Bigg Boss 8 Telugu Episode 29 Day 28: ఇంట్లోంచి వెళ్లే ముందూ లేడీ కంటెస్టెంట్ల మీద సోనియా అక్కసు... కంటతడి పెట్టిన చిన్నోడు, పెద్దోడు
Bigg Boss 8 Telugu Episode 29: బిగ్ బాస్ ఇంట్లో ఆదివారం సోనియా ఇంటి నుంచి వెళ్తూ కూడా తన వైఖరిని మార్చుకోలేదు. ఇంట్లోని ఆడవాళ్లంతా ఏకమై.. తనను కార్నర్ చేశారని చెప్పుకొచ్చింది.
Soniya Akula Elimination from House: బిగ్ బాస్ ఇంట్లో ఆదివారం సండే ఫండే టాస్కుల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎలిమినేషన్ అనంతరం ఇంటి సభ్యులు ఏం మాట్లాడతారని అంతా ఎదురుచూస్తుంటారు. అసలు ఇంటి నుంచి ఓ సభ్యుడి వెళ్లిపోతోన్నాడంటే కొంత మంది బాధపడతారు. కానీ ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారంటే.. పండుగలా సెలెబ్రేషన్స్ చేసుకోవం బహుషా సోనియా విషయంలోనే జరిగి ఉండొచ్చు. ఇక సోనియా ఇంటి నుంచి వెళ్తూ కూడా తన వైఖరిని మార్చుకోలేదు. ఇంట్లోని ఆడవాళ్లంతా ఏకమై... తనను కార్నర్ చేశారని చెప్పుకొచ్చింది.
నిఖిల్, పృథ్వీల అటెన్షన్‌ను లేడీ కంటెస్టెంట్లు కోరుకున్నారట. కానీ నిఖిల్, పృథ్వీలు మాత్రం తనతోనే ఉండేవారని, అందుకే వారికి కోపం అంటూ లేడీ కంటెస్టెంట్ల మీద తన అక్కసును చూపెట్టింది. ఆడియెన్స్ ఆమెను తిరస్కరించాడంటే. కనీసం ఆమె తప్పులైనా ఉంటాయని, తప్పులు ఒప్పుకుంటుందని అంతా భావించారు. కానీ ఆమె వెళ్లేటప్పుడు కూడా తన తప్పు ఏమీ లేదన్నట్టుగా కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌గానే చెప్పుకొచ్చింది.
ఇక సండే టాస్క్ ఎలా సాగిందంటే... 'ట్యూన్ పట్టు, గెస్ కొట్టు' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ట్యూన్ వినిపించడం... హీరో హీరోయిన్ల బొమ్మలతో టాస్కును ఆడించాడు. ఇందులో విష్ణు ప్రియ యాక్టివ్‌గా ఆడింది. కాంతార టీంకు 7 పాయింట్లు వచ్చాయి. అలా శక్తి క్లాన్ మీద కాంతార టీం విన్ అయి 40 వేల ప్రైజ్ మనీ గెలిచింది. దీంతో ప్రైజ్ మనీ మొత్తంగా 15 లక్షలకు చేరుకుంది. ఆ టాస్కు తరువాత నీకే అంకితం అనే టాస్కు ఇచ్చాడు.
ముందుగా ప్రేరణ వచ్చి ఓ చీటీ తీస్తే.. టాక్సిక్ అని వచ్చింది. సోనియా టాక్సిక్ అని.. అందరి కంటే ఎక్కువ తెలుసు అని ఫీల్ అవుద్దంటూ చెప్పుకొచ్చింది. ఆ తరువాత నైనిక వచ్చి తీస్తే.. లౌడ్ స్పీకర్ అనే చీటి వచ్చింది. విష్ణు ప్రియ లౌడ్ స్పీకర్ అని చెప్పింది. ఆ సీత చీటీ తీస్తే విక్టిమ్ కార్డు వచ్చింది.. మణికంఠే విక్టిమ్ కార్డును వాడుతుంటాడని చెప్పుకొచ్చింది. ఆదిత్య కూడా మణికంఠకు నెగెటివ్ కార్డ్ ఇచ్చాడు. సేఫ్ ప్లేయర్‌ను నిఖిల్‌కు నబిల్ ఇచ్చాడు. మానిప్యులేటర్ అనే ట్యాగుని మణికంఠకు పృథ్వీ ఇచ్చాడు.
అనంతరం యష్మీ వచ్చి.. అటెన్షన్ సీకర్ చీటీ తీసింది. పృథ్వీ కరెక్ట్‌గా సరిపోతాడని చెప్పింది. నిఖిల్ వచ్చి ఎయిమ్ లెస్ అనే చీటీని తీశాడు. అందరూ ఎయిమ్‌తో ఉన్నారని, ఇంకో చీటీ తీస్తానని అన్నాడు. అందులో ఫేక్ అని వచ్చింది. దీనికంటే ఎయిమ్ లెస్ బెటర్ అని మణికంఠకు ఆ ట్యాగ్ ఇచ్చాడు. నిఖిల్ బయాస్డ్ అని మణికంఠ ట్యాగ్ ఇచ్చాడు. నైనిక ఇమ్మెచ్యూర్డ్ అని విష్ణు ప్రియ, విష్ణుప్రియ సెల్ఫీష్ అని సోనియా ట్యాగులు ఇచ్చారు.
నామినేషన్లో ఉన్న అందరినీ సేఫ్ చేసుకుంటూ వచ్చిన నాగ్... చివరి రౌండ్ వరకు ఆదిత్య, సోనియాలను పెట్టాడు. ముందు నుంచీ మణికంఠను డేంజర్ జోన్ అని చెబుతూ వచ్చాడు. అయితే ఆదిత్య సేఫ్ అని ప్రకటించడంతో సోనియా కూడా డేంజర్ జోన్లోకి వచ్చింది. ఇంటి సభ్యులు జీరో ఇవ్వడంతో మణి డేంజర్ జోన్‌లోకి వచ్చాడని, కానీ ఆడియెన్స్ సోనియాని డేంజర్ జోన్‌లో పెట్టారని ఇంటి సభ్యులకు నాగ్ చెప్పాడు.
ఇక ఆ ఇద్దరిలో ఎవరు ఇంట్లో ఉండాలి.. ఎవరు బయటకు వెళ్లాలనేది ఇంటి సభ్యులే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అలా చివరకు సోనియా కోసం నిఖిల్, పృథ్వీ, నైనిక మాత్రమే నిలబడ్డారు. అలా ఆడియెన్స్, ఇంటి సభ్యుల నిర్ణయం ఒకటే అయిందని అందుకే సోనియాను ఎలిమినేట్ చేస్తున్నానని నాగ్ అన్నాడు.
స్టేజ్ మీదకు వచ్చి సోనియా తన జర్నీని చూసుకుని ఎమోషనల్ అయింది. నన్ను కాలేజీలో కూడా ఎక్కువ మంది ఇష్టపడరు.. అన్నీ స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా మాట్లాడతా.. ఎవ్వరికీ నచ్చను.. నేను నిఖిల్, పృథ్వీలకు సలహాలు ఇస్తా.. కానీ వాళ్లు నా మాట వినరు.. అంటూ సోనియా తన వర్షన్‌ను వినిపించింది. వెళ్లే ముందు సోనియాకు నాగార్జున ఓ టాస్క్ ఇచ్చాడు. పులిహోర అంటే విష్ణు ప్రియ అని, కాకరకాయ అంటే సీత అని, ఆవకాయ అంటే ప్రేరణ అని, నబిల్ అంటే రోటీ అని చెప్పుకొచ్చింది. పృథ్వీ అంటే పాయసం సెట్ అవుతుందని తెలిపింది. అన్నం లేకపోతే ఏం ఉండదు కాబట్టి.. నిఖిల్ లేకపోతే ఇంట్లో ఏం లేదు అని చెప్పుకొచ్చింది. నైనిక అప్పడం అని, యష్మీ చేపల వేపుడు అని తెలిపింది. ఇక నిఖిల్ కంటతడి పెట్టడం, స్ట్రాంగ్‌గా ఉండు.. బాగా ఆడు అని చెప్పి సోనియా వీడ్కోలు తీసుకుంది.