Sivaji: జగన్‌పై 32 కేసులున్నాయి, వాటి సంగతి ఏమిటీ? హీరో శివాజీ కామెంట్స్ వైరల్
ఆపరేషన్ గరుడ అంటూ శివాజీ వేసిన రాజకీయ ప్రణాళిక చాలా పాపులర్ అయ్యింది. కానీ ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రణాళికలు చేసే ధైర్యం శివాజీ చేయలేదు.
‘బిగ్ బాస్’ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత శివాజీ.. మళ్లీ సినీ ప్రేమికులను పలకరించారు. కానీ అంతకంటే ముందు నుండే రాజకీయాలంటే ఆసక్తి ఉన్నవారికి అయితే శివాజీ ఎప్పటినుండో టచ్‌లో ఉంటున్నారు. రాజకీయాల పరంగా శివాజీ వేస్తున్న ప్రణాళికలను చాలామంది ఆసక్తి ఉన్నవారు ఫాలో అవుతూనే ఉన్నారు. సినిమాల పరంగా ప్రేక్షకుల దృష్టిలో శివాజీ ఎప్పుడో వెండితెరపై కనుమరుగయిపోయారు. కానీ రాజకీయ పరంగా మాత్రం ఆయన ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న శివాజీ.. అందులోకి వెళ్లకముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో పలువురు సీనియర్ రాజకీయ నాయకుల గురించి మాట్లాడారు.
మళ్లీ అలా చేయను..
ఆపరేషన్ గరుడ అంటూ శివాజీ వేసిన రాజకీయ ప్రణాళిక చాలా పాపులర్ అయ్యింది. కానీ ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రణాళికలు చేసే ధైర్యం శివాజీ చేయలేదు. అప్పటికే ఆయనకు రాజకీయపరంగా చాలా ఒత్తిడిలు ఎదురయ్యాయి. దాంతో పాటు బెదురింపులు కూడా వచ్చాయి. అందుకే ఇక అలాంటివి చేయను అంటూ ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు శివాజీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి మీరు చేసిన అంచనాలు నిజమయ్యాయని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. మీరు అనుకోవడం లేదా అని ఎదురుప్రశ్న వేశారు శివాజీ. ఆ తర్వాత ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ప్రస్తావన వచ్చింది.
32 కేసుల పరిస్థితి ఏంటి..?
ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి పూర్తిగా రాజకీయానికే సరైన మనిషి కాదని గట్టిగా చెప్పేశారు శివాజీ. కేవలం ఒక రాజకీయ పార్టీకి మాత్రమే కాకుండా ఆయన పూర్తిగా రాజకీయాల్లో ఉండడమే మంచిది కాదన్నారు. రామోజీ రావుపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలను, పెట్టిన కేసును గుర్తుచేసుకున్నారు. రామోజీ రావు తప్పు చేయలేదు కాబట్టి ఆయనను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పాడు. 32 కేసులు ఉన్న జగన్ మోహన్ రెడ్డికి సపోర్ట్‌గా ఎందుకు నిలబడ్డావు అంటూ ఉండవల్లిని ఉద్దేశిస్తూ ప్రశ్నించాడు. రామోజీ రావు మీద ఒక్కటే కేసు ఉంది. అది కూడా నువ్వే పెట్టావు. కానీ జగన్ మోహన్ రెడ్డి మీద 32 ప్రభుత్వ కేసులు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి అంటూ విమర్శించాడు.
సింహాన్ని భయపెట్టాలనుకుంటున్న కోతి..
కేవలం రామోజీ రావును భయపెట్టడానికి ఉండవల్లి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అని వ్యాఖ్యానించారు శివాజీ. కానీ కోతి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సింహాన్ని భయపెట్టలేవని అన్నాడు. రామోజీ రావు బిజినెస్‌మెన్ అని, అయితే తప్పేంటని ప్రశ్నించాడు. రూ.500 కోట్ల ఆస్తులతో జగన్ మోహన్ రెడ్డి అత్యంత కాస్ట్‌లీ ముఖ్యమంత్రి అని అన్నాడు. ఇలాగే అందరిలాగానే రామోజీ రావు కూడా సంపాదించుకున్నారని ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.
జగన్ చేసిన తప్పులు ఇవే..
నాలుగేళ్లలో జగన్ మోహన్ రెడ్డి చేసిన తప్పులేంటి అని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. శివాజీ ఒక్కొక్కటిగా అన్నీ చెప్తూ వచ్చాడు. ‘ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన కంపెనీలను వెనక్కి పంపించడం, పోలవరం పూర్తి చేయకపోవడం, అన్న క్యాంటీన్స్‌ను రద్దు చేయడం, ఇసుక మాఫీయాను పెంచి పోషించడం, అమరావతిని పక్కన పెట్టడం, మద్యపానం నిషేధించకపోవడంతో పాటు ఆయన కంపెనీలే నడపడం, మద్యపానాన్ని క్యాష్‌లో అమ్మడం’ అంటూ జగన్ చేసిన తప్పులను ఒక్కొక్కటిగా చెప్పాడు శివాజీ.
Also Read: శోభా శెట్టిని చూడగానే అలా అనిపించింది - కింగ్ ముందే టేస్టీ తేజ పులిహోర, షాకిచ్చిన నాగ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial