Bigg Boss Telugu Season 8: నిజంగానే జబర్దస్త్ రోహిణి సివంగి... విష్ణు ప్రియ మాటలకే పరిమితం... పృథ్వీకి రక్త కన్నీరు
Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారంలో చివరి మెగా చీఫ్ కంటెండర్ టాస్కులు అద్భుతంగా సాగాయి. చివరకు నిలబడి.. సివంగిలా ఆట ఆడి చివరి మెగా ఛీప్‌గా నిల్చింది రోహిణి.
Rohini Become Last Mega Chief Over Prithvi And Vishnu Worst Behaviour: బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారంలో చివరి మెగా చీఫ్ కంటెండర్ టాస్కులు అద్భుతంగా సాగాయి. ఒక దాన్ని మించి ఒకటి అనేలా ఉన్నాయి. రోహిణి, పృథ్వీ, తేజలు చివరి రౌండ్ వరకు వచ్చారు. ఆ తరువాత ఈ ముగ్గురిలో చివరకు నిలబడి.. సివంగిలా ఆట ఆడి చివరి మెగా ఛీప్‌గా నిల్చింది రోహిణి. అసలు ఈ శుక్రవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.
ఆటోలో ప్రయాణం అనే ఈ టాస్కులో పృథ్వీ, యష్మీ కలిసి తేజ, రోహిణిలను కిందకు దింపారు. ఆ తరువాత పృథ్వీ, విష్ణు కలిసి యష్మీని దించేశారు. దీంతో యష్మీ కన్నీరు పెట్టుకుంది. ఇక మీ ఇద్దరూ ఎలా ఆడతారో చూస్తాను అని యష్మీ అనేసింది. వాళ్లిద్దరు ఎందుకు ఆడతారు.. కాంప్రమైజ్ అయి దిగుతారు అని రోహిణి కౌంటర్ వేసింది. దీంతో రోహిణి, విష్ణు మధ్య వాగ్వాదం జరిగింది. నీకు ఫైర్ ఉందా? నువ్వు జీరో.. నేను ఆడటం వల్లే ఇక్కడకు వచ్చాను అని విష్ణు అంటే..
ఇప్పటి వరకు ఉన్నది ఫైర్ వల్ల కాదు వేరే వాళ్ల.. నువ్వు ఇంట్లో ఎక్కువ కాలం ఎందుకు ఉన్నావో తెలుసు.. నీ ప్లాన్ వర్కౌట్ అయింది.. నువ్వు ముందు నిఖిల్‌కి ట్రై చేశా అన్నావ్.. తరువాత పృథ్వీకి ట్రై చేశా అని చెప్పావ్ కదా అని విష్ణు పరువు తీసింది రోహిణి. నీ కారెక్టర్ ఏంటో ఇక్కడే తెలుస్తోంది అంటూ రోహిణి మీద విష్ణు ఫైర్ అయింది.
అలా ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. చివరకు విష్ణుని కిందకు తోసేశాడు పృథ్వీ. అలా ఈ రౌండ్ ముగిసే సరికి పృథ్వీ, రోహిణి, తేజలు టాప్‌లోకి వచ్చారు. నన్ను ఎందుకు తోశావ్ అని పృథ్వీని అడిగింది యష్మీ. నువ్వు నాకు దగ్గర్లో ఉన్నావ్ అందుకే తోసేశా అని పృథ్వీ చెబితే.. యష్మీ నమ్మలేదు. తెడ్డు మీద గ్లాస్ అనే ఇంకో టాస్క్ పెట్టాడు. ఇందులో రోహిణి, తేజ, పృథ్వీ అద్భుతంగా ఆడారు. చివరకు తేజ, యష్మీల ఆటను విష్ణు చెడగొట్టేసింది. దీంతో మళ్లీ యష్మీ ఏడ్చేసింది. ఇంట్లో నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు అంటూ కన్నీరు పెట్టుకుంది యష్మీ. పృథ్వీ కోసమే విష్ణు నా ఆటను చెడగొట్టినట్టుంది అని తేజ ఫీల్ అయ్యాడు.
చివరి టాస్కుగా కుండతో భద్రం అని పెట్టాడు. ఇందులో కుండను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సమయానుసారంగా సంచాలక్ యష్మీ పిలిచిన కంటెస్టెంట్లు వచ్చిన కుండను ఇసుకతో నింపాల్సి ఉంటుంది. అలా చివరి వరకు ఎవరు కుండను కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తారో వారే విజేత అని చెప్పాడు. దీంతో పృథ్వీ, తేజ, రోహిణిలు కుండల్ని బ్యాలెన్స్ చేసేందుకు కష్టపడ్డారు. పృథ్వీ కోసం నబిల్, నిఖిల్, యష్మీలు ఆడారు. రోహిణి, తేజ కోసం అవినాష్, గౌతమ్ ఆడారు. ప్రేరణ రోహిణి కోసమే ఆడినట్టుగా ఉంది.
రోహిణి ఆట తీరుని, కష్టపడుతున్న తీరుని నిఖిల్ పొగుడుతూ ఉంటే విష్ణు తట్టుకోలేకపోయింది. నిఖిల్ వద్దకు వెళ్లి ఎందుకు అంటున్నావ్? అని అడిగినట్టుంది. రోహిణి బాగా ఆడుతోంది.. పొగిడితే తప్పేంటి? అని నిఖిల్ అంటాడు. చివరి వరకు పృథ్వీతో పాటుగా రోహిణి కలబడింది. చివరకు పృథ్వీ ఓడిపోయాడు. అది కూడా రోహిణి చేతుల్లో. ఇంతకంటే పరాభవం ఇంకోటి ఉండదు. రోహిణి జీరో అంటూ పైకి కిందకు చూసి అవమానించాడు. అలాంటి రోహిణి చేతుల్లో పృథ్వీ ఓడిపోయాడు. దీంతో పృథ్వీ వెక్కి వెక్కి ఏడ్చాడు. చివరి మెగా చీఫ్‌గా ఎన్నికవ్వడంతో రోహిణి తెగ సంబరపడిపోయింది. ఆనంద భాష్పాల్లో రోహిణి ఉండగా.. సివంగివే అంటూ బిగ్ బాస్ ఓ పాటను ప్లే చేసి అంకితం చేశాడు. నిజంగానే సివంగిలా రోహిణి ఆట ఆడింది.