Bigg Boss Season 7 Day 7 Updates: సందీప్‌కు షాకిచ్చిన నాగార్జున - ఆ తప్పు చేశావంటూ పవర్ అస్త్ర వెనక్కి!
సందీప్.. పవర్ అస్త్రా గెలవడంతో శనివారం ఎపిసోడ్ పూర్తయ్యింది. ఇక ఆ పవర్ అస్త్రాకు వచ్చే పవర్స్ ఏంటో సండే ఎపిసోడ్ మొదట్లోనే వివరించారు నాగార్జున.
పవర్ అస్త్రా లాభాలను సాధించుకున్న సందీప్ ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్న నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 7 బిగినింగ్ నుండే ఉల్టా పుల్టా సీజన్ అంటూ ప్రచారం చేశారు నాగార్జున. అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుండే ఈసారి బిగ్ బాస్‌లో ఎవరూ హౌజ్‌మేట్స్ కాదని, అందరూ కంటెస్టెంట్సే అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్.. హౌజ్‌మేట్స్‌లాగా మారాలంటే వారు పవర్ అస్త్రాను గెలుచుకోవాలని అన్నారు. అయితే ఫస్ట్ వీక్‌లోనే ఒక టాస్క్ పెట్టి, అందులో గెలిచిన వారికి ఇప్పటికే పవర్ అస్త్రాను అందజేశారు నాగ్. ఇక ఈరోజు (సెప్టెంబర్ 10న) జరిగిన ఎపిసోడ్‌లో అసలు ఆ పవర్ అస్త్రా వల్ల వచ్చే లాభాల గురించి బయటపెట్టారు.
గెలిచిన సందీప్..
బిగ్ బాస్ సీజన్ 7లో పవర్ అస్త్రా కోసం ‘ఫేస్ ది బీస్ట్’ అనే టాస్క్ జరిగింది. ఇందులో ఇద్దరు బాడీ బిల్డర్స్‌తో తలపడి ఆట సందీప్, ప్రియాంక జైన్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్‌ను ఇంప్రెస్ చేసి శివాజీ, రతిక కూడా టాస్క్‌లో విన్ అయ్యారు కానీ కంటెస్టెంట్స్‌తో అంతా వారిద్దరినీ టార్గెట్ చేసి టాస్క్ నుంచి తొలగించారు. మళ్లీ ఆట సందీప్, ప్రియాంక మాత్రమే పవర్ అస్త్రా కోసం పోటీపడే రేసులో నిలిచారు. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చిన తర్వాత సందీప్‌కు, ప్రియాంకకు ఫైనల్ టాస్క్‌ను ఇచ్చారు. ఆ టాస్క్‌లో సందీప్ అద్భుతంగా పర్ఫార్మ్ చేసి బిగ్ బాస్ సీజన్ 7లో పవర్ అస్త్రా సాధించిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచారు.
అవే ప్రయోజనాలు..
సందీప్.. పవర్ అస్త్రా గెలవడంతో శనివారం ఎపిసోడ్ పూర్తయ్యింది. ఇక ఆ పవర్ అస్త్రాకు వచ్చే పవర్స్ ఏంటో సండే ఎపిసోడ్ మొదట్లోనే వివరించారు నాగార్జున. ఇప్పటికే పవర్ అస్త్రా సాధించిన వారికి హౌజ్‌లో అయిదు వారాల ఇమ్యూనిటీ దక్కుతుందని తెలిసిన విషయమే. వాటితో పాటు సందీప్ నిద్రపోవడానికి వీఐపీ రూమ్‌కు యాక్సెస్ ఇచ్చారు నాగార్జున. ఒకసారి వెళ్లి వీఐపీ రూమ్‌లోకి వెళ్లి చూసి రమ్మన్నారు. లోపలికి వెళ్లి వీఐపీ రూమ్‌ను చూసిన సందీప్.. చాలా బాగుంది అంటూ మురిసిపోయాడు. దాంతో పాటు సందీప్‌కు ఒక బ్యాటరీని అందజేశారు నాగార్జున. పవర్ అస్త్రా వచ్చింది కదా అని హౌజ్‌లో ఏ పనులు చేయకపోయినా.. టాస్కులు సరిగా ఆడకపోయినా.. ఆ బ్యాటరీ తగ్గిపోతుందని, అందులో రెడ్ కలర్ రాగానే పవర్ అస్త్రా వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని క్లారిటీ ఇచ్చారు.
పవర్ అస్త్రా వెనక్కి..
పవర్ అస్త్రా సాధించినందుకు మరెన్నో లాభాలు ఉంటాయని, అవన్నీ మెల్లమెల్లగా బిగ్ బాసే సందీప్‌కు తెలియజేస్తారన్నారు నాగార్జున. అయితే పవర్ అస్త్రా సాధించినందుకు తన భార్య జ్యోతికి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా అని అడిగారు నాగ్. దానికి సమాధానంగా సెప్టెంబర్ 13న తన కొడుకు మొదటి పుట్టినరోజు అని, అందుకోసమే తన కొడుకుకు ఈ పవర్ అస్త్రాను డెడికేట్ చేస్తున్నానని సందీప్ అన్నాడు. దీంతో ఎవరికైనా డెడికేట్ చేస్తే.. పవర్ అస్త్రా పవర్ పోతుందని, వెనక్కి ఇచ్చేయాల్సి వస్తుందని నాగ్ అన్నారు. ఆ మాటకు సందీప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను గొప్ప తండ్రి అవ్వాలనుకుంటున్నా అని, నా తండ్రి ఇది సాధించాడు అని నా కొడుకు అనుకోవాలి అని పవర్ అస్త్రాను తన కొడుకుకే డెడికేట్ చేయాలని అనుకుంటున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. దీంతో సందీప్ తీసుకున్న నిర్ణయాన్ని నాగార్జున మెచ్చుకోవడంతో పాటు పవర్ అస్త్ర నీ దగ్గరే ఉంచుకో, అది నీదేనంటూ నాగ్ చెప్పడంతో.. సందీప్ ఊపిరి పీల్చుకున్నాడు.
Also Read: జగన్‌పై 32 కేసులున్నాయి, వాటి సంగతి ఏమిటీ? హీరో శివాజీ కామెంట్స్ వైరల్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial