Bigg Boss 6 Telugu: వాసంతిని జుట్టు కత్తిరించుకోమని చెప్పిన బిగ్‌బాస్, గీతూ వీడియో బాలాదిత్యకు చూపించిన నాగార్జున
Bigg Boss 6 Telugu: వీకెండ్ వచ్చిందంటే నాగార్జున్ ఎవరిని ఏమి అడుగుతారో, ఏ అంశాలపై ప్రశ్నిస్తారో అని అందరూ వెయిట్ చేస్తుంటారు.
![Bigg Boss 6 Telugu: వాసంతిని జుట్టు కత్తిరించుకోమని చెప్పిన బిగ్‌బాస్, గీతూ వీడియో బాలాదిత్యకు చూపించిన నాగార్జున Bigg Boss asked Vasanthi to cut her hair, Nagarjuna showed Geethu's work to Baladitya Bigg Boss 6 Telugu: వాసంతిని జుట్టు కత్తిరించుకోమని చెప్పిన బిగ్‌బాస్, గీతూ వీడియో బాలాదిత్యకు చూపించిన నాగార్జున](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/c15128242a4953424e7a3838fafe2a4b1665837867976248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bigg Boss 6 Telugu: వీకెండ్ వచ్చేసింది. స్టార్ హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులను నిలబెట్టి కడిగేయడానికి రెడీ అయిపోయారు. ఈరోజు ప్రోమోలో ఈ వారంలో జరిగిన కొన్ని విషయాల గురించి అడిగారు నాగార్జున. ముందుగా రేవంత్ తో మాట్లాడుతూ ‘నీకు ఇంటి కెప్టెన్‌గా అందరూ మంచి మార్కులు వేశారుగా, నీకోసం ఒక వీడియో’ అని రేవంత్ నిద్రపోతున్న వీడియో వేశారు. దీనికి అందరూ నవ్వారు. తరువాత నాగార్జున ‘వీకెండ్ తేల్చుకుందాం’ అని సవాలు చేశావ్ అని అడిగారు. దానికి రేవంత్ పూలకుండీల మ్యాటర్ లేవనెత్తాడు. దానికి రేవంత్ ఫైమా గురించి మాట్లాడాడు. ‘ఒక పూలకుండీయే తీసుకెళ్లాలి... రెండు తీసుకెళిలే ఫౌల్ గేమ్ అని చెప్పింది’ ఫైమా అన్నాడు. దానికి ఫైమా కూడా సమాధానం ఇచ్చింది. వారిద్దరి వాదనలు విన్నాక నాగార్జున ఇంటి సభ్యులు ఏమంటారో అని అడిగారు.
బాలాదిత్యకు వీడియో చూపించి...
గీతూ ఆడే చెత్త గేమ్‌ను స్ట్రాటజీ అని చెప్పుకుంటుంది. ఆ చెత్త స్ట్రాటజీకి బలయ్యాడు బాలాదిత్య. బిగ్ బాస్ రెండు ఆప్షన్లు ఇచ్చినప్పటికి తనకు నచ్చిన ఆప్షన్ మాత్రమే ఎంచుకుని బాలాదిత్య సిగరెట్లు కాల్చకుండా అడ్డుకుంది గీతూ. అతను ఇబ్బంది పడుతుంటే పైశాచిక ఆనందాన్ని పొందింది. బాలాదిత్య ఇబ్బందిని చూసి నాకెంత ఆనందంగా ఉందో అంటూ తిరిగింది. దీంతో బాలాదిత్యను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి గీతూకి బిగ్ బాస్ ఏం చెప్పారో, దానికి గీతూ ఏం సమాధానం చెప్పిందో... ఆ వీడియోను వేసి చూపించారు. దీంతో బాలాదిత్య షాక్ తిన్నాడు.
వాసంతి జుట్టు కట్
రోహిత్ రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ అవ్వడానికి ఒప్పుకోవడం వల్ల వంద శాతం బ్యాటరీ వచ్చింది. ఆ వందశాతం బ్యాటరీతో రోహిత్-మెరీనా తప్ప అందరూ తమ కుటుంబసభ్యుల సందేశాలను అందుకున్నారు. కనీసం వీరిని ఒక్కరూ పట్టించుకోలేదు. ఆ విషయాన్ని లేవనెత్తారు నాగార్జున. అలాగే రోహిత్ బాధపడిన వీడియోను కూడా చూపించారు. రోహిత్‌కు ఒక అవకాశం ఇచ్చారు. బ్యాటరీని వాడుకున్న ఆరుగురిలో ఒకరు రోహిత్ కోసం త్యాగం చేయాలని చెప్పారు. దానికి అందరూ చేస్తామని ఒప్పుకున్నారు. చివరికి వాసంతికి జుట్టు కట్ చేసుకోమని చెప్పారు నాగార్జున. భుజాల వరకు కట్ చేసుకోమన్నారు. దానికి వాసంతి షాక్ అయ్యింది. కత్తిరించుకుందో లేదో మాత్రం ఎపిసోడ్లో చూడాలి.
Ee week lo jarigina incidents gurinchi housemates ni prasninchina @iamnagarjuna... How will they react?
— starmaa (@StarMaa) October 15, 2022
Find out on @StarMaa & @DisneyPlusHSTel tonight at 9 PM.#BiggBossTelugu6 #BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/Znl9aRaojn
ఈ వారం నామినేషన్లలో తొమ్మిది మంది నిలిచారు.
1. ఆదిత్య
2. గీతూ
3. రాజ్
4. కీర్తి
5. సుదీప
6. ఆదిరెడ్డి
7. ఇనయా
8. శ్రీహాన్
9. అర్జున్
Also read: ఆర్జే సూర్య, ఆరోహిలది స్నేహమే, ఇనయానే అతని వెంటపడుతోంది - గర్ల్ ఫ్రెండ్ బుజ్జిమా అభిప్రాయం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)