Bigg Boss OTT Telugu: బిందుని హగ్ చేసుకున్న అఖిల్, అషురెడ్డి లుక్ చూశారా?
హౌస్ మేట్స్ తో కొన్ని గేమ్స్ ఆడించారు ఓంకార్. అందులో భాగంగా అజయ్.. బిందు మాధవి మీద పొగడ్తల వర్షం కురిపించారు.

మూడో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి పన్నెండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారెవరంటే.. మిత్రా, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి, అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియానా, బిందు. ఆదివారం నాడు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇక శనివారం ఎపిసోడ్ లో హౌస్ లోకి గెస్ట్ ను పంపించారు. ఆ గెస్ట్ మరోవరో కాదు.. యాంకర్ ఓంకార్.
హౌస్ మేట్స్ తో కొన్ని గేమ్స్ ఆడించారు ఓంకార్. అందులో భాగంగా అజయ్.. బిందు మాధవి మీద పొగడ్తల వర్షం కురిపించారు. అఖిల్.. హమీదాని చందమామతో పోలుస్తూ పొగిడాడు. ఇక అషురెడ్డి-అనీల్‌లు రంగులు పూసుకుని రొమాన్స్ చేశారు. మధ్యమధ్యలో ఓంకార్ తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ హౌస్ మేట్స్ ని ఆటపట్టించారు.
ఇక ఇంటి సభ్యుల కోసం కొన్ని గిఫ్ట్స్ పంపించారు బిగ్ బాస్. అందులో అషురెడ్డికి గిన్నెలు క్లీన్ చేసే స్క్రబ్ రావడంతో అందరూ నవ్వుకున్నారు. బిందుకి ఆవకాయ్ బిరియాని వచ్చింది. దీంతో ఓంకార్ తెగ పొగిడేశాడు. ఆ తరువాత హౌస్ మేట్స్ ని జంటలుగా చేసి వారితో డాన్స్ లు చేయించాడు. బిందు మాధవి, అఖిల్ లను ఒక పెయిర్ గా చేయడంలో వారిద్దరూ కలిసి డాన్స్ చేశారు. వారిద్దరూ చాలా క్యూట్ గా ఉన్నారని.. రియల్ కపుల్ గా అనిపించారని ఓంకార్ చెప్పారు.
ఈ హోలీ నుంచి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కుదరాలని ఓంకార్ చెప్పగా.. తప్పకుండా అని అఖిల్, బిందు హగ్ చేసుకున్నారు. అది చూసిన అషురెడ్డి షాకైంది. దీంతో వెంటనే ఓంకార్ 'ఆ లుక్ ఏంటి..? నేను కాలిపోయేలా ఉన్నాను' అంటూ ఫన్నీగా అన్నారు. దానికి అషు.. 'నా మొహమే అంత సర్' అంటూ నవ్వేసింది.
Also Read: 'పెన్నీ సాంగ్' ప్రోమో, ఫ్యాన్స్ కి మహేష్ బాబు సర్‌ప్రైజ్
https://t.co/oAjljH0wnh
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 19, 2022
Housemates andhariki gifts🎁🎁🎁.... FROM #BiggBoss! But what did they receive? Watch the full episode tonight at 9PM exclusively on @DisneyPlusHS#BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND
Holi brings colour🔴🟢🟡🟣, a colourful surprise🧔 guest... and also some special moments with the housemates💝! Watch the special #BiggBossNonStop episode tonight at 9PM exclusively on @DisneyPlusHS#BiggBoss #BiggBossTelugu @EndemolShineIND pic.twitter.com/cfN8zC6q3V
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 19, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

