అన్వేషించండి

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

‘బిగ్ బాస్’ సీజన్ 6 ముగింపుకు వస్తుండటంతో కంటెస్టెంట్లలో టెన్షన్ మొదలైంది. మరో వైపు బిగ్ బాస్ కూడా వివిధ టాస్కులతో వారికి చుక్కలు చూపిస్తున్నాడు.

‘బిగ్ బాస్’ ఇక ముగింపు దశకు వచ్చేసింది. దీంతో వివిధ టాస్కులతో ఫన్ క్రియేట్ చేసే పనిలో ‘బిగ్ బాస్’ ఉన్నాడు. ఇందులో భాగంగా విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బుని తిరిగి సంపాదించుకోవడానికి తాజాగా ‘బిగ్ బాంబ్’ పేరుతో టాస్క్ ఇచ్చాడు. ఇందులో రేవంత్, ఇనయా, శ్రీసత్య పాల్గొన్నారు. మరోవైపు దెయ్యాల గది టాస్క్‌తో ఫన్ క్రియేట్ చేస్తున్నాడు ‘బిగ్ బాస్’. అయితే, అందులో కంటెస్టెంట్లు కాస్త అతి చేస్తు్న్నారనే కామెంట్లు వస్తున్నాయి. 

అయితే, తాజాగా విడుదల  చేసిన ప్రోమోలో ‘బిగ్ బాస్’.. ఇంటి సభ్యులను క్యారెక్టర్స్ మార్చుకోమని చెప్పాడు. దీంతో అంతా వేర్వేరు హౌస్ మేట్స్ ఫొటోలను మెడలో వేసుకుని తమ ప్రతాపం చూపారు. ఆయా క్యారెక్టర్లలోకి పరకాయ ప్రవేశం చేసి.. అచ్చం వారిలాగానే ప్రవర్తించారు. ఈ సందర్భంగా మంచి ఫన్నే క్రియేట్ అయ్యిందనిపిస్తోంది. ముఖ్యంగా ఇనయా, శ్రీహాన్‌లు తమ పాత్రల్లో జీవించారు. అంతేకాదు.. పనిలో పనిగా ఆ పాత్రల పేరుతో రొమాన్స్ కూడా పండించారు. వాస్తవానికి శ్రీహాన్, ఇనయాల మధ్య పెద్ద గొడవలే జరిగేవి. ఇద్దరూ శత్రువుల్లా ఉండేవారు. అయితే, ఈ మధ్య ఇద్దరూ కాస్త కూల్‌గా ఉంటున్నారు. ఛాన్సు దొరికినప్పుడు రొమాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. మొన్నటి వరకు కొట్టుకున్నవారు ఇప్పుడు కలిసిపోవడం.. ఆడియన్స్‌కు కూడా నచ్చుతోంది. ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో కూడా దెయ్యాల గది ఫన్ కొనసాగనుంది.

ఉదయం రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం.. శ్రీసత్యని మరొకసారి బిగ్ బాస్ కన్ఫెషన్ రూంలోకి పిలిచారు. ఒక్కదాన్నే చీకటి గదిలోకి రావడం తన వల్ల కాదని సత్య చెప్పేసరికి బిగ్ బాస్ తనకి తోడుగా కీర్తిని కూడా లోపలికి రమ్మని చెప్పాడు. వాళ్లిద్దరికి నరకం చూపించాలని రేవంత్ బిగ్ బాస్ తో చెప్పాడు. ఇక అమ్మాయిలిద్దరూ కన్ఫెషన్ రూంలోకి రాగానే బిగ్ బాస్ హస్కీ వాయిస్ తో “సత్య రా” అనేసరికి “నేను రాను” అని సత్య అనడం ఫన్నీగా ఉంది. కీర్తి మాత్రం భయపడకుండా నవ్వుతూ ఉంటుంది. అరుపులు కేకలతో బిగ్ బాస్ కేకపెట్టించాడు. సత్యని చూసి కీర్తి “నువ్వే నాకు దెయ్యంలాగా కనిపిస్తున్నావ్” అని అనేసింది. దెయ్యం వేషం వేసుకున్నవ్యక్తిని చూసి కీర్తి, శ్రీసత్య వణికిపోయారు. వాళ్ళ పరిస్థితి చూసి బయట ఉన్న వాళ్ళు తెగ నవ్వుకున్నారు.

Also Read: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today October 30th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అల్టిమేట్ గోట్ త్రిగుణ్.. అదిరిపోయే బెనిఫిట్! సుధీర్ సడెన్‌ ఎలిమినేట్.. ట్విస్ట్ ఇచ్చిన ముకేశ్, ఝాన్సీ!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అల్టిమేట్ గోట్ అయ్యేదెవరు? కెప్టెన్‌గా నిలిచేదెవరు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అల్టిమేట్ గోట్ అయ్యేదెవరు? కెప్టెన్‌గా నిలిచేదెవరు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బీబీ హోటల్‌లో వైకుంఠపాళీ! టాలెంట్ చూపించిందెవరు? గెలిచిందెవరు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: బీబీ హోటల్‌లో వైకుంఠపాళీ! టాలెంట్ చూపించిందెవరు? గెలిచిందెవరు?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
Embed widget