News
News
X

Bigg Boss 6 Telugu: ఆర్జే సూర్య, ఆరోహిలది స్నేహమే, ఇనయానే అతని వెంటపడుతోంది - గర్ల్ ఫ్రెండ్ బుజ్జిమా అభిప్రాయం

Bigg Boss 6 Telugu: ఆర్జే సూర్య హౌస్‌లో చాలా సార్లు బుజ్జిమా అనే పేరును ఎత్తాడు. ఆమె ఎవరో తెలుసా?

FOLLOW US: 
 
Bigg Boss 6 Telugu: ఆర్జే సూర్యను ఓసారి నాగార్జున బుజ్జిమా ఎవరు అని అడిగారు. దానికి నవ్వేసి ఊరుకున్నాడు కానీ ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు. అయితే సూర్య హౌస్‌లో చాలా సార్లు బుజ్జిమా లవ్ యూ అని చెప్పాడు. ఈమె ఎవరో అని ప్రేక్షకులకు కూడా సందేహం వచ్చి ఉంటుంది. ఆమె ఇప్పుడు యూట్యూబ్‌ ఛానెళ్లకు ఇంటర్య్వూలు ఇవ్వడం మొదులపెట్టింది. ఆమె అసలు పేరు మృదుల. వీరిద్దరికి అయిదారేళ్ల పరిచయం ఉంది. ఈమె ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఆమె సూర్య గురించి చాలా విషయాలు చెప్పింది.  

వారిది స్నేహమే...
ఆరోహి, సూర్యల మధ్య కేవలం స్నేహమే ఉందని, కాకపోతే హౌస్‌లో స్నేహం ఇంకా ఎక్కువవడంతో అందరికీ తప్పుగా కనిపించిందని చెప్పింది బుజ్జిమా.  అయితే ఇనయా విషయంలో మాత్రం ఆమె కాస్త డిఫరెంట్‌గా స్పందించింది. ఆరోహి వెళ్లగానే సూర్య డిప్రెస్ అవుతాడనుకున్నానని, తరువాత ఇనయా దగ్గర అయ్యిందని చెప్పింది. అయితే సూర్య వెంటనే ఇనయానే తిరుగుతోందని, అతనే తన క్రష్ అని కూడా చెప్పిందని అంది బుజ్జిమా. చాలా మంది ఇనయా ఆట మీద కాకుండా సూర్య మీద కాన్సన్ స్ట్రేషన్ పెట్టిందని, ఫెవికాల్ లా అంటకుని తిరుగుతోందని కామెంట్లు పెడుతున్నారని చెప్పింది బుజ్జిమా. ఇనయాకు సూర్య అంటే ఇష్టమని అర్థమవుతోంది, కానీ సూర్య ఏమనుకుంటున్నాడో తెలియదని చెప్పింది. 

నాలుగు రోజుల ముందే...
సూర్యకు మొదట బిగ్ బాస్ ఓటీటీలో అవకాశం వచ్చిందని, అప్పుడు కుదరక పోవడం వల్ల ఇప్పుడు వెళ్లినట్టు చెప్పింది. కేవలం క్వారంటైన్ కి వెళ్లడానికి నాలుగు రోజుల ముందే బిగ్ బాస్ నిర్వాహకులు మెయిల్ పంపారని, బ్యాగులు ప్యాక్ చేసుకుని రెడీ ఉండమన్నారని తెలిపింది. అంత తక్కువ టైమ్ లో తాను తన స్నేహితుల సాయంతో షాపింగ్ చేసి సూర్యను సిద్ధం చేశానని చెప్పింది. 

ఎలా పరిచయం?
2016లో మెసెంజర్లో ఒకసారి తానే ఆర్జే సూర్యకు మెసేజ్ పెట్టానని చెప్పింది బుజ్జిమా. కొన్ని నెలల తరువాత 2017 ఫిబ్రవరిలో ఫోరమ్ మాల్‌లో తొలిసారి ముఖాలు చూసుకున్నారట సూర్య, బుజ్జిమా. అప్పట్నించి వారిద్దరి స్నేహం కొనసాగుతూ వస్తోంది. సూర్య ముద్దుగా తనను బుజ్జిమా అని పిలుస్తాడని, తాను కూడా సూర్యను అలాగే పిలుస్తానని చెప్పింది. 

News Reels

చాలా గిఫ్టులు ఇచ్చాడు...
సూర్యకు ఏ విషయంలో సంతోషం అనిపించినా తనకు గిఫ్టులు ఇస్తూనే ఉంటాడని చెప్పింది బుజ్జిమా. ఇప్పటివరకు లెక్కలేనన్ని గిఫ్టులు ఇచ్చాడని తెలిపింది. తన అంత ఎత్తున్న టెడ్డీ బేర్‌ను తయారు చేయించి ఇచ్చాడని చెప్పింది. సూర్యకు చాలా కోపం ఎక్కువని అది బిగ్‌బాస్ హౌస్లో చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడని అంది. కోపం వస్తే వస్తువులు విసిరేస్తాడని, కానీ బిగ్ బాస్ ఇంట్లో అలాంటివేమీ చేయడం లేదని చెప్పింది. మొత్తమ్మీద బుజ్జిమా ఎవరో తెలిసిపోయింది. 

View this post on Instagram
 
A post shared by мяυ∂нυℓα вσℓℓαмραℓℓу ❤ (@vj_mrudhula)

Also read: ఇంటి కెప్టెన్ అయిన సూర్య, అతడిని బావ అని పిలిచిన ఇనయా

Published at : 15 Oct 2022 11:11 AM (IST) Tags: Bigg Boss 6 Telugu RJ Suryas girlfriend Bujjima RJ Suryas girlfriend Bujjima Mrudula Inaya and Arohi

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

Bigg Boss 6 Telugu: ‘ఎవడు గెలిస్తే నాకేంటి?’ శ్రీహాన్‌పై శ్రీసత్య సీరియస్ - ఇంట్లో ఎవరిది ఏ స్థానం?

Bigg Boss 6 Telugu: ‘ఎవడు గెలిస్తే నాకేంటి?’ శ్రీహాన్‌పై శ్రీసత్య సీరియస్ - ఇంట్లో ఎవరిది ఏ స్థానం?

Bigg Boss 6 Telugu: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫైమా - ఆమె చేతిని ముద్దాడిన నాగార్జున

Bigg Boss 6 Telugu: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫైమా - ఆమె చేతిని ముద్దాడిన నాగార్జున

Bigg Boss 6 telugu: ‘కోడి బుర్ర అని రాసిందెరు?’ -బిగ్‌బాస్ వేదికపై హిట్ సినిమా హీరో అడివి శేష్ ఇంటరాగేషన్

Bigg Boss 6 telugu: ‘కోడి బుర్ర అని రాసిందెరు?’ -బిగ్‌బాస్ వేదికపై హిట్ సినిమా హీరో అడివి శేష్ ఇంటరాగేషన్

BiggBoss 6 Telugu: ఓటింగ్‌లో ఫైమానే లీస్ట్, ఈ వారం ఎలిమినేట్ అయిన లేడీ కమెడియన్?

BiggBoss 6 Telugu: ఓటింగ్‌లో ఫైమానే లీస్ట్, ఈ వారం ఎలిమినేట్ అయిన లేడీ కమెడియన్?

టాప్ స్టోరీస్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?