Bigg Boss OTT Telugu: ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?
ఈ వారంలో హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..?
బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ మొదలై వారం రోజులు పూర్తయింది. మొదటి వారం హౌస్ నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. నిజానికి మిత్రా ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా ముమైత్ హౌస్ నుంచి వెళ్లాల్సి వచ్చింది. తనను అందరూ తప్పుగా పోట్రే చేశారంటూ ఆమె చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇదిలా ఉండగా.. సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్.
వారియర్స్ టీమ్ సభ్యులు ఛాలెంజర్స్ టీమ్ సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఛాలెంజర్స్ టీమ్.. వారియర్స్ ను నామినేట్ చేయాలి. ఈ క్రమంలో హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తేజస్వి.. ఛాలెంజర్స్ టీమ్ నుంచి అనిల్ ని నామినేట్ చేసింది. ఇప్పటికైనా అతడు గేమ్ పై ఫోకస్ చేయాలని చెప్పింది. ఈసారి కూడా ఛాలెంజర్స్ టీమ్ నుంచి చాలా మంది సరయు, నటరాజ్ మాస్టర్ లను టార్గెట్ చేశారు. అరియనా.. శ్రీరాపాకను నామినేట్ చేస్తూ గత వారం తనపై ఇచ్చిన స్టేట్మెంట్స్ నచ్చలేదని చెప్పింది.
మిత్రా.. అషురెడ్డి, హమీదలను నామినేట్ చేసింది. ఈ క్రమంలో అషుతో పెద్ద డిస్కషన్ పెట్టింది. ఒకరిపై మరొకరి అరుచుకున్నారు. తొలిసారి మిత్రా తన వాయిస్ రైజ్ చేసింది. చాలా సేపు వాదించుకున్న తరువాత గొడవ ఆగింది. శివ.. సరయు, అఖిల్ లను నామినేట్ చేశాడు. ఈ సమయంలో అఖిల్ కి, శివకి మధ్య మాటల యుద్ధం జరిగింది.
మొత్తంగా ఈ వారంలో హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు.. సరయు, అఖిల్, హమీద, అనిల్, మిత్ర, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, అషురెడ్డి, శ్రీరాపాక, మహేష్ విట్టా.
https://t.co/b51uO1NDys
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 7, 2022
Daggers 🗡️ lanti views and opinions! Guccheskunnayi! Evaru evarni nominate chesaru mari 😱 !
Catch the full episode on @DisneyPlusHS at 9PM!!#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND
https://t.co/MVNvd3OeEC
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 7, 2022
Ee Chilaka jyothishyudu housemates gurunchi em cheptunnado?! 🦜
Watch the full episode at 9 PM exclusively on @DisneyPlusHS @EndemolShineIND#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop