Bigg Boss Telugu 7: ఫినాలే అస్త్ర కోసం శోభా ఏడుపు - పడవల టాస్క్‌లో గౌతమ్ ‘బోల్తా’
Bigg Boss Telugu 7: ఒకవైపు సీరియస్‌గా టికెట్ టు ఫైనల్ రేసు జరుగుతుండగా మరోవైపు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయమని కంటెస్టెంట్స్‌ను టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో టికెట్ టు ఫైనల్ కోసం కంటెస్టెంట్స్ అంతా హోరాహోరీగా తలపడుతున్నారు. ఇందులో ఫ్రెండ్‌షిప్స్ లేవు, ఏమీ లేవు అన్నట్టుగా ఒకరిపై ఒకరి పైచేయి సాధించడానికి కష్టపడుతున్నారు. ఇక ఇప్పటికే ఫినాలే అస్త్ర కోసం మూడు ఆటలు ముగిశాయి. మూడు ఆటలు ముగిసే సమయానికి అమర్‌దీప్ లీడ్‌లో ఉండగా.. అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు. రెండు ఆటల తర్వాత లీస్ట్‌లో ఉన్న శివాజీ, శోభా ఈ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ విషయం శోభాను మరింత బాధపెడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా విడుదలయిన ప్రోమోలో శోభా బాధతో పాటు టికెట్ టు ఫైనల్ నాల్గవ టాస్క్‌లో కంటెస్టెంట్స్ అతితెలివిని కూడా ప్రేక్షకులకు చూపించారు బిగ్ బాస్.
శోభా ఏడుపు..
గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన పాయింట్స్ టేబుల్‌లో శోభా.. తన ఫోటోను పాయింట్స్‌ను తీసేయబోయింది. అది చూసిన అమర్ అడ్డుకున్నాడు. ‘‘అది చూసి ఇంకా ఎక్కువ హర్టింగ్‌గా ఉంది. దాన్ని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. రాత్రి నుంచి నాకు అదే మైండ్‌లో ఉంది. పొద్దున లేచి చూసినప్పుడు కూడా నాకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది’’ అని చెప్తూ ఏడవడం మొదలుపెట్టింది శోభా. ‘‘సరే ఏడవద్దు తీసేయ్’’ అని ఒప్పుకున్నాడు అమర్‌దీప్.
దూరపు కొండలు నులుపు..
ఆ తర్వాత కంటెస్టెంట్స్‌కు ఒక డిఫరెంట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ‘‘మీరంతా ఇంట్లో బద్ధకంగా ఉంటున్నారని బిగ్ బాస్ గమనించారు. అది మిమ్మల్ని చూసే ప్రేక్షకులకు బోరింగ్ కలిగిస్తోంది. మిమ్మల్ని తిరిగి యాక్టివ్ చేసేందుకు బిగ్ బాస్ మీ అందరికీ సుమారు ఒక నిమిషం సమయాన్ని ఇస్తున్నారు. ఇదే మీకు టికెట్ టు ఫినాలే’’ అని బిగ్ బాస్ వివరించారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా ఒక్కొక్కరుగా జాక్ అలుక్కాస్ రూమ్‌లోకి వెళ్లి తమ ఒక నిమిషాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆ రూమ్‌లోకి ముందుగా వెళ్లిన శోభా.. ఏం చేయాలి బిగ్ బాస్ అంటూ కన్ఫ్యూజన్‌లో పడిపోయింది. ‘‘కష్టపడి ఆడినా టికెట్ టు ఫైనల్ రేసు నుంచి ఓడిపోయాను’’ అంటూ తన కష్టాలు చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అర్జున్ వచ్చి మిమిక్రీ చేస్తూ డైలాగ్ చెప్పాడు. ‘‘బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చాక నాకొక సామెత గుర్తొచ్చింది - దూరపు కొండలు నులుపు’’ అంటూ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత శివాజీ.. యావర్‌ను ఇమిటేట్ చేసి చూపించాడు.
గౌతమ్ అతితెలివి..
కాసేపు కంటెస్టెంట్స్ అంతా సరదాగా నవ్వుకున్న తర్వాత టికెట్ టు ఫైనల్‌లో నాలుగో ఛాలెంజ్ ప్రారంభమయ్యింది. అదే ‘ఎత్తరా జెండా’. ఈ ఛాలెంజ్‌లో గార్డెన్ ఏరియాలో ఒకవైపు ఉన్న ఇసుకను డబ్బాలో తీసుకెళ్లి మరో వైపు ఉన్న తమ తమ పడవల్లో పోయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌కు శివాజీ, శోభా సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. అందరూ పడవలోని ఒకవైపు ఇసుకను పోస్తే.. గౌతమ్ మాత్రం మరోవైపు పోయడం మొదలుపెట్టాడు. ఏంటని శివాజీ అడగగా.. బిగ్ బాస్ చెప్పిందే చేస్తున్నానని అన్నాడు గౌతమ్. అది ఫౌల్ గేమ్ అని శోభా అరవడం మొదలుపెట్టింది. దానికి గౌతమ్ ఒప్పుకోలేదు. ‘‘మీరు రూల్స్ చదవండి’’ అని రివర్స్ అయ్యాడు. ఆ తర్వాత గౌతమ్ చేసింది తప్పు అని బిగ్ బాసే ప్రకటించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply