Bigg Boss OTT Telugu: ఫస్ట్‌ నైట్‌కు పోతున్నారా? అఖిల్-బిందులపై అషురెడ్డి దారుణమైన కామెంట్స్ 

నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్ లో అఖిల్, బిందుని ఒక టీమ్ గా ఎంపిక చేశారు బిగ్ బాస్. వీరిద్దరూ మిగిలిన వారితో పోల్చుకుంటే బాగానే ఆడుతున్నారు.

FOLLOW US: 

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ హద్దులు మీరు ప్రవర్తిస్తుంటారని.. వారు చేసే కామెంట్స్ దారుణంగా ఉంటాయని.. ఈ షోని బ్యాన్ చేయాలని చాలా మంది కేసులు పెడుతుంటారు. కానీ ఈ షోని మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు. టీవీలో ప్రసారమైన షో విషయానికొస్తే.. ఎవరైనా తప్పుగా మాట్లాడినా, ప్రవర్తించినా ఎడిటింగ్ లో తీసేస్తుంటారు. కానీ ఓటీటీలో ప్రసారమయ్యే నాన్ స్టాప్ విషయంలో మాత్రం ఇలాంటి ఆప్షన్ ఉండదు. ఇప్పుడు తెలుగులో ప్రసారమవుతోన్న బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో వల్గర్ జోకులు ఎక్కువయ్యాయి. 

నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్ లో అఖిల్, బిందుని ఒక టీమ్ గా ఎంపిక చేశారు బిగ్ బాస్. వీరిద్దరూ మిగిలిన వారితో పోల్చుకుంటే బాగానే ఆడుతున్నారు. ఈ గేమ్ కి అషురెడ్డి సంచాలకురాలిగా వ్యవహరిస్తోంది. టాస్క్ లో ఈమె అఖిల్-బిందులపై చెత్త కామెంట్స్ చేయడంతో నెటిజన్లు అషురెడ్డిని తిట్టిపోస్తున్నారు. గేమ్ లో భాగంగా అఖిల్.. మిత్రా దగ్గరకు వెళ్లి తనకు, బిందుకి రెండు యాపిల్స్‌, రెండు అరటిపండ్లు, రెండు ఆరెంజ్‌ కావాలని డీల్‌ మాట్లాడుకుంటున్నాడు. 

ఇది విన్న అషూ టాస్క్‌ ఆడబోతున్నారా? ఫస్ట్‌ నైట్‌కు పోతున్నారా? అంటూ సెటైర్‌ వేసింది. దీనికి అఖిల్ రియాక్ట్ అవ్వకుండా నవ్వేసి ఊరుకున్నాడు. ఆ తరువాత అఖిల్‌, అషు, అజయ్‌, నటరాజ్‌ బెడ్‌ మీదకు చేరి ముచ్చట్లు పెట్టారు. ఆ సమయంలో అఖిల్.. శివ, బిందు హీరోహీరోయిన్స్‌ అని కామెంట్ చేశాడు. దీనికి అజయ్‌ దుప్పట్లో దడదడ అని వల్గర్ జోక్ వేశాడు. మధ్యలో అషురెడ్డి అందుకుని ముసుగులో గుద్దులాట అని మాట్లాడింది. దానికి అజయ్‌ గోడకేసి గుద్దు అంటూ మరో కామెంట్ చేశాడు.

ఇక అర్ధరాత్రి అఖిల్, అషురెడ్డి, నటరాజ్ మాస్టర్ మాట్లాడుకుంటూ ఉండగా.. అఖిల్ మధ్యలో లేచి నేను పడుకుంటా అని వెళ్లబోయాడు. దానికి అషు.. ఎక్కడ పడుకుంటావ్..? అని అడిగింది. వెంటనే అఖిల్.. 'బిందు పక్కన' అని బదులిచ్చాడు. దానికి అషురెడ్డి సీరియస్ లుక్ ఇచ్చి.. 'ఇద్దరిని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా' అంటూ బెదిరించేలా కామెంట్స్ చేసింది. ఇలా అఖిల్, అషురెడ్డి, అజయ్ లు బిందుని టార్గెట్ చేస్తూ ఇలాంటి దారుణమైన కామెంట్స్ చేస్తుండడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. 

అషురెడ్డి ఒక అమ్మాయి అయి ఉండి మరో మహిళ గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుందా..? అంటూ తిట్టిపోస్తున్నారు. ఈ విషయం గురించి నాగార్జున వారితో మాట్లాడాలని లేదంటే ఎలిమినేట్ చేయండని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

Published at : 13 Apr 2022 10:28 AM (IST) Tags: Akhil Bigg Boss OTT Ajay Bigg Boss OTT Telugu Ashureddy Bindu Madhavi

సంబంధిత కథనాలు

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

టాప్ స్టోరీస్

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్

Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్