అన్వేషించండి

Bigg Boss Telugu Season 8: విష్ణు ప్రియ ఇక్కడి వరకు రావడమే ఎక్కువ... మిగిలిన టాప్‌ 5కు ఆమె ఇచ్చిన స్థానాలివే

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో ఆదివారం ఎపిసోడ్లో విష్ణు ప్రియ ఎలిమినేట్ అయింది. ఇంట్లో ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు.

Vishnu Priya Eliminated: బిగ్ బాస్ ఇంట్లో పద్నాలుగో వారం గడిచింది. శనివారం ఎపిసోడ్‌లో రోహిణి, ఆదివారం ఎపిసోడ్లో విష్ణు ప్రియ ఎలిమినేట్ అయింది. ఇక ఇంట్లో ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్లు ఉన్నారు. పదిహేనో వారం ఈ ఐదుగురు ఇంట్లో ఫుల్ చిల్ అవుతారనిపిస్తోంది. సండే ఫండే అన్న సంగతి తెలిసిందే. మరి కంటెస్టెంట్లతో నాగ్ ఎలాంటి ఆటలు ఆడించాడు... ఈ సండే ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ  సారి చూద్దాం.

ప్రైజ్ మనీ గెలిస్తే ఏం చేస్తారని ఇంట్లోని టాప్ 6 కంటెస్టెంట్లని నాగ్ అడిగాడు. అన్నయ్య కూతురి పెళ్లికి కొంత డబ్బు వాడతాను అని అవినాష్ చెబుతాడు. ఇంట్లో వాళ్ల అప్పులు తీర్చేస్తా అని ప్రేరణ చెబుతుంది. నా సినిమా, వెబ్ సిరీస్ కోసం ఈ డబ్బును వాడతా అని నబిల్ అంటాడు. అప్పులు తీర్చి అమ్మానాన్నలకు ఇళ్లు కట్టిస్తా అని నిఖిల్ అన్నాడు. అమ్మకి సగం అమౌంట్ ఇస్తా.. గంగవ్వ కూతురి పెళ్లికి పది లక్షలు ఇస్తా అని గౌతమ్ అంటాడు. ఇక విష్ణు పెద్ద లిస్టే చెప్పింది. అభయ్‌కి ఇంటర్నేషనల్ ట్రిప్ కోసం ఇస్తానని, మణికి ఓ నానో కారు, గంగవ్వకు ఐదు లక్షలు, 30 శాతం నాకోసం, పృథ్వీకి గోల్డ్ ఇయర్ రింగ్స్.. నిఖిల్ ప్లాటినం రింగ్స్.. ప్రేరణ డైమండ్ రింగ్ అంటూ ఇలా విష్ణు చెప్పుకుంటూ పోయింది.

అనంతరం నిఖిల్ సెకండ్ ఫైనలిస్ట్ అని నాగ్ రివీల్ చేశాడు. ఆ తరువాత ఓ పాటల టాస్క్ పెట్టాడు. అనంతరం గౌతమ్ థర్డ్ ఫైనలిస్ట్ అని రివీల్ చేశాడు. ఆ తరువాత గెస్ ది కారెక్టర్ అనే టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ తరువాత ప్రేరణ నాలుగో ఫైనలిస్ట్ అని రివీల్ చేశారు. ఆపై ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లకు థాంక్స్ ఎవరికి చెబుతావ్? సారీ ఎవరికి చెబుతావ్ అనే టాస్క్ ఇచ్చాడు. విష్ణు లేచి.. నా ఆత్మకు సీత శక్తిని ఇచ్చింది ఆమెకు థాంక్స్ చెబుతాను.. రోహిణిని తెలిసో తెలియకో హర్ట్ చేశా ఆమెకు సారీ చెబుతా అని తెలిపింది.

Also Readబిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 98 రివ్యూ: కమెడియన్లని విన్నర్‌ను చేయరు... రోహిణిని బయటకు పంపిన ఆడియెన్స్.. నిఖిల్, గౌతమ్ పంచాయితీ సెట్టు

మణికి థాంక్స్ అని.. ప్రేరణకు సారీ అని నబిల్ అన్నాడు. పృథ్వీ మొదటి నుంచి సపోర్ట్‌గా ఉన్నాడని నిఖిల్ థాంక్స్ చెప్పాడు. గౌతమ్‌కు నిఖిల్ సారీ చెప్పాడు. నబిల్ తనకు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పాడు. విష్ణుకి సారీ చెప్పాడు. గౌతమ్ అయితే సారీ, థాంక్స్ రెండూ కూడా నిఖిల్‌కే చెప్పాడు. చివరగా ప్రేరణ లేచి.. నబిల్‌కి థాంక్స్.. విష్ణుకి సారీ.. చెప్పింది. అలా చివరకు నబిల్ ఐదో ఫైనలిస్ట్ అయ్యాడు. విష్ణు ఎలిమినేట్ అని నాగ్ తెలిపాడు. ఎలిమినేట్ అయినా కూడా నవ్వుతూనే బయటకు వచ్చింది విష్ణు. అసలు ఇన్ని రోజులు ఎలా ఉందో  కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు.

చివరకు విష్ణు ఎలిమినేట్ అవ్వడంతో ఆడియెన్స్ కూడా కాస్త శాంతించినట్టుగా అనిపిస్తుంది. ఓట్ అప్పీల్ చేసినందుకు ఓట్లు వేయడం ఆపేశారేమో అని విష్ణు తన మీద తానే కౌంటర్లు వేసుకుంది. ఇక స్టేజ్ మీద తన జర్నీ చూసి ఎమోషనల్ అయింది. ప్లానెట్స్ రూపంలో విష్ణుకి ఓ టాస్క్ ఇచ్చాడు. గౌతమ్‌ని 5, అవినాష్‌ని 4వ స్థానంలో పెట్టింది. నబిల్‌ను మూడు, ప్రేరణ విన్ అవ్వాలని రెండో స్థానంలో పెట్టింది. నిఖిల్‌‌కు మొదటి స్థానాన్ని విష్ణు ఇచ్చింది. ఇక మిగిలిన ఈ ఒక్క వారంలో ఆడియెన్స్ ఎవరికి ఓట్లు వేసి ఎవరిని విన్ చేస్తారో చూడాలి.

Also Read: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget