అన్వేషించండి

Subhasree: కచ్చితంగా తిడతారు, నేను చాలామందికి ఆ సలహా ఇవ్వను: శుభశ్రీ

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులోకి ఎంటర్ అయిన తర్వాత శుభశ్రీ అంటే ఎవరో ప్రేక్షకులకు తెలుసు. కానీ ఇందులోకి ఎంటర్ అవ్వకముందు తన ప్రొఫెషనల్ కెరీర్‌కు సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో కంటెస్టెంట్స్‌గా వచ్చిన చాలామంది ప్రేక్షకులకు ముందు నుండి పరిచయం లేదు. శివాజీ, షకీలా లాంటి సీనియర్ నటీనటులు, అమర్‌దీప్, ప్రియాంక, శోభా శెట్టిలాంటి సీరియల్ నటీనటులు కాకుండా ఇతర కంటెస్టెంట్స్ గురించి బిగ్ బాస్ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అందుకే వారి గురించి అంచనా వేయడానికి సమయం పడుతోంది. అలాంటి కంటెస్టెంట్స్‌లో ఒకరు శుభశ్రీ. తెలుగమ్మాయి కాకపోయినా తనవంతు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఇప్పటికే చాలామంది ప్రేక్షకులను తన ఫ్యాన్స్‌గా మార్చుకుంది శుభశ్రీ. తాజాగా తన ప్రొఫెషనల్ లైఫ్‌లో దాటొచ్చిన కష్టాల గురించి తనొక ఇంటర్వ్యలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

డ్యాన్స్ నుండి యాక్టింగ్‌కు..
ముందుగా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన శుభశ్రీ.. ఆ తర్వాత సినిమాల్లో నటిగా అడుగుపెట్టింది. అయితే తనకు అసలు యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అని ప్రశ్నించగా.. ‘‘యాక్టింగ్ మీద ప్యాషన్ డ్యాన్స్‌తో మొదలయ్యింది. చిన్నప్పటినుండి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. హిప్‌హాప్, క్లాసికల్, బాలీవుడ్, టాలీవుడ్.. ఏదో ఒక మ్యూజిక్ ఉంటే నాకు డ్యాన్స్ చేయాలని ఉంటుంది. అందుకే ఒక డ్యాన్స్ క్లాసుకు వెళ్లడం మొదలుపెట్టాను. నా డ్యాన్స్ మాస్టర్ ఒకసారి కాళ్లు, చేతులతో కాదు.. మొహంలో డ్యాన్స్ చూపించు అన్నారు. అప్పుడు అర్థమయ్యింది. అప్పుడే యాక్టింగ్ అనేది వచ్చింది. అలా నాకు మెల్లగా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరిగింది.’’ అని తన ఇంట్రెస్ట్ డ్యాన్స్ నుండి యాక్టింగ్‌కు ఎలా మారిందో చెప్పుకొచ్చింది శుభశ్రీ.

థియేటర్స్‌లో వర్క్..
ముంబాయ్‌లో థియేటర్స్‌లో నటించిన అనుభవాలను గుర్తుచేసుకుంది శుభశ్రీ. ‘‘నేను క్లాప్ థియేటర్‌లో చాలా షోలు చేశాను. పృథ్వి థియేటర్‌లో చేశాను. థియేటర్ అంటే వారు వివిధ రకాల యాక్టింగ్ నేర్పిస్తారు. ఆ ట్రైనింగ్ అనేది నాకు చాలా సాయం చేసింది, వర్కవుట్ అయ్యింది. ఎందుకంటే ప్రతీసారి నేను ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునేదాన్ని. వివిధ రకాల యాక్టింగ్‌తో పాటు స్టేజ్ ఫియర్ పోవడానికి కూడా అది చాలా ముఖ్యం.’’ అని తెలిపింది. అంతే కాకుండా శుభశ్రీ.. నటిగా మారకముందే ఒక హిందీ చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన విషయాన్ని బయటపెట్టింది.

హిందీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా..
‘మస్తీజాదే’ అనే హిందీ చిత్రానికి శుభశ్రీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. ‘‘సినిమాలో యాక్టింగ్ చేయాలంటే ఇవన్నీ నేర్చుకొని, ఒక ప్రక్రియలో వెళ్లాలని నాకు అర్థమయ్యింది. అసిస్టెంట్ డైరెక్షన్ చాలా కష్టంగా ఉంటుంది. నేను చాలామందికి అది సజెస్ట్ చేయను. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే చాలా తిడతారు. ఎక్కువ పని ఉంటుంది. ఒక్క నిమిషం లేట్ అయినా చాలా తిడతారు. అన్నీ రెడీగా ఉండాలి, ఏ సమస్య రాకూడదు. అసిస్టెంట్ డైరెక్టర్స్‌ను చాలా గౌరవిస్తాను నేను. ఎందుకంటే అది చాలా కష్టం. అసలు సులువు కాదు. ఏది పోయినా మనదే బాధ్యత.’’ అంటూ తన కష్టాలను గుర్తుచేసుకుంది శుభశ్రీ.

Also Read: పద్ధతిగా కూర్చొని ప్రశ్నలు అడగమనండి - ఆ జర్నలిస్ట్‌కు సిద్ధార్థ్ స్ట్రాంగ్ వార్నింగ్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
State Wise EV Subsidy: ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Embed widget