News
News
X

Bigg Boss Season 6 : నవ్వించి ఏడిపించేసిన ‘బిగ్ బాస్’ - కెప్టెన్సీకి పోటీపడే ఇంటి సభ్యులు వీళ్లేనా?

రెండు రోజుల నుంచి నవ్విస్తూ ఫన్ చేసిన బిగ్ బాస్ ఇప్పుడు అందరినీ ఏడిపించేశాడు. ‘బిగ్ బాస్’ హైలెట్స్ మీకోసం..

FOLLOW US: 

రెండు రోజుల నుంచి బిగ్ బాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు ఇంటి సభ్యులు. ఆటలు, పాటలు, డాన్స్ లతో ప్రేక్షకులని అలరించారు. ఆ సంతోషం ఎక్కువ అయిందని అనుకున్నారో ఏంటో వెంటనే అందరినీ ఏడిపించేశారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఇంట్లో ఉన్న వాళ్ళ కోరికలు చెప్పి ప్రతీ ఒక్కరూ కన్నీళ్ళు పెట్టించేశారు.

తాజా ప్రోమో ప్రకారం.. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఇంట్లో సభ్యులందరూ బిగ్ బాస్ కోరికలు తీర్చారు. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో వాళ్ళ కోరికలు ఏంటో తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకు సభ్యులందరూ తమ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటు కన్నీళ్ళు పెట్టుకున్నారు. శ్రీహాన్ తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. సిరి నువ్వు షూట్స్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా రోజులో ఒక్కసారి మా అమ్మానాన్నకి కాల్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కో. ఏది జరిగినా చూసుకోడానికి నువ్వు ఉన్నావనే ధైర్యం చెప్పమని అడిగాడు.  

రేవంత్ తన భార్య, రాబోయే బిడ్డ గురించి వాళ్ళ యోగక్షేమాల గురించి తన మనసులో మాట చెప్పారు. ఇనయా తన తల్లి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది. తనకి హౌస్ లోకి వచ్చే ముందే పాప పుట్టిందని, త్వరలో తనకి మంచి పేరు పెట్టె సందర్భం రావాలని బాలాదిత్య కోరుకున్నాడు. బిగ్ బాస్ వింటూ.. బిగ్ బాస్ గురించి ఆలోచిస్తూ.. ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన పాప బర్త్ డే ఇక్కడ జరిగితే నెక్ట్ లెవల్ హ్యాపీగా ఉంటుందని అనిపిస్తుందని ఆది రెడ్డి చెప్పుకొచ్చారు.

News Reels

నిన్నటి ఎపిసోడ్లో మెరీనా, వాసంతి ఎపిసోడ్లో ఎలా ఎలివేట్ అవ్వాలో తెలియక రాత్రిపూట దెయ్యాల వేషం వేశారు. కానీ వారిద్దరూ సరిగా నటించలేకపోయారు. కాసేపు ఫర్వాలేదనిపించారు. రాత్రవ్వడంతో అందరూ నిద్రపోయారు. ఫైమా తనకిచ్చిన సీక్రెట్ టాస్కు అమలు చేసింది. ఇందులో భాగంగా ముగ్గురు ఇంటి సభ్యుల నిద్రకు భంగం కలిగించాలి. స్పూన్లు విసరడం, తలగడలు విసరడం చేసింది. వాసంతి లేచి చూసింది. మిగతా వారు కదిలినట్టు కనిపించారు కానీ భంగం కలిగినట్టు అనిపించలేదు. ఈ విషయంలో బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

తెల్లారాక ఓ కేకును పంపించారు బిగ్ బాస్. అయితే కేవలం నలుగురు మాత్రమే తినాలని, ఆ నలుగురు ఎవరో ఇంటి సభ్యులే నిర్ణయించుకోవాలని, అది కూడా పావుగంటలో చేయాలని చెప్పారు. ఇంటి సభ్యులు వాదులాడుకుంటూ టైమ్ వేస్టు చేశారు. దీంతో బిగ్ బాస్ కేకు వెనక్కి తీసుకున్నారు. 

ఫైమా తన రంగు గురించి రాజశేఖర్ ఏదో అన్నాడని, చాలా బాధపడ్డానని అంది. దానికి రాజ్ చాలా వినయంగా సారీ చెప్పాడు. రంగు పేరుతో బాడీ షేమింగ్ చేయకూడదని చెప్పింది ఫైమా. ఎప్పుడు చేశాడన్నది మాత్రం తెలియడం లేదు. వీకెండ్లో చూపిస్తారేమో చూడాలి. సూర్య అపరిచితుడిలా మారి కాసేపు నవ్వించాడు. ఓసారి రాములా, మరోసారి రెమోలా అలరించాడు. ఇది కాసేపు నవ్వు తెప్పించింది.  సూర్యతో ఫైమా కూడా కలవడంతో మరింతగా స్కిట్ పండింది. వీరిద్దరూ కలిసి డ్యాన్సు చేసి నవ్వించారు.  ఈ వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగనుంది. ‘బిగ్ బాస్’ హౌస్ కెప్టెన్సీ కోసం రేవంత్, సూర్య, ఫైమా, గీతూ, బాలాదిత్య, రాజశేఖర్ పోటీపడనున్నట్లు సమాచారం. 

Published at : 06 Oct 2022 03:29 PM (IST) Tags: Bigg Boss Telugu season 6 Bigg boss Promo Biggboss telugu written updates Biggboss telugu Highlights

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

టాప్ స్టోరీస్

Sajjala On Supreme Court : సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం - మూడు రాజధానులకు ప్రజామోదం ఉందన్న సజ్జల !

Sajjala On Supreme Court :   సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం  - మూడు రాజధానులకు ప్రజామోదం ఉందన్న సజ్జల !

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Sharmila Arrest : షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Sharmila Arrest :   షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్