Sivaji: ప్రజలదే తప్పు, మీకే సిగ్గు లేదు, పనికిమాలినోళ్లారా - శివాజీ సీరియస్
Bigg Boss Sivaji: బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన శివాజీ.. ఒకప్పుడు పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉండేవాడు. తాజాగా రాజకీయాల గురించి ప్రశ్నించగా.. ప్రజలపైనే ఆయన సీరియస్ అయ్యారు.
Sivaji about AP Politics: సినిమాల్లో యాక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్న తర్వాత శివాజీ.. కొన్నాళ్ల పాటు రాజీకీయాల్లో కూడా యాక్టివ్ పాత్రను పోషించాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ చంద్రబాబు నాయుడు పక్కన నిలబడి పోరాటం కూడా చేశాడు. కానీ ఉన్నట్టుండి రాజకీయాల్లో నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత చాలాకాలానికి బిగ్ బాస్‌లో శివాజీని కంటెస్టెంట్‌గా చూశారు ప్రేక్షకులు. ఇక బిగ్ బాస్‌లో టాప్ 3వ కంటెస్టెంట్‌గా బయటికి వచ్చిన తర్వాత కూడా తనకు రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. దానికి సమాధానం చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపైనే సీరియస్ అయ్యాడు శివాజీ.
పనికిమాలినోళ్లారా..
‘‘రాజకీయాల గురించి అడగడం అనవసరం. నా సమాధానం ఏంటంటే.. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి, అభ్యర్థులకు సపోర్ట్ చేసుకుంటారు. వారంతా కలిసి ముందుగా తమ నియోజకవర్గంలో మంచి అభ్యర్థి కావాలని అనుకుంటారు. దాని తర్వాత ఎవరు డబ్బులు ఎక్కువ పెడతారంటావు అని మాట్లాడుకుంటారు. అసలు ఏంటది? ఈరోజు 100 పెట్టినవాడు, రేపు రెండు వందలు సంపాదించాలని అనుకుంటాడు కదా. అసలు ప్రజలు డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? రాబోయే తరాల గురించి ఆలోచించాలి. డబ్బులు ఖర్చుపెట్టాలి, మంచి అభ్యర్థి రావాలి అంటూ కుదరదు. డబ్బులు ఖర్చు పెట్టాలి అనే ఆలోచన మీరు ఆలోచించినప్పుడు ప్రభుత్వం బాలేదు, సమాజం బాలేదు అనే హక్కు మీకు ఎక్కడ ఉందిరా పనికిమాలినోళ్లారా’’ అంటూ ప్రజలపై, వారి ఆలోచనలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు శివాజీ.
అంతా సొల్లు..
‘‘టీవీల్లోకి వచ్చి, యూట్యూబ్ ఛానెళ్లల్లో కూర్చొని ఏంటి ఈ సొల్లు. తప్పు ప్రజల్లో ఉంది. మీరు మారినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడండి. వ్యవసాయం గురించి, పిల్లల ఆటల గురించి, చదువుల గురించి ఏం తెలియదు మీకు. న్యూస్ ఛానెళ్లలో వచ్చే చర్చలు చూసి రాక్షసానందం పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? దాని వల్ల వచ్చే ఉపయోగాలు, లేకపోతే అవస్థలు వదిలేశారు. పశ్చిమ దేశాల్లో ఇలా జరగదు. అవినీతి అన్నిచోట్లా ఉంటుంది. కానీ అక్కడ పైస్థాయిలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్కూల్ టీచర్లు, ఎమ్మార్వోలు, రెజిస్ట్రేషన్ ఆఫీసులో, కరెంటు ఆఫీసులో ఎక్కడైనా డబ్బు లేకుండా పని జరగదు. సిగ్గులేదురా మీకు’’ అంటూ జరుగుతున్న అవినీతిపై గొంతెత్తాడు.
మద్దతు దొరకలేదు..
‘‘రాజకీయ పార్టీలు కూడా అలాగే తయారయ్యాయి. రామారావు కాలంలో రాజ్యసభకు ప్రొఫెసర్స్ వెళ్లేవారు. సమాజం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదంతా చిల్లర. డబ్బు ఖర్చుపెట్టే అభ్యర్థిని పెట్టమని ప్రజలే చెప్తున్నప్పుడు ఇంక రాజకీయ పార్టీలకు పరిపాలన చేయాలని ఎందుకు ఉంటుంది? తప్పు ప్రజల్లో ఉంది. ఎవరు ఎంత డబ్బు పెట్టాలని ప్రజలు నిర్ణయించుకుంటున్నప్పుడు రాజకీయ పార్టీలు తప్పేంటి? సిగ్గులేనిది మనకు. మార్పు రావాల్సింది ప్రజల్లో. నాకు రాజకీయాలు, రాజకీయ పార్టీలు అవసరం లేదు. శివాజీ అంటే ఇలాగే మాట్లాడతాడు. కానీ దానికి మీ మద్దతు దొరికింది, సమాజం గురించి మాట్లాడిన ప్రతీసారి నాకు మిగిలింది మాత్రం సున్నా. చదువు లేనోడు రాజకీయాల్లోకి వస్తాడు’’ అంటూ తనకు మద్దతు దొరకడం లేదని వాపోయాడు శివాజీ.
Also Read: 'హనుమాన్'కు న్యాయం చేయాలి, నష్టాన్ని భరించాలి - ఎగ్జిబిటర్లకు TFPC లేఖ