Bigg Boss OTT Telugu: మిత్రాశర్మ టాప్ 5కి చేరుకుంటుందా?
గతవారం నామినేషన్ల ప్రక్రియ విషయంలో తనను టార్గెట్ చేసిన బిందు మాధవి చేసిన వ్యాఖ్యలను మిత్రా శర్మ తప్పుపట్టింది.
బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో కంటెస్టెంట్ గా పాల్గొంది మిత్రాశర్మ. తొలివారమే ఈ బ్యూటీ ఎలిమినేట్ అవుతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ తమ గేమ్ స్ట్రాటజీతో పదో వారంలోకి ఎంటర్ అయింది. అయితే గత నామినేషన్ల ప్రక్రియ నుంచి హోస్ట్ నాగార్జున నిర్వహించే వీకెండ్ షో వరకు ఆమె ఫైర్ బ్రాండ్‌గా నిలిచింది. వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున వేదిక మీద పంపించిన ఫోటో చూసి మిత్రా శర్మ ఎమోషనల్ కంటతడి పెట్టుకొన్నారు. అయితే ఆ ఫోటో వెనుక కథ ఏమిటంటే..
గతవారం నామినేషన్ల ప్రక్రియ విషయంలో తనను టార్గెట్ చేసిన బిందు మాధవి చేసిన వ్యాఖ్యలను మిత్రా శర్మ తప్పుపట్టింది. టాస్క్ ఆడుతున్న సమయంలో తనకు వెన్నునొప్పి ఉందని మిత్రా చెబితే.. దానిని తప్పుడు విధంగా చెబుతూ మిత్రాశర్మ వెన్నుముకకు సర్జరీ జరిగిందంటూ కామెంట్స్ చేసింది బిందు. ఈ ఆరోపణలను నాగార్జున తప్పుపట్టారు. బిందుమాధవి టార్గెట్ చేయడాన్ని మిత్ర బలంగా తిప్పి కొట్టింది.
మిత్రా శర్మను ఉద్దేశించి బిందు మాధవి చేసిన కొన్ని వ్యాఖ్యలపై నాగార్జున స్పందిస్తూ.. ఎవరైనా ఏమైనా విషయం చెబితే.. వాటిని ఊహించుకోవద్దని ఇంటి సభ్యులకు సలహా ఇచ్చారు. ఆ తరువాత వేదికపైకి కంటెస్టెంట్ల ఇంటి సభ్యులను పిలిచి ఫన్ గేమ్ ఆడించారు. అయితే చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొన్న మిత్రాశర్మకు తన తండ్రి ఫోటోను పంపించడంతో ఎమోషనల్ అయింది.
నాగార్జున పంపిన తన తండ్రి ఫోటోను చూసి మిత్రాశర్మ వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఇంట్లోకి కంటెస్టెంట్స్ అందరి కుటుంబ సభ్యులు వస్తుంటే.. తన ఫ్యామిలీ మెంబర్స్ రాకపోవడంపై ఆవేదన చెందింది. 'నాకు నా అనే వాళ్లు లేరని' కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే ఇలాంటి భావోద్వేగమైన క్షణాల్లో మిత్రాశర్మకు ఇష్టమైన సిరి హన్మంతు, గంగాధర్‌ను పరిచయం చేశారు. వారిని చూడగానే మిత్రాశర్మ ఎమోషనల్ అయింది.
తనను చూడటానికి వచ్చిన గంగాధర్ గురించి మాట్లాడుతూ అతడు తన తండ్రి తర్వాత తండ్రి లాంటి వారని.. అన్నయ్య లాంటి వారు అని ఆనందాన్ని వ్యక్తం చేసింది. మిత్రాశర్మ గురించి గంగాధర్ మాట్లాడుతూ.. ఆమె సివంగిలానే గేమ్ ఆడుతుందని.. బయట ఎలా ఉంటుందో.. ఇంట్లో కూడా అలానే ఉందన్నారు. ఇక మిత్రా గేమ్ గురించి సిరి హన్మంతు కూడా ప్రశంసలు కురిపించింది. టాప్ 5లో ఉండటం ఖాయమని సిరి హన్మంతు జోస్యం చెప్పింది.
Also Read: కొరటాల శివకు కండిషన్లు పెట్టిన ఎన్టీఆర్?
Also Read: రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు ఫ్లాప్స్ తప్పవా? అసలు కారణాలు ఏంటి??
View this post on Instagram