Bigg Boss Telugu Episode 31 Day 30 Review: బొక్క బోర్లా పడ్డ కాంతార క్లాన్... సీతను పీకేసిన శక్తి టీం - ఓ వెలుగు వెలిగిన ‘ఆదిత్య’
Bigg Boss 8 Telugu Episode 31: బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం కంటెస్టెంట్లకు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో విష్ణు, మణి, నబిల్ డిజాస్టర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. శక్తి క్లాన్ మాత్రం అదరగొట్టింది.
Bigg Boss 8 Telugu Episode 31 Day 30 written Review: బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం కంటెస్టెంట్లకు 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్'లను ఇచ్చాడు. మళ్లీ వైల్డ్ కార్డులను ఆపేందుకు కంటెస్టెంట్లకు అవకాశాలను ఇచ్చాడు. ఆల్రెడీ 12 వైల్డ్ కార్డుల్లో రెండింటిని గత వారమే ఆపారు. ఇక ఇప్పుడు ఈ వారంలో మళ్లీ కొన్ని ఛాలెంజ్‌లు ఇచ్చారు. ఇందులో శక్తి క్లాన్ అదరగొట్టేసింది. కాంతార టీం వరుసగా ఫ్లాప్ అవుతూనే వచ్చింది. విష్ణు, మణి, నబిల్ డిజాస్టర్ పర్ఫామెన్స్‌లతో ఓడిపోయారు. శక్తి క్లాన్ రెండు ఛాలెంజ్‌లను విన్ అయింది.. రెండు వైల్డ్ కార్డులను ఆపింది. మూడు లక్షలు గెలుచుకుని ప్రైజ్ మనీకి యాడ్ చేసింది. మంగళవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..
'మణికంఠ అసలు ఎలా సేఫ్ అవుతున్నాడో అర్థం కావడం లేదు. ఫేక్ పర్సన్.. ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నాడు' అంటూ యష్మీ, ప్రేరణ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంట్లో ఏదో పని విషయంలో నబిల్ సలహాలు ఇవ్వడంతో మణికంఠ అంత ఎత్తున లేచాడు. 'పని చేస్తుండగా ఇంకొకరు సలహాలు చెబితే నచ్చదు' అంటూ మణికంఠ కాస్త తేడాగా ప్రవర్తించాడు. ఆ తరువాత సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్కులను బిగ్ బాస్ ఇచ్చాడు.
ఈ క్రమంలో 'తాళం విడిపించు... టైర్లు నడిపించు' అనే టాస్కును ఇచ్చాడు. 'పది నిమిషాలు మాత్రమే లిమిట్' అన్నాడు. స్విమ్మింగ్ పూల్‌లో తాళం వేసి ఉన్న టైర్లను తీయడానికి విష్ణు ప్రియ, నిఖిల్ కష్టపడ్డారు. నిఖిల్ చాలా వేగంగా వాటిని తీశాడు. కానీ విష్ణు ప్రియ కనీసం వాటి తాళం కూడా కనుక్కోలేకపోయింది. టైం ముగియడంతో ఈ టాస్కులో ఇద్దరూ ఓడిపోయారు.
అనంతరం ఇంకో ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. 'జాగ్రత్తగా నడువు... లేదంటే పడతావ్' అనే ఈ టాస్కును ఆడేందుకు... మణి, యష్మీ ముందుకు వచ్చారు. ఈ టాస్కుకు నిఖిల్ సంచాలక్‌గా ఉన్నాడు. వెయిట్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడాల్సిన ఈ టాస్కులో మణికంఠ అతి చేశాడు. తన టీం సభ్యులు ఇచ్చే ఇన్ పుట్స్‌ను తీసుకోకుండా 'అందరూ సైలెంట్‌గా ఉండండి... ఎలా ఆడాలో నాకు తెలుసు' అంటూ చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. చివరకు అటు సైడ్ యష్మీ సైలెంట్‌గా టాస్కును ఫినిష్ చేసింది. పృథ్వీ సలహాలు తీసుకుని యష్మీ విన్ అయింది.
శక్తి క్లాన్ విన్ అవ్వడంతో లక్షన్నర సంపాదించడమే కాకుండా ఓ వైల్డ్ కార్డును ఆపగలిగింది. ఓడిన కాంతార టీం నుంచి ఓ అనర్హుడిని తీసేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. మణికంఠ, నబిల్, విష్ణు ప్రియలు సీతను తీసేయాలని ఓటు వేశారు. మధ్యలో విష్ణు ప్రియ తన నిర్ణయాన్ని మార్చుకుని మణికంఠ టీం ఇన్ పుట్స్ కూడా తీసుకోవడం లేదని కామెంట్ చేసింది. మణికంఠను తీసేయాలని విష్ణు చెప్పింది. చివరకు సీత తన పేరు చెప్పుకోవాలని అనుకుంది. కానీ మణికంఠ పేరుని చెప్పేసింది.
ఇక మూడో ఛాలెంజ్ కోసం నబిల్, ఆదిత్య వచ్చారు. ఈ టాస్కులో ఆదిత్య అదరగొట్టేశాడు. మళ్లీ శక్తి క్లాన్ విన్ అయింది. ఇంకో లక్షన్నర సంపాదించి.. మరో వైల్డ్ కార్డును ఆపేశారు. అయితే ఓడిన కాంతార టీం నుంచి ఓ సభ్యుడ్ని, అనర్హుడైన సభ్యుడ్ని తీసేయాలని శక్తి క్లాన్‌కు ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో నిఖిల్, పృథ్వీ, యష్మీ నిర్ణయించుకుని సీతను పక్కన పెట్టేశారు. సీత ఛీఫ్ అని.. నామినేషన్లో కూడా లేదని, ఏ టాస్కుకి ఎవరిని పంపాలో కూడా తెలియడం లేదని, అందుకే ఆమెను తీసేస్తున్నామని చెప్పారు.
Also Read: బిగ్ బాస్ ఎపిసోడ్ 30 రివ్యూ... పోయే వరకు నామినేట్ చేస్తా, రివేంజ్ అనుకో - మణికంఠపై యష్మీ మండిపాటు
తనను అలా తీసేయడం సీత ఏడ్చేసింది. కనీసం ఒక్క ఆట కూడా ఆడలేదని కన్నీరు పెట్టుకుంది. గత వారం తన క్లాన్ మెంబర్ల కోసం ఆటలు ఆడలేదని గుర్తు చేసుకుంది. ఇక తనను తీసేయడం గురించ నిఖిల్, పృథ్వీ, యష్మీలతో సీత ముచ్చట్లు పెట్టింది. నబిల్‌ను పంపిన విషయంలో సీత మాటలు మార్చుతోందని ప్రేరణ, యష్మీ ముచ్చట్లు పెట్టుకున్నారు. అలా మంగళవారం నాటి ఎపిసోడ్‌లో మాత్రం కాంతార టీం డిజాస్టర్ అయింది. విష్ణు ప్రియ ఆటల్లో వేస్ట్ అని మరోసారి ఫ్రూవ్ అయింది. ఆదిత్య అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ రోజు ఎపిసోడ్‌లో వెలిగాడు. మరి ఈ మిడ్ వీక్‌లో ఆదిత్యను ఎలిమినేట్ చేస్తారా? నైనికను పంపుతారా? అన్నది చూడాలి.
Also Read: పాపం సోనియా.. దారుణంగా రోస్ట్ చేసిన అర్జున్ అంబటి - ట్రోలర్లు కూడా ఈ రేంజ్‌లో ఆడుకోరు