Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్9 డే19 రివ్యూ... సీక్రెట్ రూంతో బుర్రపాడు ట్విస్ట్... 3వ కెప్టెన్‌గా ఇమ్మూ... మిడ్ వీక్ ఎలిమినేషన్ కు సంజన బలి
Bigg Boss 9 Telugu Today Episode - Day 19 Review : ఆడియన్స్ లో ఆసక్తిని పెంచడానికి ఊహించని ట్విస్టులు ప్లాన్ చేశారు బిగ్ బాస్. సీక్రెట్ రూమ్ తో పాటు ఈరోజటి ఎపిసోడ్లో ఇంకేం జరిగిందంటే...

'బిగ్ బాస్ 9' డే 19 ఎపిసోడ్ 20లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన దివ్య నిఖిత రఫ్ఫాడించింది. రాగానే కిచెన్ టీ లో చేరిపోయిన దివ్య చేత హౌజ్ మేట్స్ ను ర్యాంక్ చేయాలని చెప్పారు. "2 వారాలైనా ఎక్కడా షైన్ అవ్వలేదు, లీస్ట్ ఇంపాక్ట్, ప్రజెన్స్" అంటూ ఫ్లోరాను 13వ స్థానంలో పెట్టింది దివ్య. "మంచివాడివి కానీ గివ్ అప్ చేస్తున్నారు" అంటూ రాముని 12వ స్థానంలో, "టాస్క్ లో ఎక్కడా కనిపించలేదు, గెలవడానికి ఏదైనా చేస్తావు" అంటూ 11లో కళ్యాణ్ ను, "గొడవ కంటిన్యూ చేస్తావ్ కానీ ఎండ్ కార్డు పెట్టవు, ఇక్కడికి వచ్చాక ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉన్నావ్" అంటూ శ్రీజను 10లో, "మిమ్మల్ని చూస్తే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేరు, డల్ గా ఉన్నారు" అంటూ హరీష్ ను 9లో, ఒరిజినాలిటీని కోల్పోతున్నారు అంటూ ప్రియను 8లో, ఫైటింగ్ స్పిరిట్ లేదు అంటూ 7లో రీతూను పెట్టింది.
"మాట్లాడడం కరెక్ట్ గా మాట్లాడతారు, కానీ తక్కువ కనిపిస్తున్నారు" అంటూ సుమన్ ను 6లో, "ఈజీగా ఎమోషనల్ అవుతారు" అంటూ 5లో తనూజను, "కెప్టెన్సీ టాస్క్ బాగా ఆడావు, ఫ్రెండ్ ఫ్రెండే గేమ్ గేమే అనే క్లారిటీ ఉంది" అంటూ డెమాన్ పవన్ ను 4లో, "కొన్నిసార్లు అందరినీ గెలుకుతారు... నొప్పి తెలియకుండా సూది గుచ్చుతారు" అంటూ 3లో సంజనాను, "పక్కవాడి కోసం గివ్ అప్ ఇస్తారు" అంటూ ఇమ్మూని 2లో, "మా ఇద్దరి ఆలోచనలు మ్యాచ్ అవుతాయి, స్మార్ట్ అనిపిస్తారు. కానీ స్టాండ్ తీసుకోరు" అంటూ భరణికి 1లో పెట్టింది. దీంతో హౌజ్ మేట్స్ అందరూ ఆలోచనలో పడిపోయారు. భరణి, ఇమ్మూ, సుమన్ మాత్రం టాప్ లో ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు.
కెప్టెన్సీ కూడా వైల్డ్ కార్డు చేతిలోనే...
బిగ్ బాస్ ఆదేశం ప్రకారం కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెండర్లను సెలెక్ట్ చేసింది దివ్య. ఈ లిస్ట్ లో దివ్య, ఇమ్మాన్యుయేల్, భరణి, తనూజ, సుమన్ శెట్టిలు ఉన్నారు. 'తప్పిస్తారా ఒప్పిస్తారా' అనే కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. ఇంతలో సంజన, శ్రీజ... దివ్య బట్టల్ని తీసి దాచిపెట్టారు. 'చిల్లర చేష్టలు' అంటూ మాస్క్ మ్యాన్ ఫైర్ అయ్యాడు. దీంతో రీతూ - మాస్క్ మ్యాన్ మధ్య గొడవ మొదలైంది. కానీ 'ఆ చెత్తను నేను క్లీన్ చెయ్యను' అంటూ కెప్టెన్, క్లీనింగ్ ఇంచార్జీను పిలిచి మరీ చెప్పేసింది దివ్య. హౌజ్ మేట్స్ కి ఈ దొంగతనం చేసినందుకు శిక్ష వేయాలని దివ్య కెప్టెన్ ను కోరింది. ఆయన కూడా ఇందులో పాల్గొన్న అందరికీ శిక్ష తప్పదని హామీ ఇచ్చారు. ఆ తర్వాత స్పిన్ అండ్ విన్ టాస్క్ ను 5 టీములుగా ఆడారు. ఇందులో ఎలెక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గెలుచుకున్నారు.
మిడ్ వీక్ ఎలిమినేషన్
యాపిల్ టాస్క్ లో రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు బ్లూ, బ్లాక్ సీడ్స్ వచ్చిన వాళ్లలో నుంచి ఒకరిని బయటకు పంపాలని బిగ్ బాస్ ఆదేశించారు. భరణి, రాము, కళ్యాణ్, హరీష్, డెమాన్ పవన్ డిసైడ్ చేసి సంజనను పంపించారు. "దొంగతనం చేస్తుంది, ఆమెతో ఉన్నవాళ్లతోనే ఫేవర్ గా మాట్లాడుతుంది" అంటూ మెజార్టీ ఇంటి సభ్యులు సంజన పేరు చెప్పారు. సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, ప్రియా, తనూజ, సంజన, రీతూలు బ్యాగ్ ప్యాక్ చేసుకోగా, సంజనను ఇంటి బయటకు పంపించారు. అందరికీ బైబై చెప్పేసి సంజన వెళ్ళిపోయింది. సంజనను అమ్మా అమ్మా పిలిచిన ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ అయ్యాడు. అయితే సంజనను సీక్రెట్ రూమ్ లో పెట్టేసి ఆ ట్విస్ట్ తో నేటి ఎపిసోడ్ కు ఎండ్ కార్డు వేశారు.
Also Read: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?





















