అన్వేషించండి

Bigg Boss 8 Telugu Episode 14 Day 13: తెల్లమొహం వేసిన కంటెస్టెంట్లు, యష్మీ అసలు రంగు బయటపెట్టిన నాగ్, సోనియా పరువుతీసిన హోస్ట్

Bigg Boss Season 8 : బిగ్ బాస్ ఇంట్లో వీకెండ్ ఎపిసోడ్ లో నాగ్ అందరినీ వాయించేశాడు. వారంలో చేసిన తప్పులన్నీ ఎత్తి చూపించాడు. ముగ్గురు చీఫ్‌లను తమ క్లాన్ సభ్యులు ఎలా పర్ఫామెన్స్ చేశారో చెప్పమన్నాడు.

Bigg Boss 8 Telugu Episode 14 Day 13  Nagarjuna Fires on Yashmi And Soniya: బిగ్ బాస్ ఇంట్లో సెకండ్ వీకెండ్ అదిరిపోయింది. ఒక్కొక్కరికి నాగ్ తలంటు పెట్టేశాడు. సోనియా, యష్మీ వంటి వారికి చీవాట్లు పెట్టాడు. వారంలో చేసిన తప్పులు అన్నీ చూపించాడు. కరెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఈ క్రమంలో ముగ్గురు చీఫ్‌లను తమ తమ క్లాన్ సభ్యుల తప్పొప్పులు, ఆట తీరుల గురించి చెప్పమన్నాడు. అలా ఈ రెండో శనివారం ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.

శుక్రవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందో చూపించాడు. విష్ణు ప్రియ దొంగతనం చేసిన వస్తువుల్ని యష్మీ క్లాన్ రికవరీ చేసుకుంది. కారం దొంగిలించిన మణికంఠ.. చివరకు తీసి ఇచ్చేశాడు. దీనిపై విష్ణు ప్రియ గొడవేసుకుంది. అలా దొంగతనం చేయడం ఎందుకు.. మళ్లీ వెంటనే ఇవ్వడం ఎందుకు? అంటూ గొడవ పెట్టుకుంది. మిస్ ఫైర్ అవుతుందేమో అని తిరిగి ఇచ్చానని మణికంఠ చెప్పుకొచ్చాడు.

Read Also: బిగ్‌బాస్‌ 8 రెండో వారం ఎలిమినేషన్‌ - ఈ ముగ్గురిలో హౌజ్‌ని వీడేది అతడే

ఆ తరువాత కంట్రీ డెలైట్ పాల గురించి క్విజ్ పోటి పెట్టి భారీ ఎత్తున ప్రమోషన్ కల్పించాడు. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కంట్రీ డెలైట్ పాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. శనివారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో ఈ పాల యాడ్ మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది. గెలిచిన టీంకు ఏడాది పాటు ఉచితంగా పాలను అందిస్తారట. అలా టీం చిరు ఈ క్విజ్ పోటీలను గెలిచింది. ఆ క్విజ్ ప్రశ్నలు కూడా పూర్తిగా కంట్రీ డెలైట్ పాల గురించే ఉండటం గమనార్హం.

ఇక ముగ్గురు చీఫ్‌లను నిల్చొబెట్టి మరీ నాగ్ క్లాస్‌ పీకాడు. తమ క్లాన్ సభ్యులు ఎలా పర్ఫామెన్స్ చేశారో చెప్పమని అన్నాడు. బాగా ఆడితే.. గ్రీన్‌లో పెట్టమని.. బ్యాడ్‌గా ఆడితే రెడ్‌లో పెట్టమని అన్నాడు. ముందుగా యష్మీతో ఆట ఆరంభించాడు నాగ్. సేఫ గేమ్ అంటూ అందరినీ గ్రీన్‌లో పెడితే.. ఆడియెన్స్ నిన్ను బయటపెడతారు అంటూ యష్మీకి నాగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక యష్మీ తన క్లాన్ మెంబర్ల గురించి చెబుతూ వచ్చింది. అభయ టాస్క్ బాగా ఆడాడు అని చెబుతూ గ్రీన్‌లో పెట్టింది. కానీ విష్ణు ప్రియ ఉద్దేశంలో వేరేలా ఉంది కదా? అని నాగ్ అన్నాడు. సాక్సుల ఆటలో తనని తోసేశాడని విష్ణు ప్రియ చెప్పింది. దీంతో వీడియో వేసి చూపించాడు. అందులో అభయ కావాలని తోయలేదని తేలిపోయింది.

Read Also: నిఖిల్ తో లవర్ గురించి ఓపెన్ అయిన సోనియా.. అతని గురించి భయపడుతూ బోరున విలపించిన ఆడపులి

పృథ్వీ టాస్కులు బాగా ఆడాడని గ్రీన్‌లో పెట్టింది. ఆటలు బాగానే ఆడుతున్నావ్.. కానీ మాటలు జాగ్రత్త అని నాగ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రేరణ సరిగ్గా ఆడలేదు.. సంచాలక్‌గా కూడా ఫెయిల్ అని రెడ్‌లో పెట్టింది యష్మీ. దీంతో నాగ్ యష్మీ సంచాలక్‌గా చేసిన టాస్కు గురించి మాట్లాడాడు. 250 గ్రాముల విషయంలో నువ్వు చేసింది కరెక్ట్ అని ఫీల్ అవుతున్నావా? అని సెటైర్ వేశాడు. ఏది దగ్గరగా ఉంటే అది తీసుకుంటాను అని చెప్పింది కానీ మళ్లీ మాట మార్చిందంటూ మణికంఠ కంప్లైంట్ చేశాడు. కానీ తాను అలా అనలేదు అంటూ యష్మీ బుకాయించింది. దీంతో వీడియో వేసి క్లారిటీ తరువాత ఇస్తానంటూ అక్కడికి టాపిక్ ఎండ్ చేశాడు. దీంతో యష్మీ కన్నీరు పెట్టుకుని తెల్లమొహం వేసుకుంది.

సోనియా సరిగ్గా ఆడలేదని, ఎక్కడా కనిపించలేదని యష్మీ పరువు తీసింది. ఇక నాగార్జున కూడా సోనియా పరువు తీశాడు. మాటలు కాదు.. ఆటలు కూడా ఉండాలన్నట్టుగా తలంటు పోశాడు. ఎప్పుడూ పెద్దోడు, చిన్నోడు అంటూ సోఫాలో ఉండటం కాదని కౌంటర్లు వేశాడు. ఇక విష్ణు ప్రియని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వీడియోల్ని వేసి చూపించాడు. విష్ణు ప్రియ బట్టల గురించి సోనియా మాట్లాడిన మాటల్ని తప్పుపట్టాడు. నువ్వు ఎలా అయినా అంటావ్.. నిన్ను ఎవ్వరూ ఏమనొద్దు. నీ ఇంట్లో వాళ్ల గురించి ఆలోచిస్తావ్.. మిగతా వాళ్లకి ఇళ్లు ఉండదా? అంటూ ఇలా సోనియా పరువు తీశాడు నాగార్జున. మాటలు జాగ్రత్తగా ఉండాలి.. ఒక్క మాట చాలు.. ఆడియెన్స్ కింద పడేస్తారు అని నాగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

యష్మీ తనని తాను రెడ్‌లో పెట్టుకుంది. కానీ నాగ్ కౌంటర్ వేశాడు. నీది నువ్వు చెప్పుకోవడానికి వీల్లేదు.. మీ చీఫ్‌ల గురించి నేను చెబుతా అని అన్నాడు. నబిల్ బాగా ఆడాడు అని అతడికి గ్రీన్ బ్యాడ్జ్ యష్మీ పెట్టింది. ఆ తరువాత నయనిక వచ్చిన క్లాన్ మెంబర్లైన విష్ణు, సీతలని గ్రీన్ కలర్ పెట్టి బాగా ఆడారని చెప్పింది. ఆదిత్య బాగా ఆడలేదని చెప్పింది. తనకు మణికంఠ బెస్ట్ పర్ఫార్మర్ అని నయనిక గ్రీన్ బ్యాడ్జ్ తొడిగింది. ఇక ఆ తరువాత యష్మీ వీడియోని వేసి తన అసలు రంగుని బయటపెట్టాడు నాగ్. వీడియో చూపించిన తరువాత యష్మీ ఏడుస్తూ, మొసలి కన్నీరు కారుస్తూ మాట మార్చింది. ఐదుగురు ఆకలితో ఉండటం ఇష్టం లేకే అలా చేశానని చెప్పింది. అదేదో ముందే చెప్పొచ్చు కదా? అని నాగార్జున కౌంటర్ వేశాడు.

ఇక యష్మీ, నయనికలు వరెస్ట్ అని, చీఫ్‌లుగా ఫెయిల్ అయ్యారని, ఆ రెండు క్లాన్స్‌లను తీసి పారేశాడు. దీంతో ఇంటి సభ్యుల్లో మెజార్టీ ఓట్లు రావడంతో అభయ్ నెక్ట్స్ చీఫ్‌గా ఎన్నికయ్యాడు. టాస్కులు బాగా ఆడి.. ప్రైజ్ మనీ ఎక్కువగా సంపాదించిన నిఖిల్.. చీఫ్‌గా కొనసాగాడు. అలా మూడో వారంలో ఇద్దరు చీఫ్‌లు, రెండు క్లాన్స్ మాత్రమే ఉంటాయని నాగ్ తెలిపాడు. చివరకు నయనిక, నిఖిల్‌లు సేఫ్ అయ్యారని నాగ్ ప్రకటించాడు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget