By: ABP Desam | Updated at : 04 Apr 2022 06:08 PM (IST)
Image Credit: Disney + Hotstar/YouTube
Bigg Boss Non Stop | ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’పై నెటిజనులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గత వారం జరిగిన కొన్ని సంఘటనలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నటి బిందు మాధవి, అఖిల్ మధ్య జరిగిన గొడవ ఆ వారమంతా హైలెట్‌గా మారినా.. హోస్ట్ నాగార్జున దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్యర్యం కలిగించింది. అంతేకాదు, బిందు మాధవి నిజంగానే ‘అఖిల్’ను ఆడా అన్నదా? లేదా అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నెటిజనులు ‘బిగ్ బాస్’ను తిట్టి పోస్తున్నారు. అఖిల్‌కు టైటిల్ కట్టబెట్టేందుకే ‘బిగ్ బాస్’ బిందు మాధవిని బలి ఇస్తున్నాడని అంటున్నారు.
బిగ్ బాస్‌లో శని, ఆదివారాల్లో ఎలిమినేషన్లు జరుగుతాయనే సంగతి తెలిసిందే. అయితే, శనివారం మాత్రం ఆ వారమంతా హౌస్‌మేట్స్ చేసే తప్పులను ఏగిపారేస్తారు హోస్ట్ నాగార్జున. ఈ నేపథ్యంలో గత వారం బిందు-అఖిల్‌కు మధ్య జరిగిన గొడవపై నాగార్జున మాట్లాడతారని అంతా ఎదురు చూశారు. కానీ, దాని గురించి అసలు ఊసే లేదు. ఇది బిగ్ బాస్ చూస్తున్నవారికి కాస్త మింగుడు పడని విషయమే. దీంతో అంతా బిగ్ బాస్.. అఖిల్‌ను సపోర్ట్ చేస్తున్నాడని అనుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో నిజాయతీగా ఉంటున్న బిందును విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అసలు ఏం జరిగింది?: ఇటీవల బిందు, అఖిల్ మధ్య జరిగిన వాగ్వాదంపై ‘బిగ్ బాస్’ పెద్ద పంచాయతీయే పెట్టాడు. ఓ టాస్క్‌లో అఖిల్ ‘‘నేను ఆడ..’’ అని అన్నాడు. బిందు మాధవి అతడిని అనుకరిస్తూ ‘‘నువ్వు ఏదీ ఆడ’’ అని అంది. దీంతో అఖిల్ ‘‘నువ్వు ఆడుతున్నావా?’’ అని బిందును అడిగాడు. కొద్ది సేపటి తర్వాత ‘‘నువ్వు నన్ను ఆడ ఆడ అన్నావు. మాటలు సరిగ్గా రానివ్వు’’ అని వార్నింగ్ ఇచ్చాడు. బిందు మాధవి తనను ‘ఆడంగి’ అన్నదంటూ ఏడ్చేశాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ‘బిందు-అఖిల్’కు వివాదాన్ని తీర్చేందుకు పెద్ద పంచాయతీయే పెట్టాడు. జడ్జిగా ముమైత్ ఖాన్‌ను రంగంలోకి దించాడు. బిందు తరఫున శివ.. అఖిల్ తరఫున నటరాజ్ మాస్టర్ వాదనలు వినిపించారు. దీన్ని నటరాజ్ మాస్టార్ బాగా ఉపయోగించుకున్నాడు. బిందుపై తనకున్న ఆక్రోశాన్ని కక్కేందుకు దీన్ని వేదికగా చేసుకున్నాడు. ‘వకీల్ సాబ్’లో పవన్ కళ్యాణ్ తరహాలో నటించే ప్రయత్నం చేశాడు.
Also Read: అఖిల్ ‘ఆడ’ పంచాయతీ, మైకు విసిరేసిన బిందు - చేయని తప్పుకు శిక్ష, ఇదిగో ఆధారం!
బిందు, అఖిల్ మధ్య జరిగిన ఈ గొడవలో.. ఆమె ‘ఆడ’ అనే పదాన్ని వాడిందా? నిజంగానే అఖిల్‌ను ఆ ఉద్దేశంతో ‘ఆడ’ అని అందా అనేది నాగార్జున వీడియో చూపించి నిరూపిస్తారని అంతా భావించారు. కానీ, ఈ విషయంలో ‘బిగ్ బాస్’ టీమ్ విఫలమైంది. వాస్తవానికి బిందు అతడిని నువ్వు ఆడదానివి అనే ఉద్దేశంతో అనలేదు. ‘‘నువ్వు ఏదీ ఆడా’’ అని మాత్రమే అని అంది. అది అఖిల్‌కు కూడా తెలుసు. అందుకే వెంటనే ‘‘నువ్వు ఆడుతున్నావా?’’ అని బిందును అడిగాడు. ఆ తర్వాత అతడి స్నేహితులు బ్రెయిన్ వాష్ చేయడంతో దాన్ని అఖిల్ అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో స్పష్టంగా రికార్డైంది. దాన్ని టెలికాస్ట్ చేస్తే.. అఖిల్ పరువే పోతుందని ‘బిగ్ బాస్’ టీమ్ భావించిందో ఏమో.. అసలు ఏమీ జరగలేనట్లుగా ‘నాగ్’ ఎపిసోడ్‌ను ముగించేశారు. మరి, నాగార్జునైనా ‘బిగ్ బాస్’ను నాన్ స్టాప్‌గా చూస్తున్నారో లేదో అనే సందేహాలను కూడా ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో చూసిన తర్వాతైనా అఖిల్ తన బ్యాచ్ ఎంతగా తనని తప్పుదోవ పట్టిస్తున్నారో తెలుసుకొనేవాడని, మంచి అవకాశాన్ని మిస్ చేశారని అంటున్నారు.
Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి