News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss Season 7 Day 9 Updates: మీరే గెలుక్కున్నారు, మైండ్‌సెట్ మార్చుకోండి - శివాజీపై శోభాశెట్టి శివతాండవం

‘నువ్వు నన్ను నామినేట్ చేశావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను’ అంటూ శివాజీ.. శోభా శెట్టిని నామినేట్ చేశాడు.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సీజన్ 7లో రెండోవారం నామినేషన్స్‌కు సెకండ్ పార్ట్ నేడు (సెప్టెంబర్ 12న) ప్రసారమయ్యింది. ఇక ఫస్ట్ పార్ట్‌లో పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ ఎంత రసవత్తరంగా సాగాయో.. సెకండ్ పార్ట్‌లో కూడా అదే కొనసాగింది. ఇక ఈ ఎపిసోడ్‌లో పల్లవి ప్రశాంత్ నామినేషన్స్‌తో పాటు శోభా శెట్టి నామినేషన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. ముందుగా తనను నామినేట్ చేయడానికి వచ్చిన శివాజీతోనే చాలా శోభా శెట్టి మాటల యుద్ధం నడిచింది. ఒకరు చెప్పిన కారణాలు మరొకరు ఒప్పుకోకుండా వాదిస్తూ హౌజ్ వాతావరణాన్ని మరింత హీట్‌గా మార్చేశారు. 

కారణం లేకుండా నామినేట్..
‘నువ్వు నన్ను నామినేట్ చేశావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను’ అంటూ శివాజీ.. శోభా శెట్టిని నామినేట్ చేశాడు. ‘వేరేవాళ్ల కారణాలు కూడా నీ కారణాలు అని చెప్తున్నావు. ప్రియాంక గురించి నువ్వు మాట్లాడుతున్నావు’ అంటూ కామెంట్ చేయగా.. శోభా శెట్టి.. శివాజీ చెప్పిన మాటలను ఒప్పుకోలేదు. ‘నా కారణం అయితే అదే’ అంటూ శోభాను నామినేట్ చేసి వెళ్లిపోయాడు. కానీ నామినేషన్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య అసలు గొడవ మొదలయ్యింది. ‘ఏ కారణం లేకుండా నన్ను నామినేట్ చేశారు’ అని శోభా శెట్టి.. శివాజీని విమర్శించింది. 

నోరుతెరిస్తే కంటెంట్..
‘కారణం లేకపోవడం ఏంటి?’ అంటూ శివాజీ సీరియస్ అయ్యాడు. ‘కలిసికట్టుగా ఆడుతున్నావు’ అంటూ విమర్శించాడు. ఆ మాటను శోభా శెట్టి ఒప్పుకోలేదు. ‘నేను వాదించడం మొదలుపెడితే తట్టుకోలేవు. వదిలేయ్’ అన్నాడు శివాజీ. ‘నాకు కూడా మాటలు వచ్చు’ అని శోభా అనగా.. ‘అన్ని అంటే తట్టుకోలేవు’ అని శివాజీ అన్నాడు. ‘నువ్వు అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండకు’ అని శోభాతో చెప్పాడు. ‘బయట ఉన్నట్టు ఇక్కడ ఉండొద్దు మీరు. బయట అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకోవద్దు’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చింది శోభా. శివాజీ.. తన మాటలు పట్టించుకోకుండా పో అన్నాడు. ‘మీరు కూడా పోండి’ అని చెప్పింది. ‘ఈ కంటెంట్ ఇక్కడ వర్కవుట్ అవ్వదు’ అన్నాడు శివాజీ. ‘కొత్త కంటెంట్ ట్రై చేయి’ అన్నాడు. ‘నోరు తెరిస్తే కంటెంట్, కంటెంట్ అంటుంటారు’ అని అరవడం మొదలుపెట్టింది శోభా.

ఆర్టిస్ట్ కాబట్టి అలా చేయలేకపోయావు..
ఒరిజినాలిటీతో ఉండాలి అంటూ శివాజీకి కౌంటర్ ఇచ్చింది శోభా శెట్టి. ఆ తర్వాత ఆడియన్స్.. వారికి ఇచ్చిన మార్కుల గురించి డిస్కషన్ వచ్చింది. అప్పుడు శివాజీకి 74 మార్కులు వచ్చాయని, శోభా శెట్టికి 76 మార్కులు వచ్చాయని గుర్తుచేసుకున్నారు. అయితే శోభాకు ఆ మార్కులు ఆడియన్స్ ఇచ్చినవి కాదని, నాగార్జున ఇచ్చారని కామెంట్ చేశాడు శివాజీ. ఏదైనా 74కు, 76కు తేడా ఉంది అంటూ గొప్పగా చెప్పింది శోభా శెట్టి. ‘నేను కూడా ఆర్టిస్టునే’ అని శోభా అనగా.. ‘మరి బిగ్ బాస్‌ను ఎందుకు ఇంప్రెస్ చేయలేదు. నువ్వు ఆర్టిస్టే కదా’ అని ఎదురుప్రశ్న వేశాడు శివాజీ. ‘ఇంప్రెస్ చేయలేకపోయానని అన్నారు కానీ ఓడిపోయానని బిగ్ బాస్ చెప్పలేదు’ అంటూ శివాజీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది శోభా. ‘నేను మామూలుగా ఉన్నా మీరే వచ్చి గెలుక్కున్నారు’ అని శివాజీని విమర్శించింది. చివరిగా కంటెంట్ అనే మైండ్‌సెట్ మార్చుకుంటే బాగుంటుందని చివరిగా శివాజీతో చెప్పింది శోభా శెట్టి.

Also Read: తండ్రితో లిప్ లాక్ - 33 ఏళ్ల తర్వాత స్పందించిన ఆలియా భట్ అక్క!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 12 Sep 2023 10:38 PM (IST) Tags: Bigg Boss Shobha Shetty Nagarjuna Bigg Boss Telugu 7 Bigg Boss Telugu Season 7 Bigg Boss 7 Telugu Bigg Boss Telugu 2023 BB 7 Telugu sivaji Bigg Boss Season 7 Day 9 Updates

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Day 21 Updates: బిగ్ బాస్‌లో నామినేషన్స్ గోల - యావర్‌కు ఫైనల్‌గా సూపర్ ట్విస్ట్!

Bigg Boss Season 7 Day 21 Updates: బిగ్ బాస్‌లో నామినేషన్స్ గోల - యావర్‌కు ఫైనల్‌గా సూపర్ ట్విస్ట్!

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్ - ఆ ముగ్గురు జడ్జిల చేతిలో నిర్ణయం

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్ - ఆ ముగ్గురు జడ్జిల చేతిలో నిర్ణయం

Bigg Boss Tamil 7: పృథ్విరాజ్ to అబ్బాస్ - ‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ వీళ్లేనట!

Bigg Boss Tamil 7:  పృథ్విరాజ్ to అబ్బాస్ - ‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ వీళ్లేనట!

Bigg Boss Telugu 7: ఆ వీడియోలు చూపిస్తే పరిస్థితి ఏమిటీ? నీ కాళ్లు పట్టుకోనా రతిక: శివాజీ - వీరి మధ్య ఏమైంది?

Bigg Boss Telugu 7: ఆ వీడియోలు చూపిస్తే పరిస్థితి ఏమిటీ? నీ కాళ్లు పట్టుకోనా రతిక: శివాజీ - వీరి మధ్య ఏమైంది?

Bigg Boss Telugu 7: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి దామిని ఔట్ - ఇప్పుడు ఎన్ని చెప్పినా వర్కవుట్ కాదు, ఇంటికెళ్లమన్న శివాజీ

Bigg Boss Telugu 7: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి దామిని ఔట్ - ఇప్పుడు ఎన్ని చెప్పినా వర్కవుట్ కాదు, ఇంటికెళ్లమన్న శివాజీ

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!