Bigg Boss OTT Telugu: అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు - అరియనా బ్రేకప్ స్టోరీ
తాజాగా బిగ్ బాస్ ఎపిసోడ్ లో తన బ్రేకప్ స్టోరీను చెప్పుకొచ్చింది అరియనా.
![Bigg Boss OTT Telugu: అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు - అరియనా బ్రేకప్ స్టోరీ Bigg Boss OTT Telugu: Ariyana's Love story Bigg Boss OTT Telugu: అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు - అరియనా బ్రేకప్ స్టోరీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/09/74e47601b57b7fdc82dfa6e9c0ab2dc9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చేస్తూ.. యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అరియనాకు బిగ్ బాస్ సీజన్ 4లో అవకాశం వచ్చింది. ఆ షోతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా బిగ్ బాస్ ఎపిసోడ్ లో తన బ్రేకప్ స్టోరీను చెప్పుకొచ్చింది అరియనా. ఇంటర్ పూర్తయ్యేసరికి ఇంటి నుంచి బయటకు వచ్చేసిన అరియనా.. తన బావతో కలిసి హైదరాబాద్ లో ఉండేదట.
దాదాపు మూడేళ్లపాటు కలిసి ఉన్నామని.. ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ అయ్యామని.. కానీ ఏదొక సమయానికి బోర్ కొడతారు అంటారు కదా.. అప్పుడు అర్ధం కాలేదు.. ఇప్పడూ అర్ధమవుతుందని చెప్పింది అరియానా. ఒక రోజు తన బావని చూడకూడని సిచ్యువేషన్‌లో చూశానని.. అలా చేస్తాడని ఊహించలేదని.. తన గుండె పగిలినంత పనైందని చెప్పుకొచ్చింది.
తను ఏం చూశాననేది ప్రపంచానికి చెప్పుకోలేనని ఎమోషనల్ అయింది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని చెప్పింది. అప్పుడు తన బావతో విడిపోదామని అనుకున్నట్లు.. కానీ అతడు రిక్వెస్ట్ చేయడంతో మరో రెండేళ్లు అతడితోనే కలిసి ఉన్నానని చెప్పింది. అదే సమయంలో ఆర్జేగా అవకాశం కోసం ప్రయత్నిస్తుంటే.. ఓ అమ్మాయితో పరిచయమైందని.. అప్పటినుంచి తన బావలో అనుమానం మొదలైందని గుర్తుచేసుకుంది అరియనా.
అక్కడితో బ్రేకప్ చెప్పేసి బయటకు వచ్చేశానని.. కానీ బావని మర్చిపోలేక ఫోన్లు చేసి బతిమాలానని చెప్పింది. కానీ తన బావ పట్టించుకోలేదని.. ఒకరోజు నేరుగా ఇంటికి వెళ్తే తనను రోడ్ మీద నిలబెట్టి మాట్లాడాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తన బావ వచ్చినా సరే వద్దు అని.. తన బ్రేకప్ స్టోరీని చెబుతూ ఏడ్చేసింది అరియనా.
Also Read: 'కథ కంచికి మనం ఇంటికి' రివ్యూ: 'చీకటి గదిలో చితకొట్టుడు'తో త్రిగుణ్ మీద పడిన మచ్చ పోతుందా?
Also Read: 'గని' సినిమా రివ్యూ: బాక్సింగ్ పంచ్ అదిరిందా? లేదా?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)