Bigg Boss OTT Telugu: 'బిగ్ బాస్' సెకండ్ డే హైలైట్స్: ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ - నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్
బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ లో రెండో రోజు ఏం జరిగిందో చూశారా?
Bigg Boss Non Stop: 'బిగ్ బాస్' నాన్-స్టాప్ షో మొదలైంది. హోస్ట్ నాగార్జున 17 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. గత బిగ్ బాస్ సీజన్లలోని బిగ్ బాస్ సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులను ఛాలెంజర్స్‌గా హౌస్‌లోకి పంపించారు. రెండో రోజు ఆదివారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన హైలెట్స్‌ను ఇప్పుడు చూసేద్దాం!
అరియానాతో గోవా వెళ్లానన్న చైతు - అరియానా తనకు ముందే తెలుసని చైతూ.. తేజస్వికి తెలిపాడు. 4వ సీజన్ ముగిసిన తర్వాత అరియానాతో కలిసి గోవాకు వెళ్లా, అక్కడ మేము.. అంటూ మధ్యలో ఆపేశాడు.
వారియర్స్ కి షాకిచ్చిన బిగ్ బాస్ - వారియర్స్ కు బిగ్ బాస్ షాకిచ్చాడు. ఇకపై ఇంట్లో ఏ ప్రయోజనాలు కావాలన్నా ఛాలెంజర్స్ పై ఆధారపడాల్సిందే. వారియర్స్ అంటే.. ఇదివరకు ‘బిగ్ బాస్’ సీజన్లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్లు. ఛాలెంజర్స్ అంటే కొత్తగా ‘బిగ్ బాస్’లోకి వచ్చిన కంటెస్టెంట్లు. ఇక బిగ్ బాస్ పెట్టిన కొత్త రూల్స్‌లోకి వెళ్తే.. బెడ్ రూమ్ యాక్సెస్‌ను వారియర్స్‌కు పరిమితం చేశారు. ఛాలెంజర్స్ అనుమతి లభిస్తేనే బెడ్ రూమ్‌లో నిద్రపోయే అవకాశం వారియర్స్‌కు లభిస్తుంది. అలాగే వారియర్స్ పూర్తి లగేజ్ కూడా ఛాలెంజర్స్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఆ లగేజ్ నుంచి ఒక్క వారియర్ మాత్రమే 5 వస్తువులు తీసుకోవాలి. ఇందుకు వారు ఛాలెంజర్స్ అనుమతి తీసుకోవాలి.
మేనేజర్ గా ముమైత్ - ఛాలెంజర్స్ అందరూ డిసైడ్ చేసుకొని.. నటరాజ్ మాస్టర్, తేజస్వి,అరియనా, అఖిల్ లను చెఫ్ లుగా ఎంపిక చేశారు. హౌస్ కీపింగ్ టీమ్ గా.. అషు, మహేష్, హమీద, సరయులను ఎంపిక చేశారు. మేనేజర్ గా ముమైత్ ను ఫైనల్ చేశారు.
చైతు చేసిన పనికి అషురెడ్డి షాక్ - ఛాలెంజర్స్.. వారియర్స్ తో సేవలు చేయించుకోవచ్చు కాబట్టి.. ఆర్జే చైతు అషురెడ్డిని నీళ్లు తీసుకురమ్మని చెప్పాడు. ఆమె వాటర్ బాటిల్ ఫుల్ గా వాటర్ తీసుకురాగా.. తాగించమని అడిగాడు చైతు. ఆయన చెప్పినట్లుగానే చేసింది అషు. అయితే సడెన్ గా తన నోట్లో నీళ్లని అషు మొహంపై ఊశాడు చైతు. దీంతో అషు షాకైంది. నీళ్లు ఎక్కువ తాగించడంతోనే అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. కానీ చైతు కావాలనే చేశాడనే విషయం క్లియర్ గా తెలుస్తుంది. దీన్ని అషురెడ్డి సీరియస్ గా తీసుకోకపోవడంతో ఇష్యూ అవ్వలేదు.
నామినేషన్ ప్రక్రియ షురూ - ఈరోజే నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. ఛాలెంజర్స్ టీమ్ నుంచి ప్రతి ఒక్కరూ.. వారియర్స్ టీమ్ నుంచి ఇద్దరు సభ్యులను ఇంటి నుంచి బయటకు పంపడానికి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఛాలెంజర్స్ టీమ్ సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో.. వాళ్లకి కొన్ని ట్యాగ్స్ ను ఇచ్చి కారణాలు చెప్పి నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. అంటే ఈ వారం ఛాలెంజర్స్ టీమ్ నుంచి ఎవరూ కూడా నామినేషన్ లో ఉండరన్నమాట.
ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే.. :
శివ - సరయుకి అగ్రెసివ్ ట్యాగ్ ఇచ్చిన శివ.. ఆమె సడెన్ గా సీరియస్ అయిపోతుందని కారణం చెప్పాడు. ముమైత్ కి కూడా అదే ట్యాగ్ ఇచ్చి నామినేట్ చేశాడు శివ. ఈ విషయంలో ముమైత్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
మిత్ర శర్మ - అరియనాతో బాండింగ్ లేదని రీజన్ చెప్పి ఆమెని నామినేట్ చేసింది. ఈ విషయంలో అరియానా సీరియస్ అయింది. బయటకి పంపించేస్తూ.. బాండింగ్ అవ్వట్లేదని చెత్త కారణమని ఫైర్ అయింది. ఆ తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేసింది. సరైన కారణాలు చెప్పకపోవడంతో నటరాజ్ మాస్టర్ ఆర్గ్యూ చేశారు.
ఆర్జే చైతు - హమీదని నామినేట్ చేస్తూ.. ఆమె నుంచి నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయని చెప్పింది. దీంతో హమీద చాలాసేపు చైతుతో వాదించింది. తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. బాడీ షేమింగ్ చేశారని రీజన్ చెప్పాడు. దీంతో నటరాజ్ మాస్టర్ సీరియస్ అయ్యారు. ప్లాన్ చేసుకొని తనను నామినేట్ చేస్తున్నారని కామెంట్ చేశారు నటరాజ్ మాస్టర్.
అజయ్ - నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. టాస్క్ లో అతడి బిహేవియర్ నచ్చలేదని రీజన్ చెప్పాడు. తరువాత సరయుని నామినేట్ చేశాడు.
శ్రీరాపాక - అరియనాను నామినేట్ చేస్తూ.. డ్రామా క్వీన్ అని ట్యాగ్ ఇచ్చింది. దీంతో అరియనా వాదిస్తూ.. తన వెర్షన్ చెప్పింది. తరువాత ముమైత్ ని నామినేట్ చేసింది.
అనిల్ రాథోడ్ - నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. ఆయనతో అసలు బాండింగ్ లేదని కారణం చెప్పాడు. సరయుతో మాట్లాడాలంటే ఆలోచించాల్సి వస్తుందని రీజన్ చెబుతూ.. ఆమెని నామినేట్ చేశాడు. దీంతో సరయు సీరియస్ అయింది. తప్పుగా అర్ధం చేసుకుంటూ.. తనను నామినేట్ చేస్తున్నారని మండిపడింది.
బిందు మాధవి - అఖిల్ కారణంగానే గేమ్ ఆగిందని రీజన్ చెబుతూ అతడిని నామినేట్ చేసింది. స్రవంతి చొక్కారపు - హమీద ఎక్కువగా రియాక్ట్ అవుతుందని కారణం చెబుతూ నామినేట్ చేసింది. తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేసింది.
ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే.. నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, అఖిల్.
Also Read: 'బిగ్ బాస్ మేళా' ఎవరెవరికి ఏ పనులు కేటాయించారంటే?