Abijeet Harika: దేత్తడి హారికకు ‘బిగ్ బాస్’ అభిజీత్ సర్‌ప్రైజ్, ఏడాదిన్నర తర్వాత కలుసుకున్న #nobika
బిగ్ బాస్.. ఫ్రెండ్స్ దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ కలుకున్నారు. ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.
![Abijeet Harika: దేత్తడి హారికకు ‘బిగ్ బాస్’ అభిజీత్ సర్‌ప్రైజ్, ఏడాదిన్నర తర్వాత కలుసుకున్న #nobika Bigg Boss Season 4 Friends Abijeet Harika And Noel met again Abijeet Harika: దేత్తడి హారికకు ‘బిగ్ బాస్’ అభిజీత్ సర్‌ప్రైజ్, ఏడాదిన్నర తర్వాత కలుసుకున్న #nobika](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/06/ceb1183d620a1357f8e88ba97d2f67b4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
‘బిగ్ బాస్’(Bigg Boss Telugu) అభిమానులను అన్ని సీజన్లో మీకు ఏ సీజన్ నచ్చిందని అడిగితే.. ‘బిగ్ బాస్’ సీజన్ 4 అనే చెబుతారు. ఎందుకంటే.. అందులో ఉన్నంత కిక్ మరే షోలోనూ లేదు. ఎందుకంటే, అందులో ఆ 100 రోజులు ఒక పెద్ద డ్రామానే నడిచింది. ముఖ్యంగా అభిజీత్, అఖిల్, సోహెల్, మోనల్‌లు షో మొత్తాన్ని థ్రిల్లర్ సినిమాలా మార్చేశారు. వారి మధ్య ప్రేమ, స్నేహం, గొడవలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అభిజీత్-అఖిల్ మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోరు నడించింది. అభి డైలాగులైతే ఇప్పటికీ చెవులో మార్మోగుతూనే ఉన్నాయి. అఖిల్ ఇప్పుడు ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో తన లక్‌ను మళ్లీ పరీక్షించుకోడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ కూడా అభి అభిమానులు అతడిని వదలడం లేదు. ఇప్పుడు వారంతా బిందుకు సపోర్ట్ చేస్తూ.. అఖిల్‌ను ట్రోల్ చేస్తున్నారు.
2020లో జరిగిన ‘బిగ్ బాస్’ సీజన్-4లో అభిజీత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అఖిల్ రన్నరప్‌తో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆ ఇంట్లో అభి కేవలం నోయల్, దేత్తడి హరికతో మాత్రమే స్నేహంగా ఉండేవాడు. దీంతో వారి అభిమానులు వారిని #nobika అని ముద్దుగా పిలుచుకొనేవారు. సోహెల్ ఎలిమినేట్ అయిన తర్వాత అభి-హారికల మధ్య స్నేహం మరింత బలపడింది. ఇద్దరూ మధ్య మధ్య సమ్‌థింగ్ అన్నంత వరకు వచ్చింది. #Abika హ్యష్‌ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అయ్యింది.
Also Read: ‘ఆడ’ వీడియో ఏడ? అఖిల్ కోసం ‘బిగ్ బాస్’ బిందు బలి? అందుకే నాగ్ స్పందించలేదా?
కానీ, అభి బయటకు వచ్చిన తర్వాత ఆమెను సోదరిలా భావిస్తున్నానని చెప్పడంతో అభిమానుల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఆ తర్వాత వారిద్దరు ఎక్కడా కలుసుకోలేదు. ‘బిగ్ బాస్’ నుంచి బయటకు రాగానే అభి.. రెక్కలొచ్చిన పక్షిలా విదేశాలకు ఎగిరిపోయాడు. అక్కడే దాదాపు ఏడాదిన్నరగా షికార్లు చేసి.. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చారు. వచ్చి రావడంతోనే తన ‘బిగ్ బాస్’ స్నేహితులు హారిక, నోయెల్‌లను కలుసుకున్నాడు. ఆ ఫొటోలను బుధవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. ఆ ఫొటోలు చూడగానే.. #nobika అభిమానుల ఆనందానికి అవధులే లేవు. అభి పోస్ట్ చేసిన ఫొటోలను ఇక్కడ చూడండి.
Also Read: అఖిల్ ‘ఆడ’ పంచాయతీ, మైకు విసిరేసిన బిందు - చేయని తప్పుకు శిక్ష, ఇదిగో ఆధారం!
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)