Bigg Boss Telugu Season 8: ప్రేరణ వరెస్ట్ గేమ్... గెలిపించండని వేడుకున్న నబిల్... బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?
Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ ఇంట్లో పద్నాలుగో వారం ఓట్ అప్పీల్ టాస్క్ తో పాటూ మరో రెండు టాస్క్ లు జరిగాయి. ఈ టాస్కుల్లో ప్రేరణ, నబిల్, అవినాష్ మధ్య వాగ్వాదం జరిగింది.
Nabeel Vote Appeal: బిగ్ బాస్ ఇంట్లో పద్నాలుగో వారం ఓట్ అప్పీల్ టాస్క్ జరుగుతోంది. బుధవారం నాటి ఎపిసోడ్‌లో రెండు టాస్కులు పెట్టాడు బిగ్ బాస్. క్రాసింగ్ పాట్స్, టఫ్ వార్ అంటూ పెట్టిన ఈ టాస్కుల్లో ప్రేరణ, నబిల్, అవినాష్ మధ్య వాగ్వాదం జరిగింది. ప్రేరణ, నబిల్ మధ్య చాలానే పెద్ద గొడవ జరిగింది. చివరకు నబిల్‌లా ప్రేరణ ఇమిటేట్ చేస్తుంది. దీంతో నబిల్ మరింత సీరియస్ అవుతాడు. ఇదేమీ జోక్ కాదు.. ఎందుకలా వెక్కిరిస్తున్నావ్ అంటూ గొడవపడతాడు. అసలు ఈ బుధవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..
క్రాసింగ్ పాట్స్ అంటూ చిక్కుముళ్లతో ఉన్న తాడుని విడిపించుకుని.. ఎవరికి ఇచ్చిన కలర్ పోల్‌కు ఆ కలర్ తాడుని చుట్టాలి. ఎవరు ముందు చుట్టి గంట మోగిస్తారో.. వాళ్లే మిగతా వారికి సంచాలక్‌గా ఉండాలని చెబుతాడు. అయితే నబిల్ గాబరా గాబరాగా చుట్టేస్తాడు. ప్రేరణ కాస్త చక్కగా చుడుతుంది. కానీ నబిల్ మాత్రం తనే ఫస్ట్ చుట్టాను అని సంచాలక్ అని చెబుతుంటాడు. ఇక ఇదే విషయం మీద చాలా పెద్ద గొడవ జరుగుతుంది.
ఇంటి సభ్యుల్లో మెజార్టీ ప్రకారం నబిల్‌ను సంచాలక్ అని చెబుతారు. కానీ ప్రేరణ మాత్రం బిగ్ బాస్‌ను రిక్వెస్ట్ చేసుకుంటుంది. సరిగ్గా చుట్టలేదు కదా బిగ్ బాస్ అని అడుగుతుంది. అసలు రోలింగ్ అంటే ఏంటి? చుట్టడం అంటే ఏంటి? అని నబిల్‌ను బిగ్ బాస్ ప్రశ్నిస్తాడు. దీంతో చక్కగా చుట్టింది అంటూ ప్రేరణని సంచాలక్‌గా అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు. దీంతో సంచాలక్‌గా ప్రేరణ తీసుకున్న ఓ నిర్ణయం మళ్లీ గొడవకు దారి తీసింది.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ 89 రివ్యూ: సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
నిఖిల్ మొదటగా తనకు ఇచ్చిన పోల్‌కు కాకుండా వేరే రంగు పోల్‌కు తాడు చుడతాడు. బెల్ కొడతాడు. మళ్లీ తప్పు తెలుసుకుని సరి చేసుకుంటాడు. అవినాష్ అందరి కంటే చివరగా తాడు చుడతాడు. అవినాష్ చివరగా వచ్చాడు కాబట్టి అతడు ఓడిపోయినట్టు చెబుతుంది ప్రేరణ. కానీ నిఖిల్ రూల్స్ తప్పుగా పాటించాడు కదా? అని అవినాష్ అంటే.. నిఖిల్ పేరు చెబుతుంది ప్రేరణ. చివరకు మళ్లీ అవినాష్ పేరు చెబుతుంది.
దీంతో అవినాష్ మళ్లీ నిలదీస్తాడు. ఇది తప్పుడు నిర్ణయం.. అసలు గంట కొట్టిన తరువాత మళ్లీ ఆడటం ఏంటి? ప్రేరణని అడుగుతాడు. అది మిస్టేక్ కాదు.. మిస్ అండర్ స్టాండింగ్ అని మళ్లీ తన గ్రూపు గేమ్‌ని బయటపెట్టేసుకుంది ప్రేరణ. అలా తప్పుడు నిర్ణయంతో ప్రేరణ వరెస్ట్ అని మరోసారి నిరూపించుకుంది. ఇక రెండో ఛాలెంజ్‌లో చివరకు నబిల్, విష్ణులు గెలుస్తారు. ఈ ఇద్దరిలో హౌస్ మెజార్టీ ప్రకారం నబిల్ ఓటు అప్పీల్ కోసం వెళ్తాడు. అనంతరం మెగా చెఫ్ సంజయ్ రాకతో ఇంటి సభ్యులు కడుపు నిండా ఆరగిస్తారు. ఇక గురువారం నాటి ఎపిసోడ్ ఎలా సాగుతుందో చూడాలి.