అన్వేషించండి

bigg boss 8 telugu 2nd week elimination: బిగ్‌బాస్‌ 8 రెండో వారం ఎలిమినేషన్‌ - ఈ ముగ్గురిలో హౌజ్‌ని వీడేది అతడే! - కావాలనే బలిపశువును చేశారా?

Bigg Boss 8 Elimination: బిగ్‌బాస్‌ 8 రెండో వారం పూర్తి చేసుకుంటుంది. సెకండ్‌ వీక్‌ ఎలిమినేషన్‌లో ఊహించని కంటెస్టెంట్‌ హౌజ్‌ని వీడబోతున్నాడు. ఆ ఇద్దరిలో అతడిని బలిపశువును చేశాడట బిగ్‌బాస్‌. 

Bigg Boss 8 Telugu Second Week Elimination: అప్పుడే బిగ్‌బాస్‌ 8 తెలుగు సెకండ్‌ వీక్‌ పూర్తి చేసుకుంది. అన్‌లిమిటెడ్‌ ఫన్‌, ట్విస్ట్స్‌ ఎన్నో అంచనాల మధ్య బిగ్‌బాస్‌ సెప్టెంబర్‌ ఫస్ట్‌న గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌ని హౌజ్‌లోకి దింపారు. అయితే ఇందులో యాంకర్‌ విష్ణు ప్రియ, నటుడు ఆదిత్య ఓం తప్పితే ఎవరూ పెద్దగా ఆడియన్స్‌కి పరిచయం లేదు. లావణ్య, రాజ్‌ తరుణ్‌ కేసులో శేఖర్‌ భాషా కొంతమందికి పరిచయం అయ్యాడు. ఇక సీరియల్‌ నటీనటులైన ప్రేరణ, నిఖిల్‌, యష్మీ గౌడలు పెద్దగా సుపరిచయం కాదు. దీంతో మొదటి వారం చప్పగా గడిచింది. కంటెస్టెంట్స్‌ ఆడియన్స్‌కి పరిచయం అయ్యే లోపే మొదటి వారం పూర్తై బెజవాడ బేబక్క ఫస్ట్‌వీక్‌ ఎలిమినేట్‌ అయ్యి హౌజ్‌ని వీడింది.

ఇక రెండో వారం గొడవలు, టాస్క్‌లతో కాస్తా ఆసక్తిగా పెంచింది షో. అంతేకాదు హౌజ్‌లో కంటెస్టెంట్స్‌ మధ్య కూడా బాండింగ్‌ పెరిగింది. మరోవైపు లవ్‌ ట్రాక్స్‌ కూడా మొదలయ్యాయి. కంటెస్టెంట్స్‌ కూడా ఆడియన్స్‌కి సుపరిచితం అవుతున్నారు. అలా రెండోవారం ఆసక్తిగా సాగుతున్న బిగ్‌బాస్‌ వీకెండ్‌కు వచ్చింది. అంటే హోస్ట్‌ నాగ్‌ వచ్చేసి హౌజ్‌మేట్స్‌ తప్పులు సరిచేస్తూ చివాట్లు పెట్టి వారిని దారిలో పెట్టేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు ఈ వారం ఎలిమినేషన్‌ కూడా ఉండబోతుంది. మొన్నటి వరకు డబుల్‌ ఎలిమేషన్‌ అంటూ ప్రచారం జరిగింది. కానీ, ఈ వారం ఒక్కరే హౌజ్‌ను వీడనున్నారట. ఇప్పటికే హౌజ్‌ని వీడే కంటెస్టెంట్‌ ఎవరా ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. 

రెండో వారం నామినేషన్‌లో 

ఇక రెండోవారం నామినేషన్‌లో భాగంగా హౌజ్‌ నుంచి బయటకు వెళ్లేవారిలో నాగమణికంఠ, కిర్రాక్‌ సీత, పృథ్వీ శెట్టి, నైనిక, శేఖర్‌ బాషా, విష్ణుప్రియ, ఆదిత్య, నిఖిల్‌ నామినేషన్‌లో ఉన్నారు. వీరందరి అత్యధిక ఓట్స్‌ తెచ్చుకుని నిఖిల్‌, విష్ణు ప్రియలు టాప్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఫస్ట్‌ సేవ్‌ అయ్యేది వారే అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత నాగ మణికంఠ సెకండ్‌ వీక్‌ తన ఆటతీరు మెరుగుపరుచుకుని మెరిట్‌ అయ్యాడు. కాబట్టి అతడికి కూడా బాగానే ఓట్లు పడ్డాయట. ఇక నైనిక హౌజ్‌లో స్ట్రాంగెస్ట్‌ కంటెస్టెంట్స్‌లో ఆమె ఒకరు కాబట్టి. ఈ వారం నైనిక సేఫే అని చెప్పాలి.  

ఆదిత్య ఓంపైనే అందరి కన్ను

ఇక మిగిలి ఉంది కిరాక్‌ సీత, ఆదిత్య ఓం, శేఖర్‌ భాషా, పృథ్వీ. ఈ వారం సీత కిరాక్‌ ఆటతో ఆడియన్స్‌ని మెప్పించింది. కాబట్టి ఆమెకు కూడా ఓట్లు బాగానే పడ్డాయట. ఇక పృథ్వీ.. అతడిని కదిలిస్తే చాలు గోడవలు, వాగ్వాదాలు సై అంటున్నాడు కాబట్టి ఇంకా కొంతకాలం అతడు హౌజ్‌లో ఉండటం ఖాయం. ఇక మిగిలింది ఆదిత్య, శేఖర్‌ భాషా. వీరిద్దరు హౌజ్‌ నుంచి బయటకు వెళ్లేందుకు ఎక్కువ అవకాశం ఆదిత్య ఓంకే ఉంది. అసలు హౌజ్‌లో ఉన్నాడా? లేదా? అన్నట్టుగా ఉంది అతడి ఆట తీరు. కాబట్టి అంతా ఆదిత్య ఓం ఎలిమినేట్‌ అవుతాడని అంచాలు వేస్తున్నారు. 

బిగ్‌బాస్‌ ట్విస్ట్‌

హౌజ్‌లో ఆట ఆడకపోయిన తన పిచ్చి కామెడీ ఆడియన్స్‌లో నానుతూ వచ్చాడు శేఖర్‌ భాషా. ప్రతి విషయంలో లాజిక్‌ లెస్‌ జోక్స్‌ వేస్తూ అందరికి చిరాక్‌ తెప్పిస్తు కాస్తో కూస్తో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నాడు. కానీ, రెండో వారంలో అసలు శేఖర్‌ భాషా ఆటే కనిపించలేదు. బిగ్‌బాస్‌ కూడా అతడిని ఆడిపించలేదు. చూస్తుంటే ఈ వారం శేఖర్‌ భాషా హౌజ్‌ నుంచి బయటకు పంపించేందుకు శేఖర్‌ భాషాను పక్కకు పెట్టాడనిపిస్తుంది.  అలా ఈ వారం ఆదిత్య ఓం వెళతాడు అనుకుంటే బిగ్‌బాస్‌ శేఖర్‌ భాషాను బలిపశువును చేశాడనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న బజ్‌ ప్రకారం రెండో వారం శేఖర్‌ భాషా ఎలిమినేట్‌ చేశారట. 

గుడ్‌న్యూస్‌ చెప్పి అంతలోనే షాక్‌

రెండో వారం వీకెండ్‌లో ఎపిసోడ్‌లో భాగంగా హోస్ట్‌ నాగ్‌ వచ్చేసి కంటెస్టెంట్స్‌కి చివాట్లు పెట్టారు. తప్పులు చేసిన వారిని వారించారు. బాగా ఆడిన వారిని మెచ్చుకున్నారు. అలాగే వచ్చి రాగానే శేఖర్‌ భాషా తండ్రి అయ్యావంటూ గుడ్‌న్యూస్ చెప్పారు. దీంతో హౌజ్‌మేట్స్‌ అంతా ఒక్కసారిగా భావోద్వేగంతో నిండిపోయింది. ఆ తర్వాత శేఖర్‌ భాషాకు నాగ్‌కు థ్యాంక్యూ అంటూ ఆనందంలో తేలియాడాడు. కానీ, తన కొడుకు చూసేందుకు ఎప్పుడో వెళతాడు అనుకుంటే రేపే అతడు ఇంటి బాట పట్టబోతున్నాడు. సోషల్‌ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది అతడే. కాబట్టి రేపటి శేఖర్‌ భాషా తన కొడుకుని చూసుకునే అవకాశం ఉంది. దీంతో ఇది శేఖర్‌ భాషాకు ఒకరకంగా గుడ్‌న్యూస్‌, బ్యాడ్‌న్యూస్‌ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

Also Read: శేఖర్‌ భాషాకు బిగ్‌బాస్‌ గుడ్‌న్యూస్‌ - విష్ణుప్రియ వ్యవహరంలో సోనియాను కడిగిపారేసిన నాగ్‌! అదిరిపోయిన లేటెస్ట్‌ ప్రొమో

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget