Bigg Boss: ‘బిగ్ బాస్’ విన్నర్‌పై ఆరోపణలు, ట్రోఫీ తిరిగి ఇచ్చేస్తానంటూ వీడియో
బిగ్ బాస్ విన్నర్ అవ్వడం అంత ఈజీ కాదని, పీఆర్ ఏజెన్సీలు రంగంలోకి దిగుతాయని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
బిగ్ బాస్ అనేది చూసే సాధారణ ప్రేక్షకులకు ఒక రియాలిటీ షోలాగా మాత్రమే ఉంటుంది. కానీ ఈ షోలో గెలవడం కోసం కంటెస్టెంట్స్ వివిధ రకాల స్ట్రాటజీలను ఉపయోగిస్తారు. బయట పీఆర్ ఏజెన్సీలను పెట్టి ప్రమోషన్స్ చేయిస్తారు. ఫ్యాన్స్‌ను పెంచుతారు. ఫేక్ ఓట్లు కూడా వేయిస్తారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన దామిని కూడా చాలామంది కంటెస్టెంట్స్ నాలుగైదు పీఆర్ ఏజెన్సీలను మెయింటేయిన్ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేవలం తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా కంటెస్టెంట్స్ పీఆర్‌లను మెయింటేయిన్ చేస్తారు అన్నది ఓపెన్ సీక్రెట్. తాజాగా హిందీలోని బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్‌లో విన్నర్ అయిన ఎల్విష్ యాదవ్‌పై అలాంటి ఆరోపణలు రాగా.. తాజాగా దానిపై ఎల్విష్ స్పందించాడు.
ట్రోఫీని తీసుకోండి
పీఆర్ ద్వారానే ఎల్విష్ యాదవ్.. బిగ్ బాస్ ఓటీటీ 2 గెలిచాడని తనపై ట్రోల్స్ మొదలయ్యాయి. కొన్నాళ్లుగా ఆ ట్రోల్స్‌ను భరిస్తూ వస్తున్న ఎల్విష్.. తాజాగా వాటిపై స్పందించాడు. అవన్నీ అబద్ధమని ప్రూవ్ చేయడం కోసం తాను దైనికైనా సిద్ధమని అన్నాడు. తాజాగా దీనిపై స్పందిస్తూ.. తానొక వీడియోను విడుదల చేశాడు. ‘‘ఈ ట్రోఫీని తీసుకొని నన్ను వదిలేయండి ప్లీజ్. దీనంతటికి కారణం ఇదే. ఎవరైనా ట్రోఫీని తీసుకోండి ప్లీజ్. కొరియర్ చేస్తాను ప్లీజ్. బిగ్ బాస్‌కు సంబంధించి ఉన్నదంతా ఇచ్చేస్తాను. హార్స్ బొమ్మతో సహా ప్రతీది ఇచ్చేస్తాను. నేను ఆ ట్వీట్స్ చూశాను. నాకు మనశ్శాంతి కావాలి. ఈ ట్రోఫీ మీద బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ అని ఉంది. అయినా సరే తీసుకోండి’’ అంటూ వేడుకున్నాడు ఎల్విష్.
డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నాను
‘‘నేను చాలారోజుల తర్వాత ఇంటికి వచ్చాను. నా జీవితంలో ఈ నెగిటివిటీ వద్దు. నేను నా పనిలో సంతోషంగా ఉన్నాను. నేను డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నాను. నా కొత్త ఇంటిని పూర్తి చేద్దామని అనుకుంటున్నాను. కొత్త ప్రాపర్టీలను, కార్లను కొనాలని అనుకుంటున్నాను. నేను ఈ ఆన్‌లైన్ విషయాల్లో జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదు. మీకు ట్రోఫీ కావాలనిపిస్తే.. నాకు మెసేజ్ చేయండి. నేను పంపిస్తాను. నేను దీంతో విసిగిపోయాను.’’ అని తనలోని బాధను అంతా బయటపెట్టేశాడు ఎల్విష్ యాదవ్. ఆపై తన తల్లి గురించి అసభ్యకరంగా మాట్లాడవద్దని నెటిజన్లను వేడుకున్నాడు.
ఎల్విష్ వర్సెస్ అభిషేక్
ముఖ్యంగా ఎల్విష్ యాదవ్‌పై పీఆర్ ఆరోపణలు చేసింది యూట్యూబర్ అభిషేక్ మల్హాన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎల్విష్ వర్సెస్ అభిషేక్ వార్ నడుస్తోంది. అభిషేక్ మల్హాన్.. కేవలం యూట్యూబర్ మాత్రమే కాదు.. బిగ్ బాస్ ఓటీటీ1లో కంటెస్టెంట్ కూడా. అయితే తను ఎల్విష్‌పై ఆరోపణలు ఎందుకు చేశాడో తెలియదు కానీ.. తను చేసిన పీఆర్ ఆరోపణలను మాత్రం చాలామంది నెటిజన్లు నమ్మారు. బిగ్ బాస్ ఓటీటీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టి అభిషేక్ మల్హాన్ రికార్డ్ సృష్టించాడు. పైగా చాలామంది అభిమానులను సంపాదించుకొని ఫస్ట్ రన్నరప్ కూడా అయ్యాడు.
Also Read: కచ్చితంగా తిడతారు, నేను చాలామందికి ఆ సలహా ఇవ్వను: శుభశ్రీ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial