Bigg Boss 8 Telugu Day 28 Episode : డైరెక్ట్ గా డేంజర్ జోన్ లోకి మణికంఠ - ఆ ముగ్గురినీ నాగ్ తో పాటు మడతెట్టేసిన హౌస్ మేట్స్ - విష్ణు ప్రియకు స్ట్రాంగ్ వార్నింగ్
బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ఫైర్ అయ్యారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం పదండి.
బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారం నామినేషన్ లో నుంచి ఒకరు బయటకు వెళ్లే సమయం ఆసన్నమైంది. ఈరోజు ప్రసారమైన ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ కి వాళ్ళు చేసిన తప్పులు ఎత్తిచూపుతో స్ట్రాంగ్ గానే ఇచ్చి పడేశారు. ముఖ్యంగా నిఖిల్, పృథ్వీ, సోనియాలతో పాటు మణికంఠ, విష్ణు ప్రియ విషయంలోనూ నాగ్ గట్టిగానే మాట్లాడారు. హౌస్ లో వాళ్ళు వేస్తున్న వేషాల వల్ల ప్రేక్షకులకు వారిపై ఎలాంటి అభిప్రాయం ఉందో క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.
హీరోగా ఓరుగల్లు పోరడు
తాజా ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ హౌస్ లో హీరో ఎవరు జీరో ఎవరు చెప్పారు. అయితే ఊహించని విధంగా ఆల్మోస్ట్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నబిల్ తలపై కిరీటం పెట్టి, అతన్ని హీరోని చేశారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ అందరూ నబిల్ కు కింగ్ గా పట్టం కట్టారు. ఆ తర్వాత ఎక్కువ మంది కింగ్ గా పేర్కొన్న వ్యక్తి పృథ్వి.
నిఖిల్ ని బుక్ చేసిన హౌస్ మేట్స్
ఈ నేపథ్యంలో హౌస్ లో జీరో ఎవరు అనగానే ఎక్కువ మంది కంటెస్టెంట్స్ నిఖిల్, మణికంఠలను టార్గెట్ చేశారు. నిఖిల్.. సోనియా, పృథ్వీ ఏం చెప్తే అదే వింటాడని, వాళ్ళు ముగ్గురూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని హౌస్ మేట్స్ గా తేల్చి పారేశారు. ముఖ్యంగా ప్రేరణ నిఖిల్ ని టార్గెట్ చేసి అతను ఏమేమి తప్పులు చేశాడో గుర్తు చేస్తూ జీరో ఇచ్చింది. ఇక సీతతో పాటు మిగతా అందరూ అతనికి జీరో ఇచ్చి సోనియా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడని రీజన్ చెప్పారు. నాగ్ సైతం అతను ఇలాగే ఉంటే అందరూ నారదుడు అనుకుంటారని, కాబట్టి ప్రవర్తనను మార్చుకోమని సలహా ఇచ్చారు. ఇక ఇప్పుడిప్పుడే బాగా ఆడుతున్నాడు మణికంఠ అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. కానీ అతను ఫిజికల్ గా వీక్ గా ఉన్న కారణంతో కంటెస్టెంట్స్ అతన్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే మణికంఠ తన విషయంలో తాను క్లారిటీగా లేకపోవడం వల్ల కూడా అతని గేమ్ పై ఎఫెక్ట్ పడుతుంది. తాజాగా ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ గేమ్ లో తనంతట తానుగా గేమ్ నుంచి తప్పుకుని, ఆ తర్వాత అందరు కలిసి తనను తొలగించారని మాట మార్చాడు. పైగా అలా తను మాట్లాడడానికి కారణం ఏంటో తనకు తెలియదంటూ తనను తాను నేరుగా డేంజర్ జోన్ లోకి నెట్టేసుకున్నాడు.
హౌస్ లో మొదటి వారం నుంచి వినిపిస్తున్న మాట ఒకటే. విష్ణు ప్రియ నోరు జారుతుంది. తాజాగా నాగార్జున 'కళామతల్లి ముద్దుబిడ్డ' అంటూ విష్ణు ప్రియకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియోను ప్లే చేశారు. అందులో విష్ణు ప్రియ 'బొట్టు పెట్టి, గాజులు వేసుకో' అంటూ నిఖిల్ ను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడింది. పైగా కాంచన అనే కామెడీ అంటూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. దీంతో నాగ్ 'ఇది కామెడీ కాదు.. ఇలాంటి మాటలు ఎలా అంటావ్' అంటూ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత యష్మీ.. నబిల్ కింగ్ అంటూ 'తన లాగా ఆడాలి అనుకుంటున్నాను' అని చెప్పింది. 'మరి ఎందుకు ఆడట్లేదు' అని అడిగితే.. 'ట్రై చేస్తున్నా'ను అని సమాధానం చెప్పింది. కానీ నాగ్ అంతలోనే అందుకుని 'ట్రై చేస్తున్నావా లేక వాళ్ళని చూస్తున్నావా' అంటూ ప్రశ్నించి ఓ వీడియోను ప్లే చేశారు.
ఆ ముగ్గురిపై నాగ్ ఫైర్
ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో నిఖిల్, పృథ్వీ, సోనియాపై నాగ్ ఫైర్ అవ్వడం మరో హైలెట్ అని చెప్పొచ్చు. ఎగ్స్ టాస్క్ ఆడుతున్నప్పుడు సోనియా 'ఎప్పుడూ నిఖిల్, పృథ్వి లనే చూస్తే ఎలా?' అంటూ యష్మిని ప్రశ్నించిన విషయం గుర్తుండే ఉంటుంది. దాని గురించి తాజాగా నాగార్జున ప్రస్తావించగా నిఖిల్, పృథ్వీ.. సోనియా అలా అనలేదని, ఎప్పుడూ నిఖిల్ పృథ్వీల ఆటనే చూస్తున్నావు. నా ఆటను చూడట్లేదు అనే ఇంటెన్షన్ తో ఆమె అన్నది' అని సోనియాను సమర్థించారు. కానీ వెంటనే నాగార్జున 'నాకలా అనిపించట్లేదు' అని చెప్పగా, ప్రేరణ అందుకొని 'అందుకే శక్తి క్లాన్ కి ఎవ్వరూ వెళ్ళలేదు. ఎంత నెగటివ్ గా అనిపించినా వాళ్లు మాత్రం వాళ్ళ చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుని, సేఫ్ జోన్ లో ఉంటారు' అంటూ బాంబు పేల్చింది. ఇక ఇదే సందర్భం అన్నట్టుగా సీత కూడా 'వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదు' అని కంప్లైంట్ చేసింది. మొత్తానికి ఈరోజుటి ఎపిసోడ్ నాగార్జున వార్నింగ్ లతో సీరియస్ గానే సాగింది. రేపటి ఎపిసోడ్లో సోనియాను బయటకు పంపబోతున్నారు.