Bigg Boss 9 Telugu First Week Elimination: బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌పై ఉత్కంఠ... ఆ ముగ్గురిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌కు చేరుకుంది. ఇందులో ముగ్గురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వీక్ డేంజర్ జోన్ లిస్ట్‌ని గమనిస్తే..

Bigg Boss 9 Telugu - First Week Elimination: బిగ్ బాస్ ఇంట్లో మొదటి వారం గడిచిందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు వీకెండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. నాగార్జున వచ్చి తన బిగ్ బాస్ కంటెస్టెంట్లకు చెప్పాల్సింది చెబుతాడు. ఎవరికి ఎలా కౌంటర్లు వేయాలి.. ఎవరి తప్పుల్ని ఎలా ఎండగట్టాలన్నది బిగ్ బాస్ టీం ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసి ఉంటుంది. దాని ప్రకారం నాగార్జున చెప్పుకుంటూ వెళ్తాడు. ఇక ఓటింగ్ లైన్స్ కూడా ఆగిపోయాయి. మామూలుగా అయితే ఈ రోజు రాత్రే షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పటికే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఫిక్స్ అయి ఉంటుంది.
అసలు ఈ వారంలో ఆడియెన్స్ దృష్టిలో పడని కంటెస్టెంట్లు కొంత మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా ఫ్లోరా షైనీ ఉంటుంది. ఫ్లోరా షైనీ ఎక్కడా కూడా షైన్ అవ్వలేదు. ఆ స్పేస్ కూడా తీసుకోవడం లేదు. ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ పుటేజ్ ఇవ్వడం లేదు. బాత్రూంకి వెళ్తోంది.. అక్కడ క్లీన్ చేస్తోంది.. సైలెంట్‌గా ఉంటోంది.. ఒకరితో మాట్లాడినట్టుగా.. నవ్వుతున్నట్టుగా.. కనిపించడం లేదు. కనీసం సంజనా మాదిరి ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయలేకపోతోంది.
సంజనా వర్సెస్ ఫ్లోరా అన్నట్టుగా మొదటి రెండు రోజులు చిన్న సంఘటనలు జరిగాయి. కానీ ఫ్లోరా మాత్రం ఎక్కువగా బయటకు రాలేకపోతోంది. చూస్తుంటే జనాలు ఆమె ఉన్న సంగతిని కూడా మర్చిపోయినట్టుగా అనిపిస్తోంది. ఈ మొదటి వారంలో ఫ్లోరా బయటకు వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ తరువాత లిస్ట్‌లో శ్రష్టి వర్మ ఉంటుంది. అసలు శ్రష్టి అంటేనే సోషల్ మీడియా జనాలకు అంతగా నచ్చదన్న సంగతి తెలిసిందే.
ఈ ఫస్ట్ వీక్‌లో శ్రష్టి వర్మ పెద్దగా చేసింది కూడా ఏమీ లేదు. ఒక్క మూమెంట్ కూడా ఆమెకు కలిసి రాలేదు.. అరె ఈ మూమెంట్‌లో శ్రష్టి మెరిసింది.. హైలెట్ అయింది.. జనాల్లోకి వెళ్లింది అన్న మూమెంట్ మాత్రం కనిపించలేదు. ఇక ఆమె కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగానే ఉన్నాయి. ఇక సుమన్ శెట్టికి ఎక్కువ ఫాలోయింగ్ లేకపోవడం, ఈ బ్యాచ్‌తో కలవలేకపోవడం అనేది ప్రధాన సమస్య. అయినా కూడా సుమన్ శెట్టి తనకు వచ్చిన టాస్కుని, మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడుతూ.. తన లోకంలో తాను ఉంటున్నాడు. సుమన్ శెట్టి కూడా కాస్త డేంజర్ జోన్‌లో ఉన్నాడనే చెప్పుకోవచ్చు.
Also Read: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?
ఈ మొదటి వారంలో దాదాపు ఈ ముగ్గురి మధ్యే ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ ఎవరు? ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా? బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు? అన్నది కచ్చితంగా తెలియాలంటే మాత్రం శనివారం సాయంత్రం లేదా రాత్రి వరకు ఆగాల్సిందే.
Also Read: బిగ్ బాస్ ఎపిసోడ్ 6 రివ్యూ... డ్రింక్ చుట్టూ తిరిగిన కథ, నవ్వు రాని టాస్క్... బోరింగ్ ఎపిసోడ్





















