Bigg Boss OTT Telugu: ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు, ఎవరెవరంటే?
ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఎనిమిది వారాలను పూర్తి చేసుకుంది. తొమ్మిదో వారం నామినేషన్స్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. ఈ ప్రాసెస్ లో ముందుగా అఖిల్.. యాంకర్ శివ, హమీదలను నామినేట్ చేశాడు. ఈ సమయంలో అఖిల్ కి శివకి మళ్లీ బాత్రూమ్ టాపిక్ వచ్చింది. ఆ తరువాత అరియానా.. నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేయగా.. అతడు ఎప్పటిలానే ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. అరియనాకు స్వార్ధమని, ఆమె అసలు గేమ్ ఆడడం లేదని కామెంట్స్ చేశాడు. దానికి అరియనా ధీటుగా సమాధానం చెప్పింది. ఆ తరువాత హమీదను నామినేట్ చేసింది.
యాంకర్ శివ.. నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేస్తూ.. గేమ్ ఆడే సమయంలో తన మీద మీదకి వచ్చారని ఇకపై అలా చేయొద్దని చెప్పాడు. దీంతో నటరాజ్ మాస్టర్ శివపై మండిపడ్డారు. ఆ తరువాత మిత్రాశర్మను నామినేట్ చేశాడు. దీంతో మిత్రా బాధపడుతూ.. గట్టిగట్టిగా అరిచింది. నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్స్ తనకు నచ్చలేదని కాసేపు వాదించింది. హమీద.. అరియనా, నటరాజ్ మాస్టర్ లను నామినేట్ చేసింది. దీంతో వారిద్దరితో హమీదకు గొడవైంది.
అషురెడ్డి.. యాంకర్ శివను నామినేట్ చేస్తూ.. తనతో ప్రవర్తించిన తీరు బాలేదని కారణం చెప్పింది. ఆ తరువాత బాబా భాస్కర్ ని నామినేట్ చేసింది. ఆమె చెప్పిన కారణాలు నచ్చకపోవడంతో బాబా భాస్కర్ నవ్వుతూనే ఆర్గ్యూ చేశారు. ఇక మిత్రాశర్మ.. యాంకర్ శివను నామినేట్ చేస్తూ వరస్ట్ గేమర్ అని కామెంట్ చేసింది. దానికి శివ.. 'చీప్ గేమర్' అని మిత్రాశర్మను అన్నాడు. ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. ఆ తరువాత బిందు మాధవిని నామినేట్ చేసింది. ఈ సమయంలో బిందు మాధవి, మిత్రా ఒకరిపై మరొకరికి వెళ్తూ అరుచుకున్నారు.
అనిల్.. నటరాజ్ మాస్టర్, బాబా మాస్టర్ లను నామినేట్ చేశాడు. బిందు మాధవి.. మిత్రాశర్మ, యాంకర్ శివలను నామినేట్ చేసింది. నటరాజ్ మాస్టర్.. అనిల్, అరియానాలను నామినేట్ చేశాడు. ఈ సమయంలో అరియానాకు నటరాజ్ మాస్టర్ కి పెద్ద గొడవ జరిగింది. ఆ తరువాత బాబా మాస్టర్.. అనిల్, మిత్రాశర్మలను నామినేట్ చేశాడు.
ఈ వారం నామినేట్ అయిన సభ్యులెవరంటే.. నటరాజ్ మాస్టర్, శివ, మిత్రాశర్మ , అరియనా, బాబా భాస్కర్, హమీద, అనిల్.
Also Read: తెరవెనుక 'థాంక్యూ' టీమ్ - ఏం డిస్కస్ చేసుకుంటున్నారో?
Also Read: ఈ వారం థియేటర్-ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే
"Control ane okati untadhi..."🙉
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 25, 2022
😳🤯🤭🙉 House antha allakallolam! Em jarugutundo chudandi ivvala episode Bigg Boss Non-Stop lo ratira 9 PM ki on @DisneyPlusHS #BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND pic.twitter.com/WNiJCLG712