Bigg Boss 9 Telugu Elimination: వీకెండ్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్... డాక్టర్ పాపకు గుడ్ బై చెప్పిన బిగ్ బాస్... 3 వారాలకు ప్రియా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Bigg Boss 9 Telugu 3rd Week Evection :మూడవ వారం బిగ్ బాస్ హౌజ్ ఆట రసవత్తరంగా సాగింది. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండగా, వీకెండ్ ప్రియా ఎలిమినేట్ అయ్యింది. మరి ఆమె 3 వారాలకు అందుకున్న రెమ్యూనరేషన్ ఎంత ?

బిగ్ బాస్ సీజన్ తెలుగు 9 ఊహించని ట్విస్టులతో ఆడియన్స్ ని అలరిస్తోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అంటూ ఈసారి ఆసక్తికరంగా మొదలైన గేమ్ షో చివరికి రోత అనిపించేలా మారింది. ముఖ్యంగా కామనర్స్ పై మూడు వారాల్లోనే విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. అయితే ఎలిమినేషన్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి సెలబ్రిటీలలో శ్రేష్టి వర్మ, కామనర్స్ లో మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
డాక్టర్ పాపకు బైబై
మూడవ వారం నామినేషన్లలో రీతూ చౌదరి, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కళ్యాణ్ పడాల, శ్రీజ, హరిత హరీష్, ఫ్లోరా షైనీ ఉన్న సంగతి తెలిసిందే. గతవారం టాస్క్ ద్వారా ఫ్లోరా ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వగా, శ్రీజను కెప్టెన్ డెమాన్ పవన్ నామినేషన్ల రోజే స్పెషల్ పవర్ తో సేవ్ చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన వాళ్ళు డేంజర్ జోన్ లో ఉండగా, అందరూ అనుకున్నట్టుగా డాక్టర్ పాపకి బిగ్ బాస్ గుడ్ బై చెప్పేశారు. డాక్టర్ అయిన ప్రియా శెట్టి కామనర్స్ లోస్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తన ఆటను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆమె హౌజ్ మేట్స్ తో పొగరుగా వ్యవహరిస్తోందని, పైగా శ్రీజతో కలిసి నోరు పారేసుకుంటుందని వీకెండ్ ఎపిసోడ్ లలో నాగార్జునతో సహా ప్రతిరోజూ చూసే ఆడియన్స్ కూడా జడ్జిమెంట్ ఇచ్చేశారు.
Also Read: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?
అయితే మొదటి వారం బాగానే భరించినప్పటికీ, రెండవ వారం నుంచి శ్రీజ - ప్రియా శెట్టిలలో ఒకరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని గట్టిగానే కోరుకున్నారు ఆడియన్స్. మరి వాళ్ళ కోరికను బిగ్ బాస్ విన్నాడో ఏమో గాని ఈవారం ప్రియా శెట్టిని ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించేశారు. నిజానికి ఓటింగ్స్ పరంగా ప్రియా శెట్టి లీస్ట్ లో ఉన్న సంగతి విషయం విదితమే. ఆమెకు పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడమే అందుకు కారణం. పైగా దానికి నెగెటివిటీ కూడా తోడైంది. ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతున్న ప్రియా ఈ వారం బాగానే ఆడింది. కానీ అంతలోనే గతంలో ఆమె చేసిన తప్పులన్నీ కలిసి ఈవారం ఆమెను బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు సాగనంపాయి.
3 వారాలకు ప్రియా రెమ్యునరేషన్
బిగ్ బాస్ సీజన్ 9లో మూడో వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటూ వార్తలు వినిపించాయి. అన్నట్టుగానే బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా సంజనను బయటకు పంపించాడు. కాకపోతే ఆమెను సీక్రెట్ రూమ్ లో పెట్టి, తర్వాత స్టేజ్ మీదకి పిలిపించారు. అక్కడ కూడా ఆమె ఎలిమినేట్ కాలేదు సీక్రెట్ రూమ్ లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. కానీ సెకండ్ ఎలిమినేట్ అయిన ప్రియా హౌజ్ నుంచి అవుట్ అవ్వక తప్పలేదు. ఇక ప్రియా శెట్టికి ఒక్క వారానికి గానూ రూ. 60,000 రెమ్యునరేషన్ ను బిగ్ బాస్ ఆఫర్స్ చేసినట్టు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఆమె హౌజ్ లో ఉన్న మూడు వారాలకు గాను రూ.1,80,000 తన ఖాతాలో వేసుకున్నట్టే.





















