Amardeep Chowdary: పెళ్లి కాకముందు ఎవరైనా అంతే, నాకంత టాలెంట్ లేదు - ఫస్ట్ కిస్‌పై అమర్‌దీప్ కామెంట్స్
Amardeep Chowdary: బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అమర్‌దీప్.. తాజాగా తన మ్యారేజ్ ముందు లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. అందులో తన ఫస్ట్ కిస్ గురించి కూడా చెప్పుకొచ్చాడు.
![Amardeep Chowdary: పెళ్లి కాకముందు ఎవరైనా అంతే, నాకంత టాలెంట్ లేదు - ఫస్ట్ కిస్‌పై అమర్‌దీప్ కామెంట్స్ bigg boss season 7 fame amardeep reveals interesting things about his relationship with tejaswini Amardeep Chowdary: పెళ్లి కాకముందు ఎవరైనా అంతే, నాకంత టాలెంట్ లేదు - ఫస్ట్ కిస్‌పై అమర్‌దీప్ కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/e0f5325de539d6b5ba0d4404b89ca2131707893107684239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bigg Boss Amardeep: సీరియల్స్‌లో హీరోగా నటించి, ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు అమర్‌దీప్ చౌదరీ. ఎన్నో సీరియల్స్‌లో హీరోగా చేసినా కూడా రాని క్రేజ్.. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా కనిపించడంతో వచ్చింది. ఆ రియాలిటీ షోలో తను విన్నర్ అవ్వాలని అనుకున్నా రన్నర్‌గానే నిలిచాడు. కానీ చాలామంది అభిమానులను మాత్రం సంపాదించుకున్నాడు. తాజాగా అమర్‌దీప్‌తో పాటు తన భార్య తేజస్విని కూడా ఇంటర్వ్యూ చేసింది శోభా శెట్టి. ఆ ఇంటర్వ్యూలో తన ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. వారు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు అమర్.
సిగ్గుపడిన అమర్..
ముందుగా తేజస్విని కాకుండా ఎవరితో అయినా డేటింగ్‌కు వెళ్లారా అని అడిగాడు ఒక ఫ్యాన్. వయసులో, తెలిసీ తెలియని తప్పటడుగులు వేసే టైమ్‌లో వెళ్లాను అన్నట్టుగా సమాధానమిచ్చాడు అమర్. ఆ తర్వాత తన ఫస్ట్ కిస్ గురించి ఒకరు ప్రశ్నించారు. ఆ ప్రశ్న వినగానే తేజస్వినితో పాటు అమర్ కూడా సిగ్గుపడ్డాడు. ఆ విషయాన్ని ఇప్పుడెలా చెప్పాలి అని ఆలోచించాడు. జూన్, జులై టైమ్‌లో జరిగిపోయింది అని చెప్తూ.. అంతకంటే ఏం చెప్పను అని సమాధానమిచ్చాడు అమర్. మాస్ మహారాజా రవితేజకు అమర్‌దీప్ పెద్ద ఫ్యాన్ కావడంతో తన డైలాగ్ చెప్పమని కోరగా.. చెప్పి అందరినీ ఎంటర్‌టైన్ చేశాడు. బిగ్ బాస్ వల్ల తనపై వచ్చిన విమర్శలపై కూడా అమర్ పాజిటివ్‌గానే స్పందించాడు.
అందరూ పులిహోర రాజానే..
‘‘బయట మీకు మాస్ మహారాజా కంటే పులిహోర రాజా అనే గట్టి పేరుంది. దానికి మీరేమంటారు’’ అని అమర్‌దీప్‌ను ప్రశ్నించాడు ఒక ఫ్యాన్. ‘‘అది ఒకప్పుడు కదా. పెళ్లి కాకముందు ఏ అబ్బాయి అయినా రంగుల లోకంలో ఎగురుతూ ఉంటాడు. మంచి మంచి అమ్మాయిలను చూస్తూ ఉంటారు. మన కళ్ల ముందే ఉంటారు. ఎవరో ఒకరు సెట్ అవ్వకపోతారా, ఎవరైనా మాట్లాడకపోతారా అని చూస్తూనే ఉంటాం. అది ఎవరికైనా సహజం. కామెంట్స్ పెట్టేవాళ్లందరూ ఎదురుగా సన్నీ లియోన్ వీడియో కనిపిస్తే ఊరికే చూస్తుంటారా? ప్రతీ ఒక్కడూ పులే. ప్రతీ ఒక్కడూ పులిహోర రాజానే. టైమ్ వచ్చినప్పుడు పిల్లో, పులో బయటపడుతుంది’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు అమర్‌దీప్.
ఫస్ట్ గిఫ్ట్ అదే..
తేజస్వినికి కాకుండా ఇంకెవరికి ప్రపోజ్ చేశారు అని అమర్‌ను అడగగా.. అది చాలా మామూలు ప్రపోజల్ అని సమాధానమిచ్చాడు. ‘‘ఒక ఫీల్‌తో మామూలుగా కారులో చెప్పాను. నాకు సర్‌ప్రైజ్ ఇవ్వడం రాదు. సర్‌ప్రైజ్ చేయడం రాదు. నాకంత టాలెంట్ లేదు. నేను అంత చేయలేను. సర్‌ప్రైజ్ అంటే నా లైఫ్‌లో నేను అనుకున్నది జరగడం, అనుకున్నది రావడం. అదే నాకు సర్‌ప్రైజ్’’ అని ప్రపోజల్ గురించి చెప్పుకొచ్చాడు అమర్‌దీప్. ఇక రిలేషన్‌షిప్ కొత్తలో ఒకరికొకరు ఏం గిఫ్ట్స్ ఇచ్చుకున్నారో తేజస్విని బయటపెట్టింది. అమర్‌దీప్ తనకు పూసలు తీసుకురాగా.. తను రిటర్న్‌లో షర్ట్ గిఫ్ట్‌గా ఇచ్చానని చెప్పుకొచ్చింది తేజూ. ఇక బీటెక్‌లో 36 బ్యాక్‌లాగ్స్ ఒకేసారి పాస్ అయ్యానని కూడా రివీల్ చేశాడు అమర్.
Also Read: దర్శకుడి ఇంట్లో చోరీ - నేషనల్ అవార్డులను వెనక్కి ఇచ్చేసిన దొంగలు, క్షమించండి అంటూ లెటర్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)