత్రం ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హెడ్స్ ఆఫ్ లగేజ్ అనే బాధ్యతను అర్జున్ అంబటి, అశ్విని శ్రీకి ఇవ్వడంతో కంటెస్టెంట్స్ అంతా వారికి తెలియకుండా దొంగతనాలు మొదలుపెట్టారు. తాజాగా శోభా శెట్టి కూడా అలాగే చేయగా.. బిగ్ బాస్ తనకు ఒక ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చారు.

బిగ్ బాస్ సీజన్ 7లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ అందరిలో మేకప్ అంటే ఎవరికి ఎక్కువ ఇష్టం అంటే కంటెస్టెంట్స్ అంతా టక్కున శోభా శెట్టి (Shobha Shetty) పేరే చెప్తారు. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్.. శోభా తమతోకంటే మేకప్ దగ్గరే ఎక్కువ సమయం కేటాయిస్తుంది అని బయటపెట్టారు. ఈ విషయాన్ని తను కూడా ఒప్పుకుంది. ఇక అర్జున్, అశ్వినిలను హెడ్స్ ఆఫ్ లగేజ్ చేసిన తర్వాత పాత కంటెస్టెంట్స్‌కు రోజుకు కేవలం 7 వస్తువులు మాత్రమే ఇవ్వాలని రూల్ పెట్టారు. దీంతో కంటెస్టెంట్స్ బట్టలు లేక ఇబ్బందులు పడుతున్నారు. బట్టల విషయమే ఇంత ఇబ్బందికరంగా ఉంటే ఇంక శోభా శెట్టి చేతికి మేకప్ కిట్ రావడం అనేది అసాధ్యంగా మారిపోయింది. దీంతో శోభా వేరొకరి మేకప్‌ను అడిగి తీసుకున్నట్టుగా తాజాగా విడుదలయిన ప్రోమోలో చూపించారు.

శోభా మేకప్ కష్టాలు

తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో ముందుగా ‘‘మేకప్ కిట్ ఇవ్వమని చెప్పండి బిగ్ బాస్’’ అంటూ కెమెరా ముందు వాపోయింది శోభా. ఆ తర్వాత ఇతర కంటెస్టెంట్ దగ్గరకు వెళ్లి కొంచెం మేకప్‌ను అడిగి తీసుకుంది. దొంగ, దొంగ అంటారు అని నయని పావని చెప్పినా కూడా ‘‘దొంగతనం చేయలేదు. ఇంత అడిగి తీసుకున్నా’’ అని శోభా సమాధానం చెప్పింది. అయితే అది కూడా దొంగతనమే అని, తనకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలని అర్జున్‌ను ఆదేశించారు బిగ్ బాస్. అప్పుడు అర్జున్.. తేజ దగ్గరకు వెళ్లి తన దగ్గర కంపు కొడుతున్న టీషర్ట్ ఒకటి అడిగి తీసుకున్నాడు. శోభాకు పనిష్మెంట్‌గా తేజ మూడురోజుల నుండి వేసుకుంటున్న టీషర్ట్‌ను వేసుకోమని చెప్పాడు అర్జున్. శోభాకు వేరేదారి లేక ఆ టీషర్ట్ వేసుకుంది.

అయిదు నిమిషాలు నిద్రపోయే అవకాశం

ఆ తర్వాత తేజకు అయిదు నిమిషాలు పడుకోవడానికి సమయాన్ని ఇచ్చారు బిగ్ బాస్. కానీ అక్కడే ఇంకొక ట్విస్ట్ పెట్టారు. ఆ అయిదు నిమిషాలు లెక్కించడానికి శోభా సంచాలకురాలిగా వ్యవహరించాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలిపారు. దీంతో తేజ, శోభా వల్ల హౌజ్‌లో కాస్త ఫన్ క్రియేట్ అయ్యింది. కావాలని తేజ వచ్చి శోభా భుజం మీద పడుకుంటానంటూ అల్లరి చేశాడు. వీరిద్దరి అల్లరి పూర్తయిన తర్వాత ప్రోమో.. మళ్లీ టాస్క్ దగ్గరికే వచ్చింది. ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లులో బిగ్ బాస్ ఇస్తున్న ఆరవ టాస్క్ హూ ఈజ్ ఫోకస్డ్ అని బిగ్ బాస్ వివరించారు. ఈ టాస్కులో కంటెస్టెంట్స్ చేతికి ఇచ్చిన బెలూన్స్‌ను కింద పడిపోకుండా, అవి పగిలిపోకుండా గాలిలోనే ఎగరేస్తూ.. మరోవైపు కింద ఉన్న బాల్స్‌ను తీసి బుట్టల్లో వేయాలి. ఇప్పటివరకు జరిగిన టాస్కులలో పోటుగాళ్లు లీడ్‌లో ఉన్నారు.

Also Read: ఫుల్ ఫన్ క్రియేట్ చేసిన ఆటగాళ్లు - బిగ్ బాస్​తో వన్స్ మోర్ అనిపించుకున్న అమర్ దీప్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget