అన్వేషించండి

Bigg Boss OTT 2 : సిగరెట్ తాగుతూ స్టేజ్ పైకి వచ్చిన సల్మాన్ - ఫైర్ అవుతున్న నెటిజన్స్!

సల్మాన్ ఖాన్ 'బిగ్ బాస్ ఓటీటీ' సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీకెండ్ సందర్భంగా కంటెస్టెంట్స్ ముందుకొచ్చిన సల్మాన్.. చేతిలో సిగరెట్తో కనిపించడం వివాదంగా మారింది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలతో పాటు బుల్లితెరపై పలు షోలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సల్మాన్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' రియాలిటీ షో ఆడియన్స్ లో మంచి ఆదరణను దక్కించుకుంది. అయితే ఈ షో కారణంగా సల్మాన్ ఖాన్ ని ఇప్పటికే పలు వివాదాలు వెంటాడిన విషయం తెలిసిందే. అయినా కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో బిగ్ బాస్ షో కి పర్మినెంట్ హోస్ట్ గా మారిపోయాడు ఈ హీరో.  ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హోస్ట్ గా 'బిగ్ బాస్ ఓటీటీ' రెండవ సీజన్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ మొదలైన నాటి నుంచి ఏదో ఒక విషయంలో నెటిజెన్స్ నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది.

ఇటీవల జైద్ హాదీద్ తన తోటి కంటెస్టెంట్ ఆకాంక్ష పూరితో అసభ్యకరంగా ప్రవర్తించడం ఓ వివాదం అయితే, ఆ తర్వాత ఆ ఇద్దరు ఏకంగా లిప్ కిస్ చేసుకోవడం మరో వివాదంగా మారింది. వారిద్దరి లిప్ కిస్ ప్రేక్షకులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దాన్ని మరవక ముందే ఏకంగా హోస్ట్ సల్మాన్ ఖాన్ తాజాగా అడ్డంగా బుక్కై నెటిజెన్స్ నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. జూలై 8 శనివారం రోజున కంటెస్టెంట్స్ ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్ హౌస్ లో ఉన్న వాళ్ళ తప్పులను చూపించి కౌంటర్ ఇచ్చారు. అయితే అదే సమయంలో సల్మాన్ ఖాన్ చేతిలో సిగరెట్ తో కనిపించాడు. మరిచిపోయి అలా చేశాడా? లేక కావాలనే చేశాడా? అనేది తెలియదు కానీ, బిగ్ బాస్ షోలో చేతిలో సిగరెట్తో ఉన్న సల్మాన్ ఖాన్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే నెటిజన్స్ అయితే సల్మాన్ ఖాన్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

కొంతమంది సల్మాన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా సిగరెట్ తాగి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారంటూ' సల్మాన్ పై పలువురు ఫైర్ అవుతున్నారు. 'బాహాటంగా సిగరెట్ తాగడం ఎంతవరకు కరెక్ట్' అంటూ నెటిజన్స్ సల్మాన్ ఖాన్ ని విమర్శిస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రం ఈ వివాదాన్ని తప్పుపడుతూ సల్మాన్ చేతిలో సిగరెట్ ఉంది. కానీ ఆయన తాగినట్టు చూపించలేదు కదా. కాబట్టి అందులో ఆయన్ని విమర్శించాల్సిన అవసరం ఏముందంటూ ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తం మీద సల్మాన్ ఖాన్ చేతిలో సిగరెట్ ఉన్న ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఇదే సమయంలో ఈ వివాదం వల్ల బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 కి మంచి పబ్లిసిటీ దక్కింది అంటూ కొంతమంది చెబుతున్నారు. అంతేకాదు బిగ్ బాస్ నిర్వాహకులే కావాలని అలా సల్మాన్ ఖాన్ చేతిలో సిగరెట్ పెట్టి ఉంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. ఇక సల్మాన్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గానే 'కిసికా భాయ్ కిసీకా జాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా..  ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం 'టైగర్ 3' సినిమాతో బిజీగా ఉన్నారు.

Also Read : హిందీ 'రామాయణం' నుండి తప్పుకున్న ఆలియా భట్ - సీతగా ఆమె స్థానంలో సౌత్ స్టార్ హీరోయిన్!

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Embed widget