అన్వేషించండి

Bigg Boss 8 Telugu Episode 25 Day 24: మణికంఠ సాఫ్ట్ టార్గెట్? మొగోడిగా లెక్కేయడం లేదే... ఆ ముగ్గురికి అంతా వ్యతిరేకం!

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఇంట్లో సోనియా, నిఖిల్, పృథ్వీ ఒక్కటి... మిగిలిన ఇంటి సభ్యులంతా ఒక్కటి అని క్లియర్ గా కనిపించింది. వైల్డ్ కార్డులను అడ్డుకోవటానికి ఛాలెంజ్లు పెట్టాడు బిగ్ బాస్.

Bigg Boss 8 Telugu Episode 25 Day 24 written Review: బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం సీత రెండో చీఫ్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. దీంతో బిగ్ బాస్ శక్తి, కాంతార క్లాన్‌‌లను ప్రక్షాళన చేసే పని పెట్టుకున్నాడు. కంటెస్టెంట్లను ఏ ఏ క్లాన్‌లకు వెళ్తారని అడిగాడు. అలా అందరూ సీత క్లాన్‌లోకి వచ్చారు. నిఖిల్ క్లాన్‌‌లోకి సోనియా, పృథ్వీ మాత్రమే మనస్పూర్తిగా వెళ్తామని అన్నారు. మిగిలిన వారంతా కూడా సీత టీంలోకి వెళ్తామని అన్నారు. కానీ ఆ క్లాన్ నిండిపోయిందని మణికంఠను బిగ్ బాస్ నిఖిల్ క్లాన్‌లోకి వెళ్లమన్నాడు. ఒక వేళ సీత తన క్లాన్‌లోంచి ఒకరిని స్వాప్ చేసుకున్నా కూడా మణికంఠ సీత క్లాన్‌లోకి వెళ్లొచ్చని అన్నాడు.

కానీ సీత మాత్రం తన క్లాన్ మెంబర్లను స్వాప్ చేసుకునేందుకు ఇష్టపడలేదు. ఇక ప్రేరణ అయితే సీత టీంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. దీంతో యష్మీ కాస్త తగ్గింది. యష్మీ నిఖిల్ టీంకు వెళ్తానని చెప్పింది. అలా యష్మీ చివరకు సీత క్లాన్‌లోకి వచ్చింది. దీంతో నిఖిల్, సోనియా, పృథ్వీ, యష్మీ, మణికంఠకు ఒక క్లాన్.. మిగిలిన వారంతా ఒక క్లాన్‌లోకి వచ్చారు. సీత క్లాన్ పెద్దది కావడంతో లగ్జరీలు వచ్చాయి. ఇక అర్దరాత్రి సోనియా, నిఖిల్, పృథ్వీలు ముచ్చట్లు పెట్టుకున్నారు. మనం ముగ్గురం ఒక్కటి.. మిగిలిన ఇంటి సభ్యులంతా ఒక్కటి అని నిఖిల్ అన్నాడు. 

Read Also: వైల్డెస్ట్ ట్విస్ట్ ఎవర్... హౌస్‌లో భూకంపం - హౌస్‌మేట్స్‌ను షేక్ చేసిన వైల్డ్ కార్డు ఎంట్రీ అనౌన్స్మెంట్

వాళ్ల టీంలోకి ఎవ్వరూ వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.. అక్కడే వాళ్లు ఎలాంటి వారనేది అర్థం చేసుకోవచ్చు అని సీత, నబిల్ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇక సీతకే సపోర్ట్ చేశారని నిఖిల్‌తో నైనిక చెప్పింది. కానీ తాను తన టీం నుంచి ఎవరినో ఒకరిని చీఫ్ చేయాలని ఆడానంటూ నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. ఇవన్నీ ఇలా ఉంటే.. బిగ్ బాస్ ఇంటి సభ్యుల మీద ఓ బాంబ్ వేశాడు. ఎన్నడూ లేనట్టుగా పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారని చెప్పాడు. అయితే వారిని అడ్డుకోవాలంటే పన్నెండు ఛాలెంజ్‌లు ఆడాల్సి ఉంటుంది. అలా ఛాలెంజ్‌లు గెలిచిన ప్రతీ సారి ఓ వైల్డ్ కార్డ్ తగ్గుతుందని బిగ్ బాస్ చెప్పాడు. అంతే కాకుండా గెలిచిన ప్రతీ సారి ఓ లక్ష రూపాయలు ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందని అన్నాడు.

ఆ తరువాత ఇంటి సభ్యులంతా ముచ్చట్లు పెట్టుకున్నారు. వైల్డ్ కార్డులను అడ్డుకోవాలని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్లు, మగవాళ్లు ఎంత మంది ఉన్నారు అని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మణికంఠను అబ్బాయిగా కౌంట్ చేయలేదు. అసలే మణికంఠ ఈ గ్యాంగ్‌తో కాకుండా సపరేట్‌గా కూర్చొని ఉన్నాడు. ఇలా మణికంఠ మీద జోకులు వేయడం.. నిన్ను వీళ్లు అబ్బాయిగా కన్సిడర్ చేయడం లేదు అంటూ నిఖిల్ అనడంతో మణికంఠ హర్ట్ అయ్యాడు. ఇలాంటి మాటలే మాట్లాడొద్దు.. దేనికైనా ఓ హద్దు ఉంటుంది అని మణికంఠ ఫైర్ అయ్యాడు.

ఫస్ట్ ఛాలెంజిలో భాగంగా..  బాల్‌ని పట్టు.. టవర్‌లో పెట్టు..అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్కులో కాంతార టీం విన్ అయింది. ఓడిన శక్తి క్లాన్ నుంచి ఓ సభ్యుడిని పక్కన పెట్టాలని బిగ్ బాస్ అన్నాడు. యష్మీ, సోనియా, పృథ్వీ ఇలా అందరూ కలిసి మణికంఠను పక్కన పెట్టేశారు. దీంతో మణికంఠ ఇకపై ఏ ఛాలెంజిలోనూ పాల్గొన కూడదని బిగ్ బాస్ అన్నాడు.  అలా అక్కడ కూడా మణికంఠనే సాఫ్ట్ టార్గెట్ చేశారనిపిస్తుంది. రెండో టాస్కులో భాగంగా మహాతాలిని ఇచ్చాడు. ఆ భోజనాన్ని ఎవరు పూర్తి చేస్తారో అని టాస్క్ పెట్టారు. కానీ నబిల్, సోనియాలు ఆ తాలిని తినలేకపోయారు. సపోర్ట్‌గా ఆదిత్య, యష్మీ వచ్చారు. అయినా కూడా పూర్తి చేయలేకపోయారు. అలా రెండో ఛాలెంజ్‌లో ఇరు క్లాన్‌లు ఓడిపోయాయి. దీంతో పదకొండు మంది వైల్డ్ కార్డులు ఇప్పటి వరకు ఫిక్స్ అయ్యారు. మరి ఈ వారంలో ఇంకెన్ని ఛాలెంజ‌లు పెడతారో.. ఎన్నింట్లో గెలిచి ఎంత మంది వైల్డ్ కార్డులను అడ్డుకుంటారో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
Dussera Holidays: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Ysrcp: జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Second Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లతపవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
Dussera Holidays: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Ysrcp: జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
YS Jagan: 'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
T20 World Cup 2024 : మహిళల టీ 20 ప్రపంచ కప్‌? - ఈ విషయాలు మీకు తెలుసా?
మహిళల టీ 20 ప్రపంచ కప్‌? - ఈ విషయాలు మీకు తెలుసా?
Tax Changes From 1st Oct: మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్‌ రూల్స్‌ - అక్టోబర్‌ 01 నుంచే అమలు!
మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్‌ రూల్స్‌ - అక్టోబర్‌ 01 నుంచే అమలు!
Devara 2: ‘దేవర 2’లో ముంబై డాన్ గా ‘యానిమల్’ స్టార్- వెండి తెర రక్తంతో తడిసిపోవాల్సిందేనట!
‘దేవర 2’లో ముంబై డాన్ గా ‘యానిమల్’ స్టార్- వెండి తెర రక్తంతో తడిసిపోవాల్సిందేనట!
Embed widget